ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించిన నాగాలాండ్ కు చెందిన మొట్టమొదటి మహిళా సభ్యురాలు ఎస్. ఫాంగ్నాన్ కొన్యాక్


రాజ్యసభ వైస్ ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్‌కు నలుగురు మహిళా సభ్యులను నామినేట్చేసిన రాజ్యసభ చైర్మన్

Posted On: 25 JUL 2023 4:41PM by PIB Hyderabad

రాజ్యసభ చరిత్రలో ఈరోజు సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. నాగాలాండ్ కు చెందిన ఎస్.  ఫాంగ్నాన్ కొన్యాక్ అధ్యక్షతన ఈరోజు రాజ్యసభ సమావేశం జరిగింది. నాగాలాండ్ కు చెందిన సభ్యులు సమావేశాలకు అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి. 

 అంతకుముందు జూలై 17, 2023న వైస్ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో నియమితులైన మొట్టమొదటి మహిళా సభ్యురాలిగా ఎస్. ఫాంగ్నాన్ కొన్యాక్చరిత్ర సృష్టించారు.

లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా , రాజ్యసభ చైర్మన్ శ్రీ జగదీప్ ధన్‌కర్ గత వారం నలుగురు మహిళా సభ్యులను (మొత్తం సంఖ్యలో 50%) ఉపాధ్యక్షుల ప్యానెల్‌కు నామినేట్ చేశారు.

 నామినేట్ అయిన  మహిళా సభ్యులందరూ మొట్టమొదటిసారిగా పార్లమెంట్ కు ఎన్నిక కావడం   గమనార్హం. వర్షాకాల సమావేశాలకు ముందు ఎనిమిది మంది సభ్యులతో ఉపాధ్యక్షుల ప్యానెల్‌ ను చర్మన్  పునర్నిర్మించారు. అందులో సగం మంది మహిళలు ఉన్నారు. ఉపాధ్యక్షుల ప్యానెల్‌లో మహిళా సభ్యులకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం ఎగువ సభ చరిత్రలో ఇదే తొలిసారి.

వైస్-ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్‌కు గత వారం నామినేట్ చేయబడిన మహిళా సభ్యుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

*శ్రీమతి పి.టి. ఉష:

 పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు ప్రఖ్యాత క్రీడాకారిణి. ఆమె జూలై 2022 లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. శ్రీమతి ఉష  రక్షణ కమిటీ, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్ కమిటీ  ఎథిక్స్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. .

* శ్రీమతి ఎస్. ఫాంగ్నాన్ కొన్యాక్:

 భారతీయ జనతా పార్టీకి  శ్రీమతి ఎస్. ఫాంగ్నాన్ కొన్యాక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఏప్రిల్ 2022 లో నాగాలాండ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మొదటి మహిళగా  శ్రీమతి ఎస్. ఫాంగ్నాన్ కొన్యాక్:గుర్తింపు పొందారు. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 

 రవాణా, పర్యాటకం, సంస్కృతి కమిటీ సభ్యురాలిగా , ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ, మహిళా సాధికారతపై కమిటీ, హౌస్ కమిటీ, ఈశాన్య ఇందిరా గాంధీ ప్రాంతీయ ఆరోగ్య మరియు వైద్య శాస్త్రాల సంస్థ, షిల్లాంగ్ క్క పాలకమండలి సభ్యురాలిగా   వ్యవహరిస్తున్నారు. 

* డాక్టర్  ఫౌజియా ఖాన్:

 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్  ఫౌజియా ఖాన్  ఏప్రిల్, 2020లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

 మహిళా సాధికారత కమిటీ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ పై ఏర్పాటైన  కమిటీ, చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యురాలిగా డాక్టర్ ఫౌజియా ఖాన్   వ్యవహరిస్తున్నారు. 

* శ్రీమతి సులతా డియో:

 బిజూ జనతాదళ్‌కు చెందినశ్రీమతి సులతా డియో   జూలై 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

 పరిశ్రమపై ఏర్పాటైన  కమిటీ, మహిళా సాధికారతపై ఏర్పాటైన కమిటీ, లాభార్జన కార్యాలయంపై జాయింట్ కమిటీ, ఎంపీ లాడ్స్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ.సభ్యురాలిగా  శ్రీమతి సులతా డియో   వ్యవహరిస్తున్నారు. 

 

***

 


(Release ID: 1942655) Visitor Counter : 187