ప్రధాన మంత్రి కార్యాలయం
2023 సెప్టెంబరు 6వ, 7 వ తేదీల లో ఇండోనేశియా లోని జకార్తా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
Posted On:
02 SEP 2023 6:15PM by PIB Hyderabad
ఇండోనేశియా గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ జోకో విడోడో ఆహ్వానించిన మీదట, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం సెప్టెంబరు 6 వ - 7 వ తేదీల లో ఇండోనేశియా లోని జకార్తా కు బయలుదేరి వెళ్ళబోతున్నారు.
ప్రధాన మంత్రి తన సందర్శన కాలం లో, ఏశియాన్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతల ను నిర్వర్తిస్తున్నటువంటి ఇండోనేశియా నిర్వహిస్తున్న ఇరవయ్యో ఏశియాన్-ఇండియా సమిట్ లోను మరియు పద్దెనిమిదో ఈస్ట్ ఇండియా సమిట్ లోను పాలుపంచుకొంటారు.
త్వరలో జరుగనున్న ఏశియాన్-ఇండియా సమిట్ అనేది ఇండియా-ఏశియాన్ సంబంధాలు 2022 వ సంవత్సరం లో కుదిరినటువంటి ఒక విస్తృతమైన వ్యూహాత్మక భాగస్వామ్యం అనంతరం జరుగబోయే ఒకటో శిఖర సమ్మేళనం కానుంది. ఈ శిఖర సమ్మేళనం లో భాగం గా ఇండియా-ఏశియాన్ సంబంధాల లో పురోగతి ని సమీక్షించడం తో పాటుగా పరస్పర సహకారం తాలూకు భావి రూపు రేఖల ను కూడా ఖరారు చేయడం జరుగుతుంది.
ఏశియాన్ దేశాల నేతల కు మరియు భారతదేశం సహా చర్చ కార్యక్రమాల లో భాగస్వాములు గా ఉన్న ఎనిమిది సభ్యత్వ దేశాల కు ప్రాంతీయ ప్రాముఖ్యం మరియు ప్రపంచ ప్రాముఖ్యం కలిగిన అంశాల పై అభిప్రాయాల ను వెల్లడి చేసుకొనేందుకు అవకాశాన్ని ఈస్ట్ ఏశియా సమిట్ అందించనుంది.
***
(Release ID: 1954769)
Visitor Counter : 208
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam