ప్రధాన మంత్రి కార్యాలయం

దిక్చక్రం 2047: భారత్ - ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య 25వ వార్షికోత్సవం -- భారత్ - ఫ్రాన్స్ సంబంధాలు శతాబ్ధి దిశగా పయనం

Posted On: 13 JUL 2023 11:30PM by PIB Hyderabad

        ఇండో-పసిఫిక్‌  ప్రాంతంలో భారత్ ,  ఫ్రాన్స్ దేశాలు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వాములు.  రెండు దేశాల మధ్య 1947లో దౌత్య సంబంధాలు ఏర్పాటయ్యాక, 1998లో భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి పెంచినప్పటి నుంచి, మన రెండు దేశాలు నిలకడగా  కలిసికట్టుగా  పని చేస్తూ  పరస్పర విశ్వాసం, ఐక్యరాజ్యసమితి చార్టర్ మరియు అంతర్జాతీయ చట్టంలో సూత్రాల పట్ల నిబద్ధతతో సంయుక్తంగా సాధారణ విలువలకు కట్టుబడి ముందుకు సాగుతున్నాయి.

          ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తిచేసుకుంది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 2047 వరకు ద్వైపాక్షిక సంబంధాల కోసం ఒక మార్గనిర్దేశం చేయాలని  రెండు దేశాలు అంగీకరించాయి.  మరొకవంక 2047  భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్బంగా శతాబ్ది వేడుకలు జరుగుతాయి. మరియు వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి  అప్పటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది.  

         భారతదేశం, ఫ్రాన్స్ రెండు దేశాలు అంతర్జాతీయ శాంతి మరియు సుస్థిరత కోసం కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయి.   ఇండో-పసిఫిక్ ప్రాంతంలోపల,  అవతల  నిబంధనల ఆధారిత వ్యవస్థపట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిన  1998 నుండి అనుసరించినట్లుగా వారి సంబంధిత సార్వభౌమ మరియు వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా సమానుల మధ్య భాగస్వామ్యం యొక్క చట్రంలో పని చేయడానికి అంగీకరిస్తున్నారు.  సార్వత్రిక విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం మరియు న్యాయ పాలన సాధనకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడానికి
భారతదేశం మరియు ఫ్రాన్స్ తమ సార్వభౌమాధికారాన్ని మరియు నిర్ణయాలు తీసుకోవడంలో  స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయడానికి మరియు  భారత్, ఐరోపా యూనియన్ మధ్య సహకారంతో సహా మన గ్రహం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు కలిసి ప్రతిస్పందించడానికి  మరియు భవిష్యత్తులో సంబంధిత  రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నాయి.  

I - భద్రత, సార్వభౌమాధికారం కోసం భాగస్వామ్యం

1) కలిసి సార్వభౌమ రక్షణ సామర్థ్యాల నిర్మాణం

1.1   ఆత్మ నిర్భర్ రక్షణ పారిశ్రామిక మరియు సాంకేతిక స్థావరాన్ని అభివృద్ధి చేయడంలో భారత్ కు ఉన్న కీలక భాగస్వాములలో
 ఫ్రాన్స్ ఒకటి. సహా అధునాతన రక్షణ టెక్నాలజీల సహ-అభివృద్ధి మరియు సహ-ఉత్పత్తిలో సహకరించుకోవడంతో పాటు ఇతర (తృతీయ) దేశాలకు ప్రయోజనం చేకూర్చడానికి  భారతదేశం మరియు ఫ్రాన్స్ కట్టుబడి ఉన్నాయి.

1.2   సైనిక విమానయానంలో తమ మధ్య ఐదు దశాబ్దాల అత్యుత్తమ సహకారానికి అనుగుణంగా, భారత్  కోరిన విధంగా  36 రాఫెల్‌ యుద్ధ విమానాలను సకాలంలో అందించడాన్ని భారతదేశం మరియు ఫ్రాన్స్ స్వాగతించాయి.  భారతదేశం, ఫ్రాన్స్ ఉమ్మడిగా
యుద్ధ విమాన ఇంజిన్ అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా అధునాతన వైమానిక సాంకేతిక పరిజ్ఞానాలలో వినూత్న రీతిలో తమ
రక్షణ సహకారాన్ని విస్తరించనున్నాయి. ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (IMRH) ప్రోగ్రామ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్‌ను సమకూర్చడం ద్వారా హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్‌ల మోటరైజేషన్ లో  పారిశ్రామిక సహకారానికి కూడా వారు మద్దతు ఇస్తున్నారు. IMRH ప్రోగ్రామ్‌లో పురోగతి సాధ్యమయ్యేట్లు చేయడానికి ఇంజన్ అభివృద్ధి కోసం ఇండియాకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మరియు ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్ మధ్య  వాటాదారుల ఒప్పందం కుదిరింది. ఈ వెంచర్‌లు టెక్నాలజీ మార్పిడిలో  రెండు దేశాలు సాధించిన విజయం, కీలకమైన భాగాలు మరియు సాంకేతిక బిల్డింగ్ బ్లాక్‌ల ఉమ్మడి అభివృద్ధిలో భాగస్వామ్యం  భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న విశ్వాస స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయి.

1.3  మేక్ ఇన్ ఇండియా నమూనా మరియు రెండు దేశాలలోని కంపెనీల మధ్య నౌకాదళ నైపుణ్యాన్ని పంచుకోవడంలో మొదటి స్కార్పెన్ జలాంతర్గామి నిర్మాణ కార్యక్రమం (P75 - కల్వరి) విజయం సాధించడాన్ని భారత్, ఫ్రాన్స్ ప్రశంసించాయి. భారత జలాంతర్గామి సమూహాన్ని, దాని పనితీరును అభివృద్ధి చేయడానికి మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను అన్వేషించడానికి భారతదేశం మరియు ఫ్రాన్స్ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.  

1.4   పరస్పర విశ్వాసంతో పాదుకొలిపిన  ఈ రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యానికి అన్య ఉదాహరణలు సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్ మరియు శక్తి ఇంజిన్ లో ఉపయోగించే లోహాల కొలిమి, పోతపని సాంకేతికత బదిలీ కోసం HAL మధ్య కుదిరిన ఒప్పందం. టెక్నాలజీ బదిలీ ద్వారా, మేక్ ఇన్ ఇండియాకు మద్దతు ఇవ్వాలనే ఫ్రెంచ్ నిబద్ధతకు ఇది ప్రతిబింబం.

1.5 భారతదేశం మరియు అంతర్జాతీయ నౌకాదళం అవసరాలు తీర్చడానికి  ఉపరితల నౌకల రంగంలో సహకరించడానికి గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE) మరియు యూరోపియన్ నావల్ డిఫెన్స్ ఇండస్ట్రీలో అగ్రగామిగా ఉన్న నేవల్ గ్రూప్ ఫ్రాన్స్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మరొక ఉదాహరణ. .

1.6 రక్షణ పారిశ్రామిక సహకారంపై మార్గనిర్దేశం చేసుకుని దాన్ని అనుసరించి ముందుకు సాగడానికి రెండు దేశాలు కూడా  కృషి చేస్తున్నాయి.  

1.7 రెండు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక తోడ్పాటు పెరుగుదల దృష్ట్యా పారిస్‌లోని భారత  రాయబారి కార్యాలయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) సాంకేతిక కార్యాలయాన్ని ఇండియా ఏర్పాటు చేస్తోంది.

 

2. ఇండో-పసిఫిక్ ను కాలపరీక్షలకు తట్టుకుని సుస్థిర అభివృద్ధి ప్రాంతంగా కొనసాలుగా మార్చడానికి వాస్తవిక నిర్దిష్ట పరిష్కారాలను అందించడం

2.1 కీలకమైన ఈ పరాంతంపై ఉమ్మడి స్వప్న సాకారం కోసం కృషి చేసే రెండు ఇండో  - పసిఫిక్ మహాసముద్ర ప్రాంత దేశాలు భారత్ - ఫ్రాన్స్ హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్ - ఫ్రాన్స్ సంయుక్త వ్యూహాత్మక స్వప్న దర్శనం కింద 2018లో  చేపట్టిన సహకారాన్ని
బలోపేతం చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నాయి.  అందుచేత ఇండో-పసిఫిక్ కొత్త మార్గసూచీని అవి ఆమోదించాయి.  రెండు దేశాలు తమ సొంత ఆర్ధిక భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి,  సముద్ర జలాలు, అంతరిక్షం, వాతావరణం తదితర ప్రపంచవ్యాప్త ఉమ్మడి అంశాల్లో సమాన స్వేచ్చ కల్పించడానికి,  సంపద సృష్టిని కొనసాగించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, అంతర్జాతీయ న్యాయపాలనలో  ముందంజ వేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతం వెలుపల ఉన్నవారి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూనే సమతుల్య సుస్థిర వ్యవస్థను ప్రాంతాలకు అతీతంగా నిర్మించడానికి చేపట్టిన ఉమ్మడి అభివృద్ధి కార్యాచరణతో పనిచేయడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.  న్యూ కాలేడోనియా  ఫ్రెంచ్ పాలినేషియా మొదలైన ఫ్రెంచ్ భూభాగాల వారు చురుగ్గా పాల్గొనేలా చూస్తూ పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ - ఫ్రాన్స్ నిర్ణయించాయి.  ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లోని ఫ్రెంచ్ సముద్రానికి వెలుపల ఉన్న భూభాగాల వారు ఇండో పసిఫిక్ భాగస్వామ్యంలో కీలక పాత్ర వహిస్తారు.    

2.2  భారత్ ఫ్రాన్స్ కు వ్యూహాత్మక భాగస్వామి అయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో 2023 ఫిబ్రవరి 4వ తేదీన రెండు దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో ,  ఆస్ట్రేలియాతో 2020 సెప్టెంబర్ సమావేశంలో జరిపిన సంభాషణల ప్రాతిపదికగా భావసారూప్య భాగస్వాముల మధ్య త్రైపాక్షిక సహకారం ఇండో - పసిఫిక్ ప్రాంత సహకారానికి అత్యంత కీలకమైన మూలస్తంభం కాగలదు.  
        త్రిభుజాకార అభివృద్ధి సహకారమనే విశిష్ట నమూనా ద్వారా 'ఇండో పసిఫిక్ ట్రయాంగులర్ కో ఆపరేషన్ (ఐపిటిడిసి) నిధి'ని ఏర్పాటు చేయడానికి భారత్ ఫ్రాన్స్ కృషి చేస్తాయి.  ఇది ఇండో పసిఫిక్ లోని వర్ధమాన దేశాల్లో వాతావరణం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు వినూత్న ఆవిష్కరణలకు, అంకుర సంస్థలకు మద్దతు ఇస్తుంది.  ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడాన్ని మరింత సులభతరం చేయాలన్న లక్ష్యంతోను ఐపిటిడిసి పని చేస్తుంది.  ఐపిటిడిసి నిధి ద్వారా మద్దతివ్వాల్సిన ప్రాజెక్టులను రెండు దేశాలు సంయుక్తంగా గుర్తిస్తాయి.   ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఆవిష్కర్తలకు తగిన రీతిలో పారదర్శకంగా ప్రత్యామ్నాయ నిధుల అందజేతకు చెప్పుకోదగ్గ చొరవ కాగలదు.  ఇంతే కాకుండా 2021లో ప్రారంభించిన భారత ఐరోపా సమాజ సంధాన భాగస్వామ్యానికి కీలక స్తంభం అవుతుందనడంలో సందేహం లేదు.  

3)  మా వ్యూహాత్మక సంబంధంలో  అంతరిక్షాన్ని కేంద్ర స్థానంలో ఉంచడం  

3.1 అంతరిక్షం, అంతరిక్ష సాంకేతికతలు మరియు అంతరిక్ష దత్తాంశాలు, సామర్థ్యాలను ఉపయోగించి సేవలు మరియు ఉపయోగాల అభివృద్ధి మా సమాజాల వినూత్నతకు, శాస్త్రీయ అభివృద్ధికి  మరియు ఆర్థిక వృద్ధికి  కేంద్రంగా ఉంటాయి. భారత్ , ఫ్రాన్స్‌  ఉమ్మడి ప్రయోజనాలు తొందపడి కార్యక్రమాలను బలోపేతం చేయడం ద్వారా అంతరిక్షానికి సంబంధించిన  అన్ని రంగాలలో తమ సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.  

   3.2.1 శాస్త్రీయ మరియు వాణిజ్య భాగస్వామ్యం: రెండు ప్రధాన నిర్మాణాత్మక విషయాల ప్రాతిపదికగా ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ CNES, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO  తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి: వాతావరణం మరియు పర్యావరణం, తృష్ణ  మిషన్ అభివృద్ధి మరియు నీటి వనరుల నిర్వహణ వంటి అంశాలపై అంతరిక్ష వాతావరణ వేధశాల (SCO)లోని కార్యకలాపాలతో సముద్ర వనరులు, గాలి నాణ్యత పర్యవేక్షణ; భారత  గగన్‌యాన్ కార్యక్రమానికి సంబంధించి  మనుష్యులు నడిపే విమానాలతో అంతరిక్ష పరిశోధన (మార్స్, వీనస్), సముద్ర పర్యవేక్షణ,  ఇందుకు సంబంధించిన వాణిజ్య ప్రయోగ సేవల్లో సహకరించాలని ప్రభుత్వ రంగంలోని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్  మరియు  ఫ్రెంచ్ సంస్థ  ఏరియన్ స్పేస్ కూడా యోచిస్తున్నాయి.

   3.2.2 అంతరిక్ష ప్రవేశసాధ్యతకు స్థితిస్థాపకత: భారత్,  ఫ్రాన్స్ తమ అంతరిక్ష పరిశ్రమల ప్రమేయంతో రోదసి ప్రవేశసాధ్యతలో స్థితిస్థాపకతను పెంచడానికి అంతరిక్షానికి సార్వభౌమాధికారం మరియు భవిష్యత్ దృష్టితో సాంకేతికతల అభివృద్ధికి తమ సమన్విత చర్యల బలోపేతానికి కృషి చేస్తాయి.

3.2.3 ఇటీవలే వ్యవస్థీకరించిన  ద్వైపాక్షిక వ్యూహాత్మక అంతరిక్ష సంభాషణను భారత్ ,  ఫ్రాన్స్ కొనసాగిస్తాయి.

4) ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న కొత్త బెదిరింపుల నుంచి పౌరులను మెరుగైన రీతిలో రక్షించడానికి ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కొత్త ముప్పులకు అనుగుణంగా మార్చడం

4.1  భారత్, ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ఉగ్రవాదంపై పోరాటంలో ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి కలిసికట్టుగా పనిచేస్తున్నాయి.  కొత్తగా పుట్టుకొచ్చే ముప్పులు, బెదిరింపులను ఎదుర్కొని  ముందుకు సాగడానికి రెండు దేశాలు అన్ని అంశాలలో సహకారాన్ని బలోపేతం చేస్తాయి. ఇందులో కార్యాచరణ సహకారం, బహుపాక్షిక చర్య, ఆన్‌లైన్ లో విప్లవతత్వాన్ని ఎదుర్కోవడం, తీవ్రవాదానికి ఆర్ధిక సహాయాన్ని  అడ్డుకోవడం, ప్రత్యేకించి 'నో మనీ ఫర్ టెర్రర్' (NMFT) ఉపక్రమణ మరియు ఆన్‌లైన్‌లో ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద
సాహిత్యాన్ని నిర్మూలించడం 'క్రైస్ట్‌చర్చ్ కాల్ టు యాక్షన్ '  ద్వారా ఉంటుంది.

4.2 ఆంతరంగిక భద్రత, మానవ అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు,  పర్యావరణ నేరాలతో సహా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో తమ సహకారాన్ని భారత్, ఫ్రాన్స్ మరింతగా  పెంచుకుంటున్నాయి. ఉగ్రవాద నిరోధక రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు ఫ్రాన్స్‌ల మధ్య లెటర్ ఆఫ్ ఇంటెంట్ ద్వారా భారతదేశంలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) మరియు ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ డి ఇంటర్‌వెన్షన్ డి లా జెండర్‌మెరీ నేషనల్ (GIGN) మధ్య సహకారాన్ని క్రమబద్ధీకరించడాన్ని వారు స్వాగతించారు. .

4.3 రెండు దేశాల ఆంతరంగిక  భద్రతా సంస్థలు టెక్నాలజీని  సమర్థవంతంగా ఉపయోగించడం  ఆంతరంగిక భద్రతకు సహకరించుకోవడంలో ముఖ్యమైన క్షేత్రం.


5)  నవీకృత , సమర్థవంతమైన బహుపాక్షికతకు ప్రోత్సాహం


5.1   అంతర్జాతీయ వ్యవస్థ మౌలిక సూత్రాలను మరియు ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో పొందుపరచబడిన సూత్రాలను బలహీనపరిచే ప్రయత్నాలను భారత్ , ఫ్రాన్స్  తిరస్కరించాయి.  అంతర్జాతీయ వ్యవస్థ మౌలిక సూత్రాలను, సమకాలీన కొత్త వాస్తవాలను ప్రతిబింబించేలా ప్రపంచ పాలనను సంస్కరించడానికి కట్టుబడి ఉన్నాయి.

5.2 భద్రతా మండలి రెండు వర్గాలలో సభ్యత్వాన్ని విస్తరించడానికి వీలుగా దాని సంస్కరణను భారత్, ఫ్రాన్స్ ప్రోత్సహిస్తాయి. భద్రతా మండలి కొత్త శాశ్వత సభ్యులుగా చేరడానికి జి4 దేశాల యోగ్యతను రెండు దేశాలు ధృవీకరిస్తాయి.  ఆ విధంగా భారత్ కు  కూడా మద్దతు లభిస్తుంది.   శాశ్వత సభ్యులతో సహా ఆఫ్రికా నుండి మెరుగైన ప్రాతినిధ్యం కోసం మద్దతు ఇవ్వడానికి, మూకుమ్మడి అత్యాచారాలు/ దౌర్జన్యాలు  జరిగినప్పుడు వీటో వాడకుండా  నియంత్రణ విధించడంపై సంభాషణల కోసం  ప్రయత్నాలు కొనసాగిస్తారు.


5.3 అభివృద్ధి మరియు పర్యావరణానికి అనుకూలంగా బలమైన చర్యలు తీసుకోవడం కోసం  కొత్త ప్రపంచ ఆర్థిక ఒప్పందం కోసం జరిగిన  శిఖరాగ్ర సమావేశం తర్వాత గుర్తించిన పారిస్ ఎజెండాకు భారతదేశం మరియు ఫ్రాన్స్ మద్దతు ఇస్తున్నాయి.

    6.  మా రెండు దేశాల సైన్స్, సాంకేతిక విజ్ఞాన రంగాలలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలతో పాటు విద్యా సంబంధ విషయాలలో
సహకారం సహా ఉభయ దేశాల పురోగతి, స్వాతంత్య్ర సాధనకు భారత్ - ఫ్రాన్స్ బలాలను ఏకం చేస్తున్నాం.  

   6.1  భారత, ఫ్రాన్స్ దేశాలు తమ తమ పర్యావరణ వ్యవస్థలో నూతన ఆలోచనలకూ అంకుర కేంద్రాలుగా వ్యవహరిస్తాయి.  21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా పరిష్కరించుకోవడంలో సాంకేతిక విజ్ఞానం ప్రధాన పాత్ర ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో పరిశోధనకు ఇప్పటివరకూ ఉన్న భాగస్వామ్య బంధం మరింత బలపడేలా,  రెండు దేశాల స్వావలంబనను దృఢపరుచుకోవడానికి గట్టిగా కృషి చేస్తాయి.    

   6.1.1  శాస్త్రీయ సహకారం :   భారత్,  ఫ్రాన్స్ దేశాలు శాస్త్రీయ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాయి.  ఇందులో భాగంగానే సంయుక్త కీలక కమిటీ ఏర్పాటుకు నిర్ణయించాయి.   ఇది ఫ్రెంచ్ జాతీయ పరిశోధనా సంస్థ (ఎఎన్ఆర్)కు సంబంధించిన సాధారణ, ప్రాధాన్య అంశాల ప్రాజెక్టులపై సన్నద్ధతను పెంచేలా ఎప్పటికప్పుడు పిలుపునిస్తుంది.   (అంతరిక్షం, డిజిటలీకరణ, ఇంధన, యుద్ధతంత్ర,  పర్యావరణ, పట్టణ పరివర్తన, ఆరోగ్యం వంటి పలు రంగాల్లో ఎఎన్ఆర్  కీలక కృషి చేస్తుంది. )  అలాగే శాస్త్రీయ సహకార సాంకేతిక రంగాలను గణనీయంగా బలోపేతం చేయడం ద్వారా ముఖ్యంగా ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ అడ్వాన్స్ డ్   రీసర్చ్ (సిఇఎఫ్ఐపిఆర్ఎ) పైనే కాకుండా ఉభయ దేశాలు పరస్పరం చర్చలు సంప్రదింపులు జరుపుతూ కేటాయించే వనరులపై కూడా గట్టి ప్రభావాన్ని చూపుతుంది.  

   6.1.2 సంక్లిష్ట సాంకేతిక రంగాలు:    2019లో ఆమోదించిన సైబర్ భద్రత, డిజిటల్ సాంకేతికతపై రెండుదేశాల మార్గదర్శక సూచీ ఆధారంగా భారత్, ఫ్రాన్స్ అధునాతన డిజిటల్ సాంకేతికలపై ప్రతిష్ఠాత్మక ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగిస్తాయి.   ముఖ్యంగా సూపర్  
కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్,  కృత్రిమ మేధ తదితర రంగాలల్తో పాటు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (జిపిఐఎ) నిర్దేషితాంశాల పరిధిలో ప్రగాఢ సహకారం పెరగనుంది.  ఇంతే కాకుండా క్వాంటమ్ టెక్నాలజీ,  వాతావరణ మార్పు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతల విస్తరణపై దృష్టి సారిస్తూనే ఆర్ అండ్ డి ఆవిష్కరణలు,  క్లిష్టమైన డిజిటల్ సాంకేతికత, పారిశ్రామిక అనువర్తనలపై కూడా సహకారం బలపడేలా ఉభయ దేశాలు కృషి చేస్తాయి.  

