ప్రధాన మంత్రి కార్యాలయం

ఉమ్మడి ప్రగతి.. ఆవిష్కరణలు.. సహకారం కోసం మార్గదర్శిగా భారత-మధ్యప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్: ప్రధాన మంత్రి

Posted On: 09 SEP 2023 7:16PM by PIB Hyderabad

   భార‌త-మ‌ధ్య ప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. ఇది సహకారం, ఆవిష్కరణలు, ఉమ్మడి ఆశలు-ఆకాంక్షల సాకారం దిశగా పయనాన్ని సుగమం చేస్తుందన్నారు. అలాగే భాగస్వామ్య పురోగమనానికి తోడ్పడగలదని హామీ ఇచ్చారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఉమ్మడి ఆశలు-ఆకాంక్షల సాకారం దిశగా ప్రయనాన్ని భారత-మధ్యప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్ సుగమం చేస్తుంది. అంతేకాకుండా సహకారం, ఆవిష్కరణలు, భాగస్వామ్య ప్రగతికి దోహదం చేస్తామని హామీ ఇస్తోంది. చరిత్ర విస్తరించేకొద్దీ, మానవాళి కృషితోపాటు ఖండాల మధ్య ఐక్యతకు ఈ కారిడార్ ఒక ఉదాహరణగా రూపొందుతుందని ఆశిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1955914) Visitor Counter : 139