మంత్రిమండలి
ఔషధాల నియంత్రణ రంగంలో భారత్, సురినామ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం
Posted On:
16 AUG 2023 4:24PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సురినామ్ లో భారత ఫార్మాకోపియా (ఐపి)ను గుర్తించడం కోసం భారత ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ , సురినామ్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖల మధ్య 2023 జూన్ 4న కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఒయు) గురించి చర్చించారు. సురినామ్ లో భారత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.
ఆయా చట్టాలు , నిబంధనలకు అనుగుణంగా ఔషధాల నియంత్రణ రంగంలో సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకోవడం , సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ప్రాముఖ్యతను పార్టీలు గుర్తిస్తాయి. ఈ క్రింది అవగాహనలను చేరుకుంటాయి:
*సురినామ్ లో తయారు అవుతున్న/లేదా దిగుమతి చేసుకుంటున్న ఔషధాల నాణ్యతను ధృవీకరించడం కోసం సురినామ్ లో ఔషధాల ప్రమాణాల పుస్తకంగా ఇండియన్ ఫార్మాకోపియా (ఐపి)ని ఆమోదించడం;
*ప్రతి ఐపికి భారతీయ తయారీదారులు జారీ చేసే సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ ను ఆమోదించడం ; సురినామ్ లో ఔషధాల డూప్లికేట్ టెస్టింగ్ ఆవశ్యకతను తొలగించడం;
*నాణ్యత నియంత్రణ విశ్లేషణ సమయంలో ఉపయోగించడానికి ఐ పి సి నుండి ఐ పి ఆర్ ఎస్ ను, అపరిశుద్ధ ప్రమాణాలను సహేతుకమైన తక్కువ ఖర్చుతో పొందడం;
*జనరిక్ ఔషధాల అభివృద్ధికి మంచి అవకాశం కల్పించడం , సురినామ్ లో సరసమైన ధరలో ఔషధాల లభ్యతకు దోహదపడటం;
*రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, అవసరాలు, ప్రక్రియలలో ఫార్మకోపియా అవగాహనను ప్రోత్సహించడం;
*ఐ పి మోనోగ్రాఫ్ ల అభివృద్ధికి సంబంధించిన సమాచారం , డాక్యుమెంటేషన్ మార్పిడిని సులభతరం చేయడం;
*ప్రజారోగ్యానికి సంబంధించిన లేదా దానికి సంబంధించి తమ సేవలను అందించడంలో నియంత్రణ అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆయా జనాభా అవసరాలను తీర్చడం;
*మోనోగ్రాఫ్ లు , భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంకేతిక సహకారానికి అవకాశాలను అన్వేషించడం. విదేశీ మారకద్రవ్యం ఆదాయానికి దారితీసే వైద్య ఉత్పత్తుల ఎగుమతికి ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక ముందడుగు.
భారతీయ ఫార్మాకోపియాకు అంతర్జాతీయ గుర్తింపు, ప్రమాణాల వల్ల భారత ఫార్మాస్యూటికల్ రంగానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఇవి ఉన్నాయి:
*ఇది ఈ దేశాలకు భారతీయ ఔషధ ఉత్పత్తుల ఎగుమతిని పెంచుతుంది, ఎందుకంటే ఇది డబుల్ రెగ్యులేషన్, టెస్టింగ్ ,పోస్ట్ ఇంపోర్టేషన్ తనిఖీలను తొలగిస్తుంది. తద్వారా భారత ఔషధ ఎగుమతిదారులు పోటీతత్వాన్ని పొంది, వాణిజ్యం మరింత లాభదాయకంగా మారుతుంది.
*అంతేకాకుండా దిగుమతి చేసుకునే దేశాలకు సరసమైన ధరల్లో నాణ్యమైన భారతీయ వైద్య ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
*దిగుమతి చేసుకునే దేశాల్లోని తయారీదారులు తమ పౌరులకు తక్కువ ధరలో ఔషధాల లభ్యతకు దోహదపడే జెనరిక్ ఔషధాల అభివృద్ధికి మెరుగైన అవకాశాలను కలిగి ఉంటారు.
*వివిధ రిఫరెన్స్ ప్రమాణాలు , మలిన ప్రమాణాలు ఈ తయారీదారులకు సహేతుకమైన ఖర్చుతో లభిస్తాయి.
రెగ్యులేటరీ విధానాల్లో సమన్వయం భారతదేశం నుండి ఔషధాల ఎగుమతిని పెంచడానికి సహాయపడుతుంది. ఫార్మాస్యూటికల్ రంగంలో విద్యావంతులైన నిపుణులకు మెరుగైన ఉపాధి అవకాశాలకు దోహదపడుతుంది.
ఇండియన్ ఫార్మాకోపియా (ఐపి) అధికారికంగా ఐదు (5) దేశాల- ఆఫ్ఘనిస్తాన్, ఘనా, నేపాల్, మారిషస్ , రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ - గుర్తింపు పొందింది.. ఐపిని గుర్తించే దేశాలను ఇంకా విస్తరించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
*****
(Release ID: 1949685)
Visitor Counter : 144
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam