మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సమానమైన, సుస్థిర విద్యకు ప్రపంచం నిబద్ధతను న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ పునరుద్ఘాటించింది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ గ్లోబల్ సౌత్ గళాన్ని బలోపేతం చేసింది; ఏకాభిప్రాయం, భాగస్వామ్యం , సహకారం ఆధారంగా ప్రపంచ క్రమాన్ని మార్చింది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం భారతదేశ విద్యా పర్యావరణ వ్యవస్థకు ప్రపంచ గుర్తింపును తీసుకువచ్చింది; ఎన్ఇపి 2020 కు మద్దతు ఇచ్చింది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
11 SEP 2023 6:47PM by PIB Hyderabad
భారతదేశ కాలాతీత స్ఫూర్తి 'వసుధైవ కుటుంబకమ్'కు అనుగుణంగా జి 20 దార్శనిక నాయకత్వంతో ఈ భూమిపై కలిసి జీవించే ఈ ఒకే కుటుంబానికి ఒకే భవిష్యత్తును నిర్ధారించడానికి మానవ కేంద్రీకృత విధానాన్ని తీసుకువచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రగాఢ కృతజ్ఞతలు , హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆఫ్రికన్ యూనియన్ (ఎయు)ను ఈ ప్రతిష్టాత్మక సమూహంలో విజయవంతంగా చేర్చడంలో, జి 20 ను నిజంగా ప్రజాస్వామ్యీకరించడంలో, గ్లోబల్ సౌత్ గొంతుకు బలాన్ని ఇవ్వడంలో భారతదేశ నాయకత్వం ద్వారా ఈ సమ్మిళిత దార్శనికత సాకారమైంది. ఏకాభిప్రాయం, భాగస్వామ్యం, సహకారం ఆధారంగా ప్రపంచ క్రమాన్ని మార్చినందుకు భారత జి 20 అధ్యక్ష బాధ్యత ఫలవంతమైనదిగా ప్రశంసనీయమని శ్రీ ప్రధాన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
జి 20 కింద విద్యా ప్రాధాన్యతల గురించి శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్), సాంకేతిక ఆధారిత అభ్యాసం, జీవితకాల అభ్యసన కోసం సామర్థ్యాలను పెంపొందించడం, పని భవిష్యత్, భాగస్వామ్యం ద్వారా పని మరియు పరిశోధన , ఆవిష్కరణలను బలోపేతం చేయడం వంటి కీలక రంగాలపై చర్చలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ విద్య ద్వారా సమానమైన , సుస్థిర భవిష్యత్తు కోసం పనిచేయడానికి ప్రపంచ సంకల్పాన్ని పునరుద్ధరించిందని, దీనికి రోడ్ మ్యాప్ ను అందించిందని అన్నారు. జి 20 ఆర్కిటెక్చర్ కింద ప్రపంచ విద్యా ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించిన దార్శనిక నాయకత్వాన్ని , స్పష్టమైన కథనాన్ని శ్రీ ప్రధాన్ ప్రశంసించారు. దీని ఫలితంగా భారతదేశ విద్య, నైపుణ్య పర్యావరణ వ్యవస్థకు ప్రపంచ గుర్తింపు లభించిందని, మన జాతీయ విద్యా విధానం 2020 ప్రధాన సూత్రాలు, ప్రాధాన్యతలకు ఆమోదం లభించిందని ఆయన అన్నారు.
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, జస్ట్ గ్రీన్ ట్రాన్సిషన్, మహిళల నేతృత్వంలో అభివృద్ధి అనే మూడు యాక్సిలరేటర్లపై ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ ప్రాధాన్యాలను లీడర్స్ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని మంత్రి తెలిపారు. నాణ్యమైన విద్యతో సహా నిర్ణయాలు తీసుకునేవారిగా మహిళల అర్థవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే నిబద్ధత ను ఇది ప్రతిబింబిస్తుంది; విద్యతో సహా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం , ఎల్ఐఎఫ్ఇని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. మన ప్రధాన మంత్రి పోషణ్ కార్యక్రమం లక్ష్యమైన పాఠశాల భోజన కార్యక్రమాల్లో అందుబాటు, సరసమైన, సురక్షితమైన , పోషక ఆహారం , ఆరోగ్యకరమైన ఆహారానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని లీడర్స్ డిక్లరేషన్ లో ప్రముఖంగా పేర్కొన్నందుకు ప్రధాన మంత్రికి శ్రీ ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు.
లీడర్స్ డిక్లరేషన్ లో పొందుపరిచిన విద్యకు సంబంధించిన ఈ క్రింది అంశాలను విద్యాశాఖ మంత్రి వివరించారు.
- మన విద్యా వ్యవస్థలను మార్చడానికి, 21 వ శతాబ్దం సవాళ్లకు ప్రతిస్పందించడానికి మానవ మూలధన అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో పెట్టుబడి ప్రాముఖ్యత గుర్తించబడింది.
- ఎస్ డి జి 4 - నాణ్యమైన విద్య (క్వాలిటీ ఎడ్యుకేషన్) కు నిబద్ధతలో భాగంగా, పాఠశాలల పాత్ర , అభ్యాసకులందరి నమోదు , విద్యార్థులు ముఖ్యంగా దుర్బల వర్గాల వారు మధ్యలో మానకుండా రిటెన్షన్ పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు,
- 2030 నాటికి అభ్యాసకులందరూ ప్రాథమిక నైపుణ్యాలను పొందేలా తక్షణ , సమిష్టి చర్య అవసరమని, 2 లేదా 3 తరగతుల నాటికి చదవడం గణితం చేయలేని పిల్లల ముఖ్యంగా బాలికలు , వైకల్యం ఉన్న పిల్లల శాతాన్ని తగ్గించడం పునరుద్ఘాటించబడింది. ఇది భారతదేశ నిపుణ న భారత్ కార్యక్రమం సారాంశం.
- అభివృద్ధి చెందుతున్న ధోరణులు, విద్యలో డిజిటల్ సాంకేతిక పరిష్కారాల వాడకంలో మారుతున్న నమూనాలు, సరసమైన , అందుబాటులో ఉన్న అభ్యాస వనరులను అభివృద్ధి చేయడానికి వీలుగా డిజిటల్ సాంకేతికతల పరివర్తన సామర్థ్యం , సంస్థలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరాన్ని, విద్యలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పారు. స్వయం, దీక్ష వంటి కార్యక్రమాల ద్వారా భారత్ దీన్ని చేస్తోంది.
- స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ పై దృష్టి సారించి జీవితకాల అభ్యసనను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పాన్ని లీడర్స్ డిక్లరేషన్ లో ప్రముఖంగా పేర్కొన్నారు. సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి , డిజిటల్ మార్పుకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి కోసం ఏకీకృత ఫ్రేమ్ వర్క్ అవసరాన్ని గుర్తించింది. పి ఎం కె వి వై, యూనివర్సిటీలలో స్కిల్ సెంటర్లు, ఇతర కార్యక్రమాల ద్వారా మనం దీన్ని చేపడుతున్నాం.
- జాయింట్/డ్యూయల్, ట్విన్నింగ్ డిగ్రీ ప్రోగ్రామ్స్, విద్యార్థులు, అధ్యాపకుల చలనశీలతను పెంచడం వంటి ఉమ్మడి అకడమిక్, రీసెర్చ్ కార్యక్రమాల ద్వారా ఉన్నత విద్యా సంస్థల మధ్య పరిశోధన, ఆవిష్కరణల్లో సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను లీడర్స్ డిక్లరేషన్ గుర్తించింది.
