పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

గ్లోబల్ ఎనర్జీ సెక్టార్‌లో చారిత్రాత్మక ఘట్టం: జి20 కార్యక్రమంలో గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ (జిబిఏ) ప్రకటన

Posted On: 09 SEP 2023 6:36PM by PIB Hyderabad

జి20 సమ్మిట్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్లోబల్ బయో ఫ్యూయల్స్ అలయన్స్ (జిబిఏ) ప్రకటనతో గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. జిబిఏ అనేది జీవ ఇంధనాల స్వీకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల కూటమిని అభివృద్ధి చేయడానికి భారతదేశం నేతృత్వంలోని తీసుకున్న ఒక కీలక చొరవ. జీవ ఇంధనాల అభివృద్ధి, విస్తరణను ముందుకు తీసుకెళ్లడానికి జీవ ఇంధనాల అతిపెద్ద వినియోగదారులను, ఉత్పత్తిదారులను ఒకచోట చేర్చడం, ఈ చొరవ జీవ ఇంధనాలను శక్తి పరివర్తనకు కీలకంగా ఉంచడం, ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధికి దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

జి20 ప్రెసిడెన్సీగా,  "వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్"కు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంగా భారత్  జిబిఏ ప్రకటన  కార్యాచరణ ఆధారిత స్వభావాన్ని ప్రదర్శిస్తుంది.

 ఇది పరిశ్రమలు, దేశాలు, పర్యావరణ వ్యవస్థ ప్రధాన భాగస్వాములు, డిమాండ్, సరఫరాను మ్యాపింగ్ చేయడంలో కీలకమైన వాటాదారులకు సహాయం చేయడానికి వర్చువల్ మార్కెట్‌ప్లేస్‌ను సమీకరించడాన్ని సులభతరం చేస్తుంది, అలాగే సాంకేతిక ప్రదాతలను తుది వినియోగదారులకు కనెక్ట్ చేస్తుంది. జీవ ఇంధనాల స్వీకరణ, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణాలు, సంకేతాలు, సుస్థిరత సూత్రాలు, నిబంధనలను అభివృద్ధి చేయడం, స్వీకరించడం, అమలు చేయడం కూడా ఇది సులభతరం చేస్తుంది.

ఈ చొరవ భారతదేశానికి బహుళ రంగాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. జి20 ప్రెసిడెన్సీ స్పష్టమైన ఫలితం జిబిఏ, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ కూటమి సహకారంపై దృష్టి సారిస్తుంది. సాంకేతికతను ఎగుమతి చేయడం మరియు ఎగుమతి చేసే పరికరాల రూపంలో భారతీయ పరిశ్రమలకు అదనపు అవకాశాలను అందిస్తుంది. ఇది పీఎం-జీవన్ యోజన, వంటి భారతదేశం ప్రస్తుత జీవ ఇంధన కార్యక్రమాలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, భారతీయ పర్యావరణ వ్యవస్థ మొత్తం అభివృద్ధికి దోహదం చేస్తుంది. గ్లోబల్ ఇథనాల్ మార్కెట్ విలువ 2022లో 99.06 బిలియన్ డాలర్లు, 2032 నాటికి 5.1% సిఏజిఆర్ వద్ద పెరుగుతుందని అంచనా. 2032 నాటికి 162.12 బిలియన్ డాలర్లు అధిగమిస్తుందని అంచనా . 

***



(Release ID: 1955960) Visitor Counter : 256