ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య బహదూర్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి సంస్మరణ

Posted On: 19 AUG 2023 6:34PM by PIB Hyderabad

   మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య బహదూర్ జయంతి నేపథ్యంలో ఆయనను సంస్మరించుకుంటున్నాను. ఆయన దృక్పథం, నాయకత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. త్రిపుర రాష్ట్ర సామాజిక-ఆర్థిక ప్రగతి కోసం నిర్విరామంగా శ్రమించిన గొప్ప వ్యక్తిగా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

******

DS/ST


(Release ID: 1950674) Visitor Counter : 131