ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ది ఆర్డర్ ఆఫ్ ఆనర్’ ద్వారా ప్రధాన మంత్రి ని సమ్మానించిన గ్రీస్అధ్యక్షురాలు

Posted On: 25 AUG 2023 3:04PM by PIB Hyderabad

గ్రీస్ అధ్యక్షురాలు కతెరీనా సకెలారోపూలూ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్’ తో సమ్మానించారు.

'ద ఆర్డర్ ఆఫ్ ఆనర్’ ను 1975 వ సంవత్సరం లోస్థాపించడమైంది. స్టార్ కు ముందు వైపు న ఎథెన దేవత శిరో భాగం తో పాటు ‘నీతివంతమైన వ్యక్తుల ను మాత్రమే గౌరవించాలి’’ అనే పదాలు చెక్కి ఉన్నాయి.

ప్రధాన మంత్రులు మరియు ప్రసిద్ధ వ్యక్తులు గ్రీస్ యొక్క స్థాయి ని వృద్ధి చెందింప చేసేందుకు వారి యొక్క విశిష్టమైన పదవి రీత్యా తోడ్పాటు ను అందించిన సందర్భాల లో ‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్’ ను గ్రీస్ ప్రెసిడెంట్ వారి కి ప్రదానం చేస్తూ వస్తున్నారు.

‘‘భారతదేశం యొక్క స్నేహపూర్వకమైన ప్రజల కు ఈ యొక్క గౌరవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూపం లో అన్వయించడం జరుగుతున్నది.’’ అని ఈ సమ్మానం యొక్క ప్రశస్తి పత్రం లో పేర్కొనడమైంది.

ప్రశస్తి పత్రం లో ఇంకా ఈ క్రింది మాట లు కూడా చోటు చేసుకొన్నాయి. ‘‘సాహసోపేతమైనటువంటి సంస్కరణల ను తీసుకు రావడం ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి కోసం మరియు సమృద్ధి కోసం పద్ధతి ప్రనకారం కృషి చేస్తూ, స్వదేశం యొక్క గ్లోబల్ రీచ్ ను ప్రోత్సహించడం కోసం అలుపెరుగక పాటుపడుతున్నటువంటి ఒక వ్యవహార కుశలుడు అయిన భారతదేశం ప్రధాన మంత్రి గ్రీస్ సందర్శన కు వచ్చిన వేళ ఆయన ను గ్రీకు దేశం సమ్మానిస్తున్నది. అంతర్జాతీయ కార్యకలాపాల లో పర్యావరణ పరిరక్షణ ను మరియు జలవాయు పరివర్తన కు అగ్ర ప్రాధాన్యాన్ని కట్టబెట్టిన రాజనీతి కుశలుడు ఆయన.’’

పరస్పర హితం ముడిపడిన రంగాల లో గ్రీకు-భారతీయ మైత్రి నివ్యూహాత్మకం గా ప్రోత్సహించడం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్కనిర్ణయాత్మకమైనటువంటి తోడ్పాటు ను సైతం గుర్తింపు ను ఇవ్వడం జరిగింది.

గ్రీసు అధ్యక్షురాలు కతెరీనా సకెలారోపూలూ గారికి, గ్రీస్ ప్రభుత్వాని కి మరియు గ్రీస్ ప్రజల కు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యం ‘X’ లో ఒక ట్వీట్ ను పోస్ట్ చేశారు.

 


(Release ID: 1952189) Visitor Counter : 159