ప్రధాన మంత్రి కార్యాలయం
నేపాల్ ప్రధానితో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
భారత్-నేపాల్ ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాల పై ఇరువురు నేతల సమీక్ష
.
నేపాల్ ప్రధాని ప్రచండ ఇటీవల భారత పర్యటన సందర్భంగా జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఇద్దరు ప్రధానుల సంభాషణ
భారత్ అనుసరిస్తున్న 'పొరుగుదేశాలకు తొలి ప్రాధాన్యం‘ విధానంలో నేపాల్ కీలక భాగస్వామి
Posted On:
05 AUG 2023 6:16PM by PIB Hyderabad
నేపాల్ ప్రధాన మంత్రి శ్రీ పుష్ప కమల్ దహల్ 'ప్రచండ'తో ప్ర ధాన మంత్రి శ్రీ
నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో సంభాషించారు.
భారత్-నేపాల్ ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 2023 మే 31 నుండి జూన్ 3 వరకు నేపాల్ ప్రధాన మంత్రి ప్రచండ భారత పర్యటన సందర్భంగా సందర్భంగా జరిగిన చర్చలకు కొనసాగింపుగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, , ఇరు దేశాల మధ్య లోతైన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇద్దరు నేతలు సంభాషించారు.
సన్నిహిత, స్నేహపూర్వక పొరుగు దేశమైన నేపాల్ భారత్ 'పొరుగుదేశాలకు ప్రథమం' విధానంలో కీలక భాగస్వామి.
ఈ టెలిఫోన్ సంభాషణ ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమాచార మార్పిడి సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది.
*******
(Release ID: 1946171)
Visitor Counter : 132
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam