మంత్రిమండలి

మెడికల్ ప్రొడక్ట్స్ రెగ్యులేషన్ రంగంలో భారత్, సురినామ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం

Posted On: 16 AUG 2023 4:26PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 2023 జూన్ 4 జరిగిన కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (సి.డి.ఎస్.సి.), భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సురినామ్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారానికి సంబంధించి కుదిరిన అవగాహన ఒప్పందం గురించి వివరించారు. సురినామ్ లో భారత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరింది.

వైద్య ఉత్పత్తులతో పాటు ఇతర సంబంధిత అంశాలపై చట్టాలు, నియంత్రణల గురించి నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు వీలు కల్పించడం అవగాహన ఒప్పందం ముఖ్యోద్దేశం.

ఎమ్ఒయు సెంట్రల్  డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సి డి ఎస్ సి ) , సురినామ్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య వాటి అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా వైద్య ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన విషయాలలోఫలవంతమైన సహకారం , సమాచార మార్పిడి కోసం ఒక ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది

రెండు రెగ్యులేటరీ అథారిటీల మధ్య సహకారానికి సంబంధించిన ప్రధాన రంగాలలో క్రిందివి ఉన్నాయి:

. పరస్పర నియంత్రణ చట్రం, అవసరాలు, ప్రక్రియల పట్ల పక్షాల మధ్య అవగాహనను పెంపొందించడం , ఇరు పక్షాల కోసం  భవిష్యత్తులో రెగ్యులేటరీ బలోపేతం కార్యక్రమాలను సులభతరం చేయడం,

బి. గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ (జిఎల్ పి), గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్ (జిసిపి), గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జిఎంపి) ,గుడ్ ఫార్మకోవిజిలెన్స్ ప్రాక్టీసెస్ (జిపివిపి) పై సమాచారం , సహకార మార్పిడి.

సి. భారతీయ ఫార్మాకోపియా గుర్తింపు

డి. ఫార్మాకోవిజిలెన్స్ తో సహా భద్రతా సమాచార మార్పిడి, అవతలి పక్షానికి సంబంధించిన నిర్దిష్ట భద్రతా ఆందోళన ఉన్న ప్రతికూల సంఘటనలు. ఇందులో మందులు వైద్య పరికరాలకు సంబంధించిన భద్రతా సమస్యలు ఉన్నాయి.

. పార్టీలు నిర్వహించే శాస్త్రీయఆచరణాత్మక సదస్సులు, సింపోజియంలు, సెమినార్ లు , ఫోరమ్ లలో పాల్గొనడం.

ఎఫ్. పరస్పరం అంగీకరించిన ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం,

జి. అంతర్జాతీయ వేదికల పై సమన్వయం

హెచ్. ఉమ్మడి ఆసక్తి ఉన్న ఇతర రంగాలు.

విదేశీ మారకద్రవ్య ఆదాయానికి దారితీసే వైద్య ఉత్పత్తుల ఎగుమతికి ఎం యు  దోహదపడుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక ముందడుగు.

రెగ్యులేటరీ విధానాల్లో సమన్వయం భారత్ నుంచి ఔషధాల ఎగుమతులను పెంచడానికి, ఫార్మా రంగంలో విద్యావంతులైన నిపుణులకు మెరుగైన ఉపాధి అవకాశాలకు దోహదపడుతుంది.

రెండు దేశాల రెగ్యులేటరీ అథారిటీల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఫార్మాస్యూటికల్స్ వినియోగానికి ముడి పదార్థాలు, జీవ ఉత్పత్తులు, వైద్య పరికరాలు ,సౌందర్య ఉత్పత్తులతో సహా ఫార్మాస్యూటికల్స్ కు సంబంధించి వైద్య ఉత్పత్తుల నియంత్రణను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది.

ఎమ్ఒయు వైద్య ఉత్పత్తులు , సంబంధిత పరిపాలనానియంత్రణ విషయాలకు సంబంధించిన విషయాలలో సమాచార మార్పిడి , సహకారాన్ని పార్టీల పరిధిలో ప్రోత్సహిస్తుంది.

*****



(Release ID: 1949552) Visitor Counter : 104