ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి జి-20 దేశాధినేతల నివాళి
                    
                    
                        
నిత్య ఆచరణీయ గాంధీజీ ఆదర్శాలు సామరస్యపూర్వక.. సమగ్ర.. సుసంపన్న ప్రపంచ భవిష్యత్తు దిశగా మన సామూహిక దృక్పథాన్ని నిర్దేశిస్తాయి: ప్రధానమంత్రి
                    
                
                
                    Posted On:
                10 SEP 2023 12:26PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహా జి-20 సభ్య దేశాల అధినేతలు ఇవాళ న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీజీ ప్రబోధించిన నిత్యాచరణీయ ఆదర్శాలు సామరస్యపూర్వక, సమగ్ర, సుసంపన్న ప్రపంచ భవిష్యత్తు నిర్మానం దిశగా మన సామూహిక దృక్పథాన్ని నిర్దేశిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
   “శాంతి, సేవ, కరుణ, అహింస వంటి ఉన్నతాదర్శాలు ప్రబోధించిన మహాత్మా గాంధీకి విశిష్ట రాజ్‌ఘాట్ వద్ద జి-20 కూటమి ఘనంగా నివాళి అర్పించింది. విభిన్న దేశాలు ఒకే తాటిపైకి వచ్చిన నేపథ్యంలో గాంధీజీ ప్రబోధిత ఉన్నతాదర్శాలు సామరస్యపూర్వక, సమ్మిళిత, సంపన్న ప్రపంచ భవిష్యత్తు దిశగా మన సామూహిక దృక్పథాన్ని నిర్దేశిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కాగా,
 
   ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ పోస్టుద్వారా పంపిన సందేశంలో:
“జి-20 కుటుంబం బాపూజీకి నేడు నివాళి అర్పించింది. ప్రపంచ దేశాల అధినేతలు పలువురు రాజ్‌ఘాట్‌ను సందర్శించి అక్కడి మహాత్మా గాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు” అని పేర్కొంది.
 
                
                
                
                
                
                (Release ID: 1956039)
                Visitor Counter : 229
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam