ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అపోహలు Vs వాస్తవాలు


సిస్టమ్‌లో చనిపోయినట్లు చూపిస్తున్న ఎబి-పీఎం-జె లబ్ధిదారులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారంటూ మీడియా వార్తలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి

చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన తేదీకి మూడు రోజులకు ముందు ముందస్తు అనుమతి కోసం ఎబి-పీఎం-జె ఆసుపత్రులు అభ్యర్థనను పంపుతాయి. కొన్ని సందర్భాల్లో సమయంలో చికిత్స పొందుతున్న రోగులు మరణించే అవకాశం ఉంది.

Posted On: 17 AUG 2023 4:18PM by PIB Hyderabad

సిస్టమ్‌లో చనిపోయినట్లు చూపిస్తున్న ఎబి-పీఎం-జె లబ్ధిదారులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గుర్తించిందంటూ కొన్ని పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి.  ఒకే సమయంలో ఒకే లబ్ధిదారుడు   . రెండు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు కూడా కాగ్ గుర్తించిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి.ఈ వార్తలు  తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. వీటిలో ఎటువంటి వాస్తవం లేదు.   

2018 సెప్టెంబర్ నుంచి 2021 మార్చి నెల వరకు  ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి - జన్ ఆరోగ్య యోజన ( ఎబి-పీఎం-జె  )  పనితీరుకు సంబంధించి  కంప్ట్రోలర్ అండ్  ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రూపొందించిన  నివేదిక 2023 వర్షాకాల సమావేశాలలో పార్లమెంటు ముందు ఉంచబడింది. 

ఎబి-పీఎం-జె కింద చికిత్స పొందడానికి ఒక రోగి  ఆసుపత్రిలో చేరిన తేదీ కంటే మూడు రోజుల ముందుగానే ముందస్తు అనుమతి కోసం అభ్యర్థనను పంపేందుకు ఆసుపత్రులకు అనుమతి ఉందని స్పష్టం చేయబడింది. పరిమిత సౌకర్యాలు , అత్యవసర పరిస్థితులు మొదలైన సందర్భాల్లో చికిత్స  తిరస్కరణను  నివారించడానికి ఈ విధానం అమలు జరుగుతోంది. 

 

కొన్ని సందర్భాల్లో ఆస్పత్రిలో రోగులు చేరిన తర్వాత  ముందస్తు అనుమతి కోసం ఆస్పత్రుల నుంచి అందిన అభ్యర్థనకు ఆమోదం తెలపక ముందే చికిత్స పొందుతూ  రోగి మరణించే అవకాశం ఉంటుంది.   అటువంటి సందర్భాలలో రోగి  మరణించిన తేదీ ఆపత్రిలో చేరిన తేదీ లేదా అంతకు ముందు ఒకే విధంగా ఉంటుంది. . అంతేకాకుండా,రోగి మరణించినట్టు  ముందస్తు అనుమతి అభ్యర్థనను లేవనెత్తిన  ఆసుపత్రి నివేదిక పంపుతుంది. మోసం చేయాలనే ఉద్దేశం సదరుఆస్పత్రికి ఉంటే సదరు రోగి చనిపోయినట్టు ఐటీ సిస్టం లో చూపించడానికి ఎటువంటి ప్రయత్నం చేయదు.

కాగ్ నివేదికలో ప్రస్తావించిన కేసుల్లో  50% కంటే ఎక్కువ కేసులు ప్రభుత్వ ఆసుపత్రులకు చెందినవని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది.మోసం చేయడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు ఎటువంటి ప్రయోజనం కల్గదు.నిధులు నేరుగా  ఆసుపత్రి ఖాతాలో జమ అవుతాయి. చికిత్స సమయంలో మరణించిన సందర్భంలో రోగి మరణించిన సమయంలో  ఆసుపత్రి తప్పనిసరిగా మరణ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 

రోగి ప్రైవేట్ పేషెంట్‌గా (స్వీయ-చెల్లింపు) ఆసుపత్రిలో చేరిన అనేక సందర్భాలు కూడా ఉన్నాయి, అయితే ఆ పథకం వివరాలు,  పథకం కింద వారి అర్హత గురించి తెలుసుకున్న తర్వాత,రోగి వారిని ఉచిత చికిత్స కోసం పథకం కింద నమోదు చేయమని ఆసుపత్రిని అభ్యర్ధించిన సందర్భాలు ఉన్నాయి. వెనుకటి తేదీ నుంచి ముందస్తు అనుమతికి అభ్యర్ధన పంపడం వల్ల  లబ్ధిదారులు చికిత్స కోసం సొంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. 

