ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జులై 27 వ మరియు 28 వ తేదీ లలో రాజస్థాన్ ను మరియు గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


రైతుల కు మేలు చేసేటటువంటి ఒక ముఖ్య చర్య లో భాగం గా, ఒక లక్ష పిఎమ్-కిసాన్ సమృద్ధి కేంద్రాల ను దేశ ప్రజల కుఅంకితం చేయనున్న ప్రధాన మంత్రి

గంధకం పూత తో ఉండే యూరియా గోల్డ్  ప్రధాన మంత్రి ప్రవేశ పెడతారు; ఇది వేప పూత పూసిన యూరియా కంటే ఆర్థికం గా మితవ్యయమైంది గా, ఫలవంతమైంది గా ఉంటుంది

పిఎమ్-కిసాన్ లో భాగం గా సుమారు 17,000 కోట్ల రూపాయల విలువైన పద్నాలుగో వాయిదా సొమ్ము ను సీకర్లో విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

ఓపెన్ నెట్ వర్క్ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) లో 1500 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ యొక్క నమోదు ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

అయిదు క్రొత్త వైద్య కళాశాలల ను ప్రధాన మంత్రి ప్రారంభించడంతో పాటు ఏడు వైద్య కళాశాలల కు శంకుస్థాపన కూడ చేయనుండగా ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలకల్పన లో ఒక ప్రధానమైన విస్తరణ కు రాజస్థాన్ సాక్షి కానుంది

రాజ్ కోట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నప్రధాన మంత్రి ;  860 కోట్ల రూపాయల కు పై చిలుకు విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను కూడ రాజ్కోట్ లో ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు

సెమికన్ఇండియా 2023 ను గాంధీనగర్ లో ప్రారంభించనున్న

Posted On: 25 JUL 2023 1:54PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జులై 27 వ తేదీ మరియు 28 వ తేదీ లలో రాజస్థాన్ ను మరియు గుజరాత్ ను సందర్శించనున్నారు.

జులై 27 వ తేదీ ఉదయం సుమారు 11 గంటల 15 నిమిషాల వేళ లో ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని సీకర్ లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో వివిధ అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం కూడ చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం పూట దాదాపు 3 గంటల 15 నిమిషాల వేళ కు ఆయన గుజరాత్ లోని రాజ్ కోట్ కు చేరుకొంటారు; ప్రధాన మంత్రి రాజ్ కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం లో కలియదిరుగుతారు. అటు తరువాత, సాయంత్రం ఇంచుమించు 4 గంటల 15 నిమిషాల వేళ కు రాజ్ కోట్ లోని రేస్ కోర్స్ గ్రౌండ్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. జులై 28 వ తేదీ నాడు ఉదయం రమారమి 10 గంటల 30 నిమిషాల వేళ లో గాంధీనగర్ లోని మహాత్మ మందిర్ లో సెమికన్ఇండియా 2023 ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

 

సీకర్ లో ప్రధాన మంత్రి

రైతుల కు మేలు చేకూర్చే ఒక ముఖ్యమైన చర్య లో భాగం గా, ఒక లక్ష పిఎమ్-కిసాన్ సమృద్ధి కేంద్రాల (పిఎమ్ కెఎస్ కె స్) ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. రైతు ల అన్ని అవసరాల ను తీర్చే ఏకైక నిలయం గా పిఎమ్ కెఎస్ కె స్ ను అభివృద్ధి పరచడం జరుగుతోంది. ఎరువులు, విత్తనాలు, ఉపకరణాలు వంటి వాటి గురించి న సమాచారం తెలియ జేయడం మొదలుకొని, నేల, విత్తనాలు, ఇంకా ఎరువుల సంబంధి పరీక్ష సదుపాయాల ను అందించడం తో పాటు వివిధ ప్రభుత్వ పథకాల కు సంబంధించిన సమాచారాన్ని కూడ ఇవ్వడం వరకు పిఎమ్ ఎస్ కెఎస్ దేశం లోని రైతు లు ఆధారపడగలిగే మద్దతు వ్యవస్థ వలె మారాలనే ఉద్దేశ్యం తో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అవి ఎరువుల బ్లాకు స్థాయి విక్రయ కేంద్రాలు / జిల్లా స్థాయి విక్రయ కేంద్రాల లో చిల్లర విక్రేతల కు రెగ్యులర్ కెపాసిటీ బిల్డింగ్ అంశంలోనూ పూచీ పడతాయి.

 

యూరియా గోల్డ్ అనేటటువంటి ఒక క్రొత్త రకం యూరియా ను ప్రధాన మంత్రి ప్రవేశ పెడతారు. ఈ యూరియా కు సల్ఫర్ పూత పూసి ఉంటుంది. గంధకం పూత ను పూసిన యూరియా ను పరిచయం చేయడం అనేది నేల లో గంధకం కొదువ సమస్య కు పరిష్కారాన్ని సూచిస్తుంది. ఈ వినూత్నమైన ఎరువు తక్కువ ఖర్చు తో కూడినదీ, వేప పూత పూసినటువంటి యూరియా కంటే మేలైన రకందీనూ కానుంది. ఈ క్రొత్త రకం యూరియా మొక్కల లో నత్రజని సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది, ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది మరియు పంట నాణ్యత ను పెంచుతుంది.

 

 

ఈ కార్యక్రమం లో, 1500 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్ ) ను ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) లో చేరడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రకటన చేస్తారు. ఒఎన్ డిసి అనేది ఎఫ్ పిఒ లకు డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ పేమెంట్, బిజినెస్-టు-బిజినెస్ (బి2బి) మరియు బిజినెస్-టు-కన్స్యూమర్ ట్రాన్సాక్శన్ కు ప్రత్యక్ష లభ్యత సదుపాయాన్ని ఇవ్వడం తో పాటు గ్రామీణ ప్రాంతాల లో లాజిస్టిక్స్ యొక్క వృద్ధి కి ఉత్ప్రేరకం గా పని చేస్తుంది; ఇంకా, స్థానికం గా విలువ ను జోడించే ప్రక్రియ ను ప్రోత్సహిస్తుంది.

 

 

రైతు ల సంక్షేమం దిశ లో ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత కు మరొక ఉదాహరణ అని అనిపించేటట్లు గా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా దాదాపు గా 17,000 కోట్ల రూపాయల తో కూడినటువంటి పద్నాలుగో వాయిదా సొమ్ము ను 8.5 కోట్ల కు పైగా లబ్ధిదారుల కు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ పద్ధతి లో విడుదల చేయడం జరుగుతుంది.

 

ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పన లో ఒక ప్రధానమైనటువంటి విస్తరణ కు సాక్షి గా రాజస్థాన్ ఉండబోతున్నది. ఎలాగంటే ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని చిత్తౌడ్ గఢ్, ధౌల్ పుర్, సిరోహీ, సీకర్, ఇంకా శ్రీ గంగానగర్ లలో క్రొత్త గా ఏర్పాటైన అయిదు వైద్య కళాశాల లను ప్రారంభించడం తో పాటు, బారాఁ, బూందీ, కరౌలీ, ఝుంఝునూ, సవాయ్ మాధోపుర్, జైసల్ మేర్ మరియు టోంక్ లలో ఏడు వైద్య కళాశాలల కు శంకుస్థాపన చేయనున్నారు.

 

‘‘ఇప్పటికే ఉన్న జిల్లా ఆసుపత్రులు/రిఫరల్ ఆసుపత్రుల కు అనుబంధం గా క్రొత్త వైద్య కళాశాలల స్థాపన’’ అనే కేంద్ర ప్రాయోజిత పథకం లో భాగం గా ఈ వైద్య కళాశాలల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రధాన మంత్రి ప్రారంభించేటటువంటి అయిదు వైద్య కళాశాలల ను 1400 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. కాగా, శంకుస్థాపన జరగనున్న ఏడు వైద్య కళాశాలల ను మొత్తం 2275 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడం జరుగుతుంది.

 

2014 వ సంవత్సరం వరకు చూస్తే, రాజస్థాన్ లో 10 వైద్య కళాశాల లు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంకిత భావం తో నడుం కట్టిన ప్రయాస ల ఫలితం గా రాష్ట్రం లో వైద్య కళాశాల ల సంఖ్య 35 కు వృద్ధి చెందింది; ఇది 250 శాతం వృద్ధి తో సమానం అన్న మాట. ఈ 12 నూతన వైద్య కళాశాలల స్థాపన తో రాష్ట్రం లో ఎమ్ బిబిఎస్ సీట్ ల సంఖ్య 2013-14 సంవత్సరం లో ఉన్న 1750 సీట్ ల స్థాయి నుండి 6275 సీట్ ల స్థాయి కి పెరుగుతుంది. అంటే ఎమ్ బిబిఎస్ సీట్ లు 258 శాతం వృద్ధి చెందినట్లు అవుతుందన్న మాట.

 

 ఉదయ్ పుర్, బాన్స్ వాడ, ప్రతాప్ గఢ్ మరియు డుంగర్ పుర్ జిల్లాల లో నెలకొన్న ఆరు ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ పాఠశాల లు ఆ యా జిల్లాల లోని ఆదివాసి జనాభా కు ప్రయోజనకరం గా ఉంటాయి. ఆయన ఇదే కార్యక్రమం లో కేంద్రీయ విద్యాలయ తివరీ, జోద్ పుర్ ను కూడా ప్రారంభిస్తారు.

 

రాజ్ కోట్ లో ప్రధాన మంత్రి

 

దేశం లో వాయు సంధానాన్ని మెరుగు పరచాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణం రాజ్ కోట్ లోని క్రొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి తో నూతనోత్తేజాన్ని పొందనుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్ట్ ను 1400 కోట్ల రూపాయల కు పైచిలుకు ఖర్చు తో 2500 ఎకరాల కు పైబడిన ప్రాంతం లో అభివృద్ధి పరచడమైంది. క్రొత్త విమానాశ్రయం లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు దీర్ఘకాలం పాటు మనుగడ లో ఉండే సదుపాయాలు కొలువుదీరాయి. ఈ విమానాశ్రయం లో టర్మినల్ భవనం గ్రీన్ రేటింగ్ ఫార్ ఇంటిగ్రేటెడ్ హేబిటేట్ అసెస్ మెంట్-4 (జిఆర్ఐహెచ్ఎ- 4) ప్రమాణా లకు తులతూగుతున్నది. అంతేకాకుండా క్రొత్త టర్మినల్ భవనం (ఎన్ఐటిబి) లో డబల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, స్కై లైట్స్, ఎల్ఇడి లైటింగ్, లో హీట్ గెయిన్ గ్లేజింగ్ వంటి అనేక సదుపాయాలు కూడ జత పడ్డాయి.

 

రాజ్ కోట్ యొక్క చైతన్య భరితమైనటువంటి సంస్కృతి విమానాశ్రయం టర్మినల్ యొక్క డిజైను లో ప్రేరణాత్మకం గా నిలచింది. ఈ భవనం యొక్క బయటి ముఖభాగం అలంకరణ మరియు అంతర్భాగ అలంకరణ లు లిప్పన్ కళ మొదలుకొని డాండియా ఆట పాటల కు అద్దం పట్టేవి గా ఉన్నాయి. ఈ విమానాశ్రయం లో స్థానిక వాస్తు కళ ఉట్టిపడడం తో పాటు గుజరాత్ లోని కాఠియావాడ్ ప్రాంత సంబంధి కళ లు మరియు నాట్య రూపాల తాలూకు సాంస్కృతిక వైభవాన్ని కళ్ళ కు కట్టే ముస్తాబులు ఉన్నాయి. రాజ్ కోట్ లో నూతన విమానాశ్రయం స్థానిక ఆటోమొబైల్ ఇండస్ట్రీ యొక్క అభివృద్ధి కి తోడ్పడడమే కాకుండా గుజరాత్ రాష్ట్ర వ్యాప్తం గా వ్యాపారం, పర్యటన, విద్య, మరియు పరిశ్రమల రంగాల కు కూడా దన్ను గా నిలవనుంది.

 

 

ప్రధాన మంత్రి 860 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి పథకాల ను కూడ ప్రారంభించనున్నారు. వాటిలో సావునీ యోజన లింక్ 3 ప్యాకేజీ 8 మరియు 9 లు సేద్యపు నీటిపారుదల సదుపాయాల ను మరింత బలపరచడం లో సాయపడడంతో పాటు సౌరాష్ట్ర ప్రాంతం లో త్రాగునీటి సంబంధి ప్రయోజనాల ను కూడా అందించనున్నాయి. ద్వారక ఆర్ డబ్ల్యుఎస్ఎస్ యొక్క ఉన్నతీకరణ పల్లె ప్రాంతాల కు చాలినంతగా త్రాగునీటి ని గొట్టపు మార్గం ద్వారా అందించడం లో తోడ్పడుతుంది. అమలు పరచనున్న ఇతర పథకాల లో ఊపర్ కోట్ పోర్ట్ ఒకటో దశ మరియు రెండో దశ ల పరిరక్షణ, పునరుద్ధరణ, ఇంకా అభివృద్ధి పథకాలు; నీటి శుద్ధి ప్లాంటు నిర్మాణం; మురుగు శుద్ధి ప్లాంటు; ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రోజెక్టు లు ఉన్నాయి.

 

 

గాంధీనగర్ లో ప్రధాన మంత్రి

సెమికన్ఇండియా 2023 ను జులై 28 వ తేదీ నాడు గాంధీనగర్ లోని మహాత్మ మందిర్ లో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఆయన ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేటలైజింగ్ ఇండియాస్ సెమికండక్టర్ ఇకోసిస్టమ్అనేది ఈ సభ యొక్క ఇతివృత్తం గా ఉంది. ఇది పరిశ్రమ కు, విద్య రంగాని కి మరియు పరిశోధన సంస్థల కు చెందిన ప్రపంచ నేతల ను ఒక చోటు కు తీసుకు రావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. ఈ సభ భారతదేశం యొక్క సెమికండక్టర్ స్ట్రాటజీ ఎండ్ పాలిసీ ని చాటిచెబుతుంది. సెమికండక్టర్ డిజైన్, తయారీ మరియు సంబంధి సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి అనే అంశాల లో భారతదేశాన్ని ఒక గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలి అనేది ఈ కార్యక్రమం పరమార్థం గా ఉంది. మైక్రాన్ టెక్నాలజీ, అప్లాయిడ్ మెటీరియల్స్, ఫాక్స్ కాన్, ఎస్ఇఎమ్ఐ, కేడెన్స్, ఎఎమ్ డి తదితర ప్రధాన కంపెనీ ల ప్రతినిధులు సెమికన్ఇండియా 2023 లో పాలుపంచుకోనున్నారు.

 

 

****

 



(Release ID: 1942501) Visitor Counter : 125