ప్రధాన మంత్రి కార్యాలయం

వంటగ్యాస్‌ ధర తగ్గింపుతో సోదరీమణులకు జీవన సౌలభ్యం మెరుగు: ప్రధానమంత్రి


ఎల్పీజీ సిలిండర్ ధర ₹200 తగ్గిస్తూ ప్రధానమంత్రి సాహసోపేత నిర్ణయం

Posted On: 29 AUG 2023 6:19PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను ₹200 మేర తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దేశంలోని వినియోగదారులందరికీ- అంటే… 33 కోట్ల మంది ఎల్‌పిజి వాడకందారులకు ప్రయోజనం కలుగుతుంది.

  ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ- రాఖీ పండుగ శుభ సందర్భంలో ఇది మన కుటుంబాల్లో ఆనందం ఇనుమడింపే చేసు రోజుగా ఆయన అభివర్ణించారు.

   ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు వారి ఖాతాల్లో ప్రతి సిలిండరుకు ₹200 వంతున సబ్సిడీ జమ అవుతుంది.

   ఈ పథకం కింద మరో 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది.

   ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్‌’ పోస్టులపై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

   “రక్షాబంధన్ పర్వదినం మనందరి కుటుంబంలో ఆనందాన్ని ఇనుమడింపజేసే రోజు. ఈ సందర్భంగా వంటగ్యాస్ ధర తగ్గింపు మన సోదరీమణులకు సౌకర్యం పెంచి, వారి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మేరకు నా ప్రతి సోదరి సంతోషంగా.. ఆరోగ్యంగా.. సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.

మరింత సమాచారం కోసం కింది వెబ్‌ చిరునామాను క్లిక్‌ చేయండి: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1953314

*****



(Release ID: 1953319) Visitor Counter : 131