జి 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు తదుపరి తీసుకుంటున్న అనంతర చర్యలపై శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, అనేక దేశాలతో పరిశోధనా భాగస్వామ్యాలు చురుకుగా జరుగుతున్నాయని తెలియజేశారు. కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి కౌన్సిల్), అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్శిటీస్ (ఎఎయు) మధ్య రెండు దేశాల లోని ప్రముఖ పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలను ఏకటాటి పైకి తెచ్చే ఇండో - యు ఎస్ గ్లోబల్ ఛాలెంజస్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ఇది ప్రతిబింబిస్తోంది. సుస్థిర ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యం , మహమ్మారి సన్నద్ధత, సెమీకండక్టర్ టెక్నాలజీ, తయారీ, అధునాతన పదార్థాలు, టెలికమ్యూనికేషన్స్, కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ సైన్స్ లో సహకారాన్ని విస్తరించడం ద్వారా సైన్స్ - టెక్నాలజీలో కొత్త సరిహద్దులను ముందుకు తీసుకెళ్లడం ఈ ఒప్పందం ఉద్దేశం. న్యూయార్క్ విశ్వవిద్యాలయం-టాండన్, ఐఐటి కాన్పూర్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్, బఫెలోలోని స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ , ఐఐటి ఢిల్లీ, కాన్పూర్, జోధ్ పూర్ , బిహెచ్ యుల మధ్య క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల రంగాలలో సంయుక్త పరిశోధనా కేంద్రాలు, చికాగో క్వాంటమ్ ఎక్స్ఛేంజ్ లో ఐఐటి బాంబే చేరడం , ఇండియా-యుఎస్ డిఫెన్స్ అక్సెలరేషన్ ఎకోసిస్టమ్ (ఇండస్-ఎక్స్) ప్రారంభం వంటి అనేక కొత్త , అభివృద్ధి చెందుతున్న బహుళ-సంస్థాగత సహకార విద్యా భాగస్వామ్యాలను కూడా మనం చూస్తున్నాము
నైపుణ్య రంగంలో నైపుణ్యం , అర్హత అవసరాల ఆధారంగా వృత్తుల అంతర్జాతీయ రిఫరెన్స్ వర్గీకరణను సృష్టించడం ద్వారా సభ్య దేశాలతో బహుళజాతి ప్రమాణాలను శానిటైజ్ చేయడం ఒక ప్రధాన దృష్టి అంశం, ఇది మెరుగైన క్రాస్-కంట్రీ పోలిక , అర్హతల పరస్పర గుర్తింపుకు దారితీస్తుంది.ఈ నిబద్ధతలో మూల , గమ్య దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చే సమర్థంగా నిర్వహించబడే, క్రమబద్ధమైన , నైపుణ్య ఆధారిత వలస మార్గాల ఏర్పాటుకు ప్రతిజ్ఞ ఉంది. ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, ప్రపంచ నైపుణ్య అంతరాలను గుర్తించడం , వాటిని పరిష్కరించడానికి ఉద్దేశించిన విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించారు, ఇందులో జాతీయ గణాంక డేటాను బలోపేతం చేయడం , అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ), ఒఇసిడి స్కిల్స్ ఫర్ జాబ్స్ డేటాబేస్ లను జి 20 దేశాలకు విస్తరించడం ఉన్నాయి.
ప్రపంచ నైపుణ్య అంతరాలను పర్యవేక్షించడానికి , కొలవడానికి ఐఎల్ఓ, ఒఇసిడి 12 ప్రాథమిక , 14 పొడిగించిన సూచికలను ప్రతిపాదించాయి. ఈ సూచికలను జి 20 దేశాలు అంగీకరించాయి. అంగీకరించిన సూచికల ఆధారంగా జి 20 దేశాలలో ప్రపంచ నైపుణ్య అంతరాలను పర్యవేక్షించడానికి ,కొలవడానికి జోక్యాన్ని అమలు చేయడానికి ఐఎల్ఓ ,ఒఇసిడి బాధ్యత వహిస్తాయి.
భారతదేశ జి 20 అధ్యక్ష పదవి మన విద్యా ప్రాధాన్యతలను, సందర్భోచిత వాస్తవాలను, జాతీయ చొరవలను ఎలా అందించిందో, దీర్ఘకాలిక వ్యవస్థాగత విధాన దృక్పథాన్ని ప్రదర్శించడానికి ఒక వేగాన్ని, వేదికను ఎలా అందించిందో శ్రీ ప్రధాన్ వివరించారు. సహకారం, విజ్ఞాన భాగస్వామ్యం, సృజనాత్మక విధానాలను పెంపొందించడం ద్వారా, భారతదేశం, దాని జి 20 భాగస్వాములు భవిష్యత్తు విద్య , శిక్షణా వ్యవస్థలపై సమన్వయ చర్యను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రేరణను సృష్టించారని ఆయన అన్నారు.
****
(Release ID: 1956520)
Visitor Counter : 157