ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర తోమర్, నేపాల్ ప్రభుత్వ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ బేదు రామ్ భూసల్ సమక్షంలో మొట్టమొదటి గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ - 2023 ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ప్రపంచ సుస్థిర అభివృద్ధి కోసం ఆహార ధాన్యాలు, ఆహార భద్రత, ఆహార రక్షణ వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేయడం చాలా ముఖ్యం; వన్ హెల్త్ విధానం కింద పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ఫుడ్ రెగ్యులేటర్ల కీలక బాధ్యత: డాక్టర్ మాండవీయ
“ముందస్తు సంరక్షణ, ఆరోగ్యం , శ్రేయస్సు కోసం సమతుల్య, సురక్షితమైన , పోషకమైన ఆహారం అవసరం’’
భారతదేశంలో వ్యవసాయ రంగం ఆహార పరిశ్రమ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆహార భద్రత కోసం వ్యవసాయ ఉపకరణాల నుండి ఉత్పత్తులు అంతిమ వినియోగదారుకు చేరే వరకు మొత్తం విలువ గొలుసు నెట్వర్క్ ను ఒకే సంస్థగా పరిగణించడం చాలా ముఖ్యం: శ్రీ నరేంద్ర తోమర్
Posted On:
20 JUL 2023 12:57PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర తోమర్, నేపాల్ ప్రభుత్వ వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ బేదు రామ్ భూసాల్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు ఢిల్లీలో మొదటి గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ - 2023 ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ బఘేల్, డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ కూడా పాల్గొన్నారు. ఆహార భద్రతా వ్యవస్థలు, ఆహార విలువ గొలుసు అంతటా నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృక్పథాలను పంచుకోవడానికి, ఆహార నియంత్రణదారుల ప్రపంచ వేదికను సృష్టించడానికి ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం ఒ హెచ్ ఎఫ్ డబ్ల్యు) ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) చేసిన ప్రయత్నం ఈ శిఖరాగ్ర సదస్సు.
డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ సురక్షితమైన ఆహారం , మంచి ఆరోగ్యం ఒకదానికొకటి పరిపూరకరమైనవి. సమతుల్య, సురక్షితమైన , పోషకమైన ఆహారం నివారణ సంరక్షణగా పనిచేస్తుంది. మన ఆరోగ్యం , శ్రేయస్సును నిర్ధారిస్తుంది” అన్నారు. ఆహార భద్రత ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, "ప్రపంచ సుస్థిర అభివృద్ధి కోసం ఆహార ధాన్యాలు, ఆహార భద్రత , ఆహార రక్షణ వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. వాతావరణం, మానవ, జంతు , మొక్కల ఆరోగ్యాన్ని సమిష్టిగా చూడటానికి సమీకృత వేదికను అందించే వన్ హెల్త్ విధానం కింద పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ఆహార నియంత్రణ సంస్థలకు చాలా బాధ్యతాయుతమైన పని ఉంది” అని అన్నారు. ప్రస్తుతం జి 20 ఇండియా ప్రెసిడెన్సీలో హెల్త్ వర్కింగ్ గ్రూప్ కు వన్ హెల్త్ అత్యంత ప్రాధాన్యత అంశంగా మారిందని ఆయన తెలిపారు.
ప్రపంచ సమాజానికి గొప్ప మేలు, సంక్షేమం కోసం అంతర్జాతీయ సహకారం సంఘీభావం ప్రాముఖ్యతను డాక్టర్ మాండవీయ వివరిస్తూ, ' వసుదైక కుటుం బం : ఒకే భూమి, ఒకే దేశం' అనే ఈ ఏడాది భారత జీ20 ప్రెసిడెన్సీ థీమ్ కు ఈ సదస్సు చక్కగా సరిపోతుంది’ అన్నారు.
వివిధ భౌగోళిక ప్రాంతాలు వ్యవసాయ-వాతావరణ వైవిధ్యాలను కలిగి ఉన్నందున, ఆహార భద్రతా ప్రోటోకాల్స్ కు ఏ ఒక్క ప్రమాణం వర్తించదని ఆయన పేర్కొన్నారు. "ప్రాంతీయ వైవిధ్యాలను ప్రపంచ ఉత్తమ అభ్యాసాలలో ఎలా పరిగణనలోకి తీసుకోవచ్చో మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆహార నాణ్యత ను నిర్ణయించే కీలకమైన భూమి ఆరోగ్యం అనే అంశాన్ని డాక్టర్ మాండవీయ వివరించారు . ఆహార సాగులో రసాయనాలు , ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించే సేంద్రీయ, సహజ , ప్రత్యామ్నాయ వ్యవసాయాన్ని చేపట్టడానికి రైతులను ప్రోత్సహించే ఇటీవల ప్రకటించిన పిఎం-ప్రాణం పథకం ముఖ్య లక్షణాలను ఆయన వివరించారు. వసుధైక
కుటుంబం (ప్రపంచం ఒకే కుటుంబం) స్ఫూర్తితో అన్ని దేశాలు సమిష్టిగా పనిచేయాలని, ఆహార కొరత ప్రపంచ సమస్య అని, దీనికి సమిష్టిగా ప్రపంచ పరిష్కారాలు అవసరమని ఆయన కోరారు.
ఈ సమావేశానికి గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, ఆహారం ప్రాథమిక హక్కు అని, అది తక్కువ ధరకు లభ్యమయ్యేలా చూడాలని అన్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగం , ఆహార పరిశ్రమ విస్తరణ, పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆహార భద్రత , రక్షణను నిర్ధారించడానికి వ్యవసాయ ఉపకరణాల నుంచి ఉత్పత్తులు సైతం చివరి వినియోగదారుకు చేరే వరకు మొత్తం విలువ గొలుసు వ్యవస్థను ఒకే సంస్థగా పరిగణించడం చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు.
ఆహార సరఫరాకు సంబంధించిన ఏ విధానాలకైనా రైతులు ఎల్లప్పుడూ కేంద్రబిందువుగా ఉండాలని, తద్వారా వారు ఎటువంటి ప్రతికూల రీతిలో ప్రభావితం కాకూడదని కేంద్ర మంత్రి సూచించారు. ఇతర పంటలతో పోలిస్తే తక్కువ నీటి వినియోగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం, అధిక పోషక విలువలు వంటి చిరుధాన్యాల సానుకూల లక్షణాల దృష్ట్యా చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ వీడియో సందేశం ద్వారా, ఈ మొదటి గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ ను నిర్వహించినందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐలను అభినందించారు. ప్రతిచోటా ,ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పౌష్టికాహారం అందేలా సమష్టిగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మాండవీయ నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలు, లేబులింగ్ క్లెయిమ్ అవసరాలు, ప్యాకేజింగ్ అవసరాలు, పరీక్షా పద్ధతులు పాటించాల్సిన ఆహార భద్రత , ప్రమాణాల నిబంధనల (ఎఫ్ఎస్ఎస్ఆర్) ప్రకారం ఏదైనా ఇతర నియంత్రణ నిబంధనలను వివరించే నిర్దిష్ట ఉత్పత్తి వర్గానికి వర్తించే అన్ని ప్రమాణాలకు ఫుడ్ కేటగిరీల వారీగా మోనో గాఫ్ ల సమాహారం- ఫుడ్-ఓ-కొపోయియా, సింగిల్ పాయింట్ రిఫరెన్స్ లను విడుదల చేశారు.
కామన్ రెగ్యులేటర్స్ ప్లాట్ ఫామ్ ' సంగ్రహ్' - సేఫ్ ఫుడ్ ఫర్ నేషన్స్: గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ హ్యాండ్ బుక్ ను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి ఆవిష్కరించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీలు, వాటి ఆదేశం, ఆహార భద్రతా పర్యావరణ వ్యవస్థ, ఆహార పరీక్షా సౌకర్యాలు, ఫుడ్ అధికారుల కాంటాక్ట్ వివరాలు, ఎస్ పి ఎస్ / టిబిటి / కోడెక్స్ / వాహో మొదలైన వాటి డేటాబేస్. హిందీ, ఇంగ్లిష్ తో పాటు గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి ఆరు ప్రాంతీయ భాషల్లో కూడా సంగ్రహ్ అందుబాటులో ఉంది.
సదస్సు సందర్భంగా కామన్ డిజిటల్ డ్యాష్ బోర్డును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆవిష్కరించారు. డ్యాష్ బోర్డ్ అనేది ఒక సాధారణ ఏకీకృత ఐటి-పోర్టల్, ఇది భారతదేశంలో ఆహార నియంత్రణల ద్వారా ప్రమాణాలు, నిబంధనలు, నోటిఫికేషన్లు, సలహాలు, మార్గదర్శకాలు, కాలుష్య పరిమితులు, తాజా పరిణామాలపై సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది.
గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమ్మిట్ - 2023 సందర్భంగా రెండు రోజుల ఎగ్జిబిషన్ ను డాక్టర్ మాండవీయ ప్రారంభించారు. ఆహార భద్రత, ఆహార ప్రమాణాలు, ఆహార పరీక్షా సామర్థ్యాలు, ఉత్పత్తి సంస్కరణ, ఆహార సాంకేతిక పరిజ్ఞానం పురోగతిపై ఆలోచనలు , సమాచార మార్పిడికి ఈ ప్రదర్శన ఒక వేదికను అందిస్తుంది. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (ఎఫ్ పి బి ఒలు), ర్యాపిడ్ అనలిటికల్ ఫుడ్ టెస్టింగ్ (ఆర్ఎఎఫ్ టి) తయారీదారులు, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (అపెడా), మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (ఎం పి ఇ డి ఎ ), ఎక్స్ పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ (ఇ ఐ సి ), స్పైస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు సహా మొత్తం 35 ఎగ్జిబిటర్లు ఈ రంగంలో తమ నైపుణ్యాన్ని, సహకారాన్ని ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో శ్రీ అన్న (చిరుధాన్యాలు) పై స్టాల్స్ కూడా ఉన్నాయి.
శ్రీ అమితాబ్ కాంత్, జి 20 షెర్పా మాట్లాడుతూ, నేర్చుకోవడానికి, ఆహార భద్రతను మెరుగుపరచడానికి, నెట్వర్క్ ను బలోపేతం చేయడానికి , స్థిరమైన మార్గంలో ఆహార భద్రతలో పెట్టుబడి పెట్టేందుకు ఒక యంత్రాంగాన్ని సృష్టించడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని సభికులను అభ్యర్థించారు. స్థితిస్థాపక ఆహార సరఫరాను నిర్ధారించాల్సిన అవసరాన్ని గుర్తించి, ఆహార వృథాను తగ్గించాల్సిన అవసరాన్ని, ఆహార సరఫరాను పెంచడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించాల్సిన అవసరాన్ని, చిరుధాన్యాలు వంటి స్థితిస్థాపక ఆహార పంటల వాడకాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని వివరించారు.
ప్రారంభ సెషన్ ప్రత్యేక వక్తగా భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ, రెండు రోజుల సదస్సులో ఆహార సరఫరాలో ప్లాస్టిక్, న్యూట్రాస్యూటికల్స్ , లోహాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి చర్చించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉత్పత్తిలో సర్క్యులర్ ను ప్రోత్సహించాలని , సూపర్ మార్కెట్లలో సుస్థిరమైన పదార్ధాల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఇఒ శ్రీ జి.కమల వర్ధన రావు మాట్లాడుతూ, మంచి ఆరోగ్యానికి సురక్షితమైన , పోషకమైన ఆహారం కీలకమని, అసురక్షిత ఆహారం ప్రతి సంవత్సరం 600 మిలియన్ల ఇన్ఫెక్షన్లు , 4.2 లక్షల మరణాలకు కారణమవుతోందని అన్నారు. ఈ సమావేశం ఆహార భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై మేధోమథనం చేస్తుందని, సురక్షితమైన ఆహార సరఫరాను నిర్ధారించడానికి వినూత్న పరిష్కారాలను తీసుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ - 2023 ఆహార భద్రతా వ్యవస్థలకు సంబంధించిన కీలక సమస్యలపై దృక్పథాలు , విజ్ఞానాన్ని మార్పిడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార నియంత్రణ సంస్థలను ఏకతాటిపైకి తెస్తుంది. అంతర్జాతీయ. ఆహార నియంత్రణ సంస్థల పాత్ర, బాధ్యతలు, ప్రపంచ ఆహార భద్రతకు సవాళ్లు, పరిష్కారాలు, పటిష్టమైన ప్రామాణికాల నిర్ధారణ, ఫుడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో ఇన్నోవేషన్ తదితర అంశాలపై ఈ గ్లోబల్ సమ్మిట్ లో వివిధ టెక్నికల్ సెషన్లు జరుగుతున్నాయి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒ ఎస్ డి శ్రీ సుధాంశ్ పంత్, వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామిక సంఘాలు, ఆహార పరిశ్రమ, పరిశోధనా సంస్థల ప్రతినిధులు, ఎం ఒ హెచ్ ఎఫ్ డబ్ల్యూ, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఎఫ్ఎస్ఎస్ఏఐకి చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1941189)
Visitor Counter : 235