ఒకే రోగి రెండు ఆసుపత్రుల్లో  ఒకేసారి చికిత్స పొందడంపై వివరణ... , ఎబి-పీఎం-జె కింద 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రుల ఆయుష్మాన్ కార్డుపై చికిత్స పొందడానికి అర్హత కలిగి ఉంటారని గమనించాల్సి ఉంటుంది.  దీని ప్రకారం, ఆయుష్మాన్ కార్డ్‌ని రెండు వేర్వేరు ఆసుపత్రులలో పిల్లలు, వారి  తల్లిదండ్రులు  ఏకకాలంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఒక తల్లి ఆసుపత్రిలో చేరి  చికిత్స సమయంలో శిశువుకు జన్మ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి  తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో నియో-నేటల్ కేర్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు, అందువల్ల, బిడ్డను  నియో-సౌకర్యం  ఉన్న మరో ఆసుపత్రికి తరలించవచ్చు. ఈ సందర్భంలో తల్లి ఆయుష్మాన్ కార్డును తల్లి, బిడ్డకు చికిత్స అందించడాని ఏకకాలంలో ఉపయోగించబడుతుంది. తండ్రి ఆయుష్మాన్ కార్డ్‌పై రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో తండ్రి, బిడ్డ ఒకేసారి చికిత్స పొందడం మరొక ఉదాహరణ.

సాధారణంగా తల్లి మరియు బిడ్డ ఒక ఆయుష్మాన్ కార్డ్‌ పై మాత్రమే చికిత్స  పొందుతారు.  చికిత్స సమయంలో బిడ్డ చనిపోతే, ఆసుపత్రి బిడ్డ చనిపోయినట్టు ప్రకటిస్తుంది.  ఇది తల్లి కార్డు పై తప్పుగా నమోదు చేయబడుతుంది. తదనంతరం, తల్లి తదుపరి చికిత్స కోసం వచ్చినప్పుడు ఆయుష్మాన్ కార్డ్ రికార్డుల్లో ఆమె  చనిపోయినట్లు గుర్తించబడిన కారణంగా సేవలు నిరాకరిస్తారు. . అటువంటి సందర్భాలలో ఫిర్యాదులు అందినప్పుడు తప్పును సరిచేసి తల్లి మరణించినట్టు పొందుపరిచిన నివేదికను తొలగిస్తారు.

ఎబి-పీఎం-జె కింద నాలుగు-దశల బలమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అమలులో ఉందని గుర్తించాల్సి ఉంటుంది. ఆసుపత్రి నుంచి అందే నివేదికను లోతుగా పరిశీలిస్తారు. ఇంకా, తదుపరి విచారణ అవసరమని గుర్తించిన   కేసులను మార్గదర్శకాల ప్రకారం మరింత లోతుగా విచారిస్తారు. ఇటువంటి కేసులు డెస్క్, ఫీల్డ్ ఆడిట్‌ నిర్వహిస్తారు. . ఒకవేళ ఆసుపత్రి ఏదైనా మోసం లేదా దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించినట్లయితే, తప్పు చేసిన ఆసుపత్రికి వ్యతిరేకంగా డి-ఎంపానెల్‌మెంట్‌తో సహా శిక్షాస్పద చర్యలు అమలు జరుగుతాయి. 

ఒకే మొబైల్ నంబర్‌ తో పలువురు  లబ్ధిదారులు లభ్ది పొందుతున్నారని కాగ్ గుర్తించిందని మరో వార్త వచ్చింది. అయితే, దీనిలో  ఎటువంటి నిర్వహణ, ఆర్థిక అంశాలు ముడిపడి లేవు. ఆయుష్మాన్ భారత్ పీఎం జె  కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ మొబైల్ నంబర్‌తో లింక్ చేయలేదు.   ఏదైనా అవసరం వచ్చినప్పుడు లబ్ధిదారులను చేరుకోవడం కోసం మరియు అందించిన చికిత్సకు సంబంధించి అభిప్రాయాన్ని సేకరించడం కోసం మాత్రమే మొబైల్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. 

 ఆధార్ గుర్తింపు ద్వారా లబ్ధిదారులను ఆయుష్మాన్ భారత్ పీఎం జె గుర్తిస్తుంది, ఇందులో లబ్ధిదారు తప్పనిసరిగా ఆధార్ ఆధారితఈ-కెవైసి  ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. . ఆధార్ డేటాబేస్ నుండి సేకరించిన  వివరాలు సోర్స్ డేటాబేస్‌తో సరిపోల్చిన తర్వాత    లబ్ధిదారుల వివరాల ఆధారంగా ఆయుష్మాన్ కార్డ్ అభ్యర్థన ఆమోదించబడుతుంది లేదా తిరస్కరించబడుతుంది. అందువల్ల, ధృవీకరణ ప్రక్రియలో మొబైల్ నెంబర్ పాత్ర ఉండదు.

ఆయుష్మాన్ భారత్ పీఎం జె  కింద ప్రయోజనం పొందుతున్న వారిలో ఎక్కువ మందికి మొబైల్ నెంబర్ ఉండకపోవచ్చు లేదా మొబైల్ నంబర్ చాలా తరచుగా  మారుతూ ఉంటుంది. దీనిని గుర్తించిన జాతీయ ఆరోగ్య సంస్థ  మూడు అదనపు ఎంపికలను- వేలిముద్ర, ఐరిస్ స్కాన్ , ఓటీపీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటిలో వేలిముద్ర ఎక్కువగా ఉపయోగించబడుతుంది.

పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా, లబ్ధిదారుడు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ని కలిగి లేడు లేదా వారు ఇచ్చిన మొబైల్ నెంబర్ మార్చబడింది అనే కారణంతో లబ్ధిదారులకు చికిత్స నిలిపివేయబడదు. దీని ప్రకారం, ఆయుష్మాన్ భారత్ పీఎం జె    చికిత్స లో  లబ్ధిదారుల మొబైల్ నంబర్‌ పాత్ర పరిమితంగా ఉంటుంది.  అలాగే, ఆయుష్మాన్ భారత్ పీఎం జె    అనేది అర్హత-ఆధారిత పథకం.  ఎన్‌రోల్‌మెంట్ ఆధారిత పథకం కాదు.  కాబట్టి, లబ్ధిదారుల డేటాబేస్ స్థిరంగా ఉంది.  కొత్త లబ్ధిదారులను జోడించడానికి సవరించబడదు. అందువల్ల, లబ్ధిదారుల అర్హతను నిర్ణయించడంలో మొబైల్ నంబర్‌లకు పాత్ర ఉండదు. అందువల్ల, లబ్ధిదారులు మొబైల్ నంబర్‌ను ఉపయోగించి చికిత్స పొందవచ్చనేది తప్పుడు ఊహ.

బహుళ లబ్ధిదారులచే ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించడం పై వివరణ...  లబ్ధిదారుల ధృవీకరణ కోసం మొబైల్ నెంబర్ తప్పనిసరి కాదని గమనించవచ్చు. అయితే, మొబైల్ నంబర్‌లను సేకరించడానికి అవకాశం  ఉన్నందున, పథకం అమలు ప్రారంభ దశల్లో కొన్ని సందర్భాల్లో క్షేత్ర స్థాయి కార్మికులు కొన్ని యాదృచ్ఛిక పది అంకెల సంఖ్యను నమోదు చేసే అవకాశం ఉంది. ప్రారంభంలో, చాలా మంది లబ్ధిదారులు మొబైల్‌ని తమ వెంట తీసుకెళ్లకపోవడం లేదా వారి బంధువులు లేదా పొరుగువారి నంబర్‌ను షేర్ చేయడం వల్ల ఓటీపీ  ఆధారిత ధ్రువీకరణ ప్రారంభం కాలేదు. . ఏదేమైనప్పటికీ, మొబైల్ నంబర్‌లను ధృవీకరించకపోవడం లబ్ధిదారుల ధృవీకరణ ప్రక్రియ యొక్క ఖచ్చితత్వాన్ని లేదా పథకం కింద లబ్ధిదారుల అర్హత  చెల్లుబాటును ప్రభావితం చేయదు.

చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌లను మాత్రమే నమోదు  చేయడానికి జాతీయ ఆరోగ్య సంస్థ ఉపయోగిస్తున్నఐటీ    పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేయబడ్డాయి, 

పనితీరు ఆడిట్ లో కాగ్ చేసిన సిఫార్సులను జాతీయ ఆరోగ్య సంస్థ,  ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ   పరిశీలిస్తున్నాయి, ఇప్పటికే ఉన్న ఐటీ వ్యవస్థ,  ప్రక్రియలను బలోపేతం చేయడం ద్వారా వ్యవస్థను మరింత పటిష్టంగా, సమర్థవంతంగా అమలు  చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

 

***



(Release ID: 1950036) Visitor Counter : 128