ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేన్సర్ ను నయం చేసేందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసంజరుగుతున్న ప్రయాసల ను మెచ్చుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 01 SEP 2023 8:11AM by PIB Hyderabad

కేన్సర్ ను నయం చేసేందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసం జరుగుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

 

శ్రమ మరియు ఉపాధి ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ‘X’ లో ఒక పోస్టు ను పెడుతూ, అందులో ఇఎస్ఐ కార్పొరేశన్ యొక్క 191 వ సమావేశం జరిగిన సందర్భం లో భారతదేశం అంతటా విస్తరించి ఉన్న 30 ఇఎస్ఐసి ఆసుపత్రుల లో కీమో థెరపి సేవల ను ప్రారంభించడమైంది అని తెలియ జేశారు.

 

దీనికి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘కేన్సర్ ను నయం చేయడం కోసం ఉద్దేశించినటువంటి మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసం చేపట్టినటువంటి అభినందనీయమైన ప్రయాస. దీనితో దేశవ్యాప్తం గా అనేక మంది ప్రజల కు మేలు కలుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 1953981) Visitor Counter : 160