ప్రధాన మంత్రి కార్యాలయం

అధిక సౌకర్యాలతోకూడిన సంక్షేమ పథకాల తోపదవీవిరమణ చేసినసైనికుల జీవన స్థాయి మెరుగు పడుతుంది : ప్రధాన మంత్రి 

Posted On: 11 AUG 2023 8:52PM by PIB Hyderabad

పదవీవిరమణ చేసిన సైనికుల కోసం ఉన్నత ప్రయోజనకారి పథకాల ను అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ద్వారా ఆ కోవ కు చెందిన సైనికుల యొక్క జీవన స్థాయి మెరుగు పడుతుంది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

మాజీ సైనికుల యొక్క సంక్షేమాని కి అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్న మరియు వారి జీవనాన్ని సరళతరం గా మలచాలన్న విధానానికి అనుగుణం గా, పూర్వ సైనికుల కోసం సంక్షేమ పథకాల లో భాగం గా ఇస్తున్నటువంటి సొమ్ము ను ఈ క్రింది విధం గా పెంచడమైంది అని కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ తెలియ జేశారు.

 

1. హవల్ దార్ /తత్సమాన హోదా కలిగిన వారి యొక్క వితంతువుల కు వృత్తి సంబంధి శిక్షణ పరమైన గ్రాంటు ను 20,000 రూపాయల నుండి 50,000 కు ;

2. పింఛన్ దారులు కాని పదవీవిరమణ పొందిన సైనికుల కు / వారి యొక్క వితంతువుల కు ఇచ్చేటటువంటి వైద్య చికిత్స పరమైన గ్రాంటు ను 30,000 రూపాయల నుండి 50,000 రూపాయల కు;

 

3. గంభీరమైన రోగాలకు గాను పింఛన్ దారులు కాని పదవీవిరమణ పొందిన సైనికుల కు / అన్ని ర్యాంకుల కు చెందిన అదికారుల యొక్క వితంతువుల కు ఇచ్చేటటువంటి గ్రాంటు ను 1.25 లక్షల రూపాయల నుండి పెంచి 1.50 లక్షల రూపాయల కు .. పెంచడం జరిగింది.

 

ఈ విషయం లో ప్రధాన మంత్రి తన ప్రతిస్పందన ను వ్యక్తం చేస్తూ -

‘‘భారతదేశం మన దేశ ప్రజల ను కాపాడినటువంటి శూర మాజీ సైనికుల ను చూసుకొని గర్వపడుతున్నది. మాజీ సైనికుల కోసం అధిక సౌకర్యాలతో కూడినటువంటి సంక్షేమ కారి పథకాల ను అమలులోకి తీసుకు వచ్చినందువల్ల వారి యొక్క జీవన స్థాయి లో చాలా వరకు మెరుగుదల చోటు చేసుకోగలదు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 



(Release ID: 1950709) Visitor Counter : 85