ప్రధాన మంత్రి కార్యాలయం
డిజిటల్ పబ్లిక్ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాధ్యం ద్వారా భారతదేశం లో అన్ని వర్గాల వారి ని ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకు రావడాన్ని ప్రశంసిస్తూ ప్రపంచ బ్యాంకు తీసుకువచ్చిన జి-20 పత్రం
Posted On:
08 SEP 2023 12:31PM by PIB Hyderabad
భారతదేశం అన్ని వర్గాల వారి ని ఆర్థిక సేవ ల పరిధి లోకి చేర్చే లక్ష్యాన్ని కేవలం ఆరు సంవత్సరాల లో సాధించిందని, ఇతర విధం గా అయితే దీని కి కనీసం 47 సుదీర్ఘ సంవత్సరాలు పట్టేదంటూ ప్రపంచ బ్యాంకు తన జి-20 డాక్యుమెంట్ లో పేర్కొన్న విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ ను ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేస్తూ, అందులో -
‘‘డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దన్నుతో అన్ని వర్గాల వారి ని ఆర్థిక సేవ ల అందజేత పరిధి లోకి తీసుకురావడం లో భారతదేశం వేసినటువంటి ఒక పెద్ద ముందడుగు.
‘‘భారతదేశం యొక్క వృద్ధి ని గురించిన చాలా ఆసక్తిదాయకం అయినటువంటి ఒక అంశాన్ని @WorldBank రూపొందించిన జి-20 పత్రం వెల్లడి చేసింది. ఫైనాన్శల్ ఇన్ క్లూజన్ లక్ష్యాల ను భారతదేశం కేవలం ఆరు సంవత్సరాల లో సాధించింది. ఇతర విధం గా అయితే దీని కోసం కనీసం 47 సుదీర్ఘమైన సంవత్సరాల కాలం పట్టేది.
మన దృఢమైన డిజిటల్ పేమెంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు మరియు మన ప్రజల ఉత్సాహాని కి ప్రశంస లు. ఇది సత్వర ప్రగతి కి మరియు నూతన ఆవిష్కరణ కు కూడ ఒక ప్రమాణం గా ఉంది.
https://www.news18.com/india/if-not-for-digital-payment-infra-in-6-yrs-india-would-have-taken-47-yrs-to-achieve-growth-world-bank-8568140.html"
అని పేర్కొన్నారు.
*******
DS/SKS
(Release ID: 1955529)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam