ప్రధాన మంత్రి కార్యాలయం
మొజాంబిక్గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ జేసింటో న్యూసీ తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
24 AUG 2023 11:21PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం సందర్భం లో 2023 ఆగస్టు 24వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో మొజాంబిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ జేసింటో న్యూసీ తో సమావేశమయ్యారు.
నేత లు ఇరువురూ ద్వైపాక్షిక సంబంధాల ను ముందుకు తీసుకుపోయే పద్ధతుల ను గురించి సార్థక చర్చలు జరిపారు. చర్చ కు వచ్చిన ప్రముఖమైన అంశాల లో పార్లమెంటరీ సంబంధాలు, రక్షణ, ఉగ్రవాదాని కి ఎదురొడ్డి నిలవడం, శక్తి, గనుల త్రవ్వకం, ఆరోగ్యం , వ్యాపారం మరియు పెట్టుబడి, సామర్థ్యాల నిర్మాణం, సముద్ర సంబంధి సహకారం మరియు ప్రజల మధ్య సంబంధాలు వంటివి ఉన్నాయి.
వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌథ్ సమిట్ లో అధ్య అధ్యక్షుడు శ్రీ న్యూసీ పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
చంద్రయాన్ మిశన్ సఫలం అయినందుకు అధ్యక్షుడు శ్రీ న్యూసీ ప్రధాన మంత్రి కి అభినందనలను తెలియజేశారు. ఆఫ్రికన్ యూనియన్ లో జి20 కి శాశ్వత సభ్యత్వం కోసమని భారతదేశం చొరవ ను తీసుకోవడాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
***
(Release ID: 1952192)
Visitor Counter : 106
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam