ప్రధాన మంత్రి కార్యాలయం
ఎఫ్ఐడిఇ ప్రపంచ కప్ లో ప్రశంసాయోగ్యమైన ఆటతీరు ను కనబరచినందుకుశ్రీ ప్రజ్ఞానంద కు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 AUG 2023 6:53PM by PIB Hyderabad
ఎఫ్ఐడిఇ (ఫిడే) ప్రపంచ కప్ లో ప్రశంసాయోగ్యమైనటువంటి ఆటతీరు ను కనబరచినందుకు చదరంగం గ్రాండ్ మాస్టర్ శ్రీ ఆర్. ప్రజ్ఞానంద ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి X మాధ్యం లో ఒక ట్వీట్ ను పోస్ట్ చేస్తూ, అందులో -
‘‘ఫిడే వరల్డ్ కప్ లో ప్రశంసాయోగ్యమైన ఆటతీరు ను కనబరచిన శ్రీ ప్రజ్ఞానంద ను చూసి మనం గర్వపడుతున్నాం. ఆయన అసాధారణమైనటు వంటి కౌశలాన్ని ప్రదర్శించి, మరి బలవత్తరమైన శ్రీ మేగ్నస్ కార్ల్ సన్ కు ఫైనల్స్ లో గట్టి పోటీ ని ఇచ్చారు. ఇది చిన్న కార్యసిద్ధి ఏమీ కాదు. ఆయన పాలుపంచుకోబోయే భావి ఆటల పోటీల లో అత్యుత్తమం గా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను.’’ అని వ్రాశారు.
*****
DS
(रिलीज़ आईडी: 1951989)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam