ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్ లోప్రధాన మంత్రి కార్యక్రమాని కి రాజస్థాన్ ముఖ్యమంత్రి హాజరీ కి సంబంధించి ట్వీట్ చేసినపిఎమ్ఒ 

Posted On: 27 JUL 2023 10:42AM by PIB Hyderabad

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం లో ఏర్పాటైన ప్రధాన మంత్రి యొక్క కార్యక్రమం లో పాలుపంచుకోవడాని కి సంబంధించి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతిస్పందించి ఈ క్రింది ట్వీట్ ను జారీ చేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న సీకర్ ను సందర్శించనున్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
 

‘‘శ్రీ @ashokgehlot51 గారు,

ప్రోటోకాల్ కు అనుగుణం గా, మిమ్ముల ను కూడా ఆనవాయితీ గా ఆహ్వానించడం జరిగింది. అంతేకాక, మీ ఉపన్యాసాని కి కూడా సమయాన్ని నిర్దేశించడం జరిగింది. అయితే, మీరు ఆ కార్యక్రమం లో పాల్గొనలేకపోవచ్చు అంటూ మీ కార్యాలయం పేర్కొన్నది.

ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’s గారి మునుపటి సందర్శనల లో సైతం మిమ్ములను ఎల్లప్పుడూ ఆహ్వానించడం జరుగుతూ వచ్చింది. మరి ఆ కార్యక్రమాల లో మీరు పాలుపంచుకొన్నారు కూడాను.

ఈ రోజు న జరిగే కార్యక్రమం లో పాలుపంచుకోవడానికి మీకు ఇదే అత్యంత ఆప్యాయభరితం అయినటువంటి ఆహ్వానం. అభివృద్ధి కార్యాల కు సంబంధించిన శిలా ఫలకం లో మీ పేరు ఉండనే ఉంది.

ఇటీవల మీకు అయిన గాయం కారణం గా మీకు ఏదైనా శారీరక అసౌకర్యం కలిగివుండని అటువంటి పక్షం లో, మీ యొక్క హాజరు ను చాలా విలువైంది గా ఎంచడం జరుగుతుంది.’’ అని పేర్కొంది.
 

 


***

 

DS/AK


(Release ID: 1943131) Visitor Counter : 154