   6.1.3  ఆరోగ్య రంగంలో సహకారం:   ఆరోగ్యం, విద్య, ఔషధ రంగంలో ఇప్పటిదాకా ఉన్న సహకారాన్ని మరింత ఉధృతంగా పెంపొందిందుకోవడానికి  రెండు దేశాలు అంగీకరించాయి.  ఇందులో భాగంగా డిజిటల్ హెల్త్,  ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన
ఉద్దేశ్య లేఖపై (Letter of Intent) రెండు దేశాలు సంతకాలు చేసి మొదటి అడుగు వేశాయి.     దీనివలన ఆస్పత్రులు, ఇతర వైద్య ఆరోగ్య సంస్థల్లో నిత్యం విడుదలయ్యే వ్యర్ధాల నిర్వహణకు,  జీవ సాంకేతికతపై నిరంతర కృషికి ఆస్కారమేర్పడుతుంది.     ఉద్దేశ్య లేఖపై సంతకాలు చేయడం ద్వారా వైద్యుల మార్పిడి, శిక్షణకు మార్గం ఏర్పడుతుంది.   ఉభయదేశాల్లో వైద్య ఆరోగ్య రంగంలో తలెత్తే అత్యవసర పరిస్థితులలోని పరిణామాలను ఎదుర్కోవడం, నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందనలపై సహకారం అందించుకుంటాయి.  అంతేకాక డిజిటల్ ఆరోగ్య సాంకేతికతల నైపుణ్యాలను  మెరుగుపరచుకోవడంతో పాటు ఔషధ, జనశక్తి వనరులు, నైపుణ్యం రంగాలలో సహకారం పెంపునకు రెండు దేశాలు కృషిచేస్తాయి.  

    6.1.4 ఇండో - ఫ్రెంచ్ ఆరోగ్య ప్రాంగణం :   ఇండో - పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ - ఫ్రాన్స్ ఆరోగ్య ప్రాంగణం పురోగతిని రెండు దేశాలు 2022లో స్వాగతించాయి.  వినూత్న రూపంలో ఈ ప్రాంతంలోని దేశాల కోసం తమ  ప్రధాన భూ భాగంలోని అనేక విశ్వవిద్యాలయాలను
సమీకరించడంలో ఫ్రాన్స్ , లా రీ యూనియన్ ద్వీపం భారతీయ సంస్థలతో భాగస్వామిగా ఉన్నాయి.  గాఢవాంఛగల ఇండో- పసిఫిక్ ప్రాజెక్టులో యువత, పరిశోధన, రూపకల్పన ప్రధానాంశంగా ఉంటాయి.  ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఆరోగ్య రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి,  ప్రాంతీయ స్థాయిల్లో విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు ఆకర్షణగా మారడానికి ఒక వాహికగా మరగలడు.  ఈ కార్యక్రమం కింద ఆరోగ్య రంగంలో ద్వంద్వ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రాంలను రూపొందించడంలో నాలుగు ప్రాజెక్టులకు మద్దతు ఇస్తున్నారు.  వీటిలో సోబోర్న్  యూనివర్సిటీ,  ఐఐటి ఢిల్లీ విద్య కార్యక్రమాలు ఇప్పటికే సహకార పరిశోధనా ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి.   ముఖ్యంగా క్యాన్సర్ గురించిన అధ్యయనాలు,  న్యూరో సైన్సెస్,  బయో టెక్నాలజీ బయో మెడికల్ ఇంజనీరింగ్ ఇప్పటికే ఈ బాట పట్టాయి.    మరెన్నో ఇంకా ఈ కార్యక్రమాన్ని అనుసరించాల్సి ఉంటుంది.  గత సంవత్సరం జనవరి నెలలో ఫ్రాన్స్ కు చెందిన ఇనిస్ట్యూట్ పాశ్చర్,  భారత దేశానికి చెందిన  శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి (సిఎస్ఐఆర్) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కూడా మంచి పురోగతిని సాధించింది.   ఈ ఒప్పందం మేరకు హైదరాబాద్ లో పాశ్చర్ సెంటర్ ఏర్పాటుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయి.  

   6.1.5  సైబర్ సహకారం:   భారత్ ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలలో సైబర్ స్పేస్ ప్రాధాన్యత కీలకంగా మారింది.  రెండు దేశాలు వ్యూహాత్మక ప్రాముఖ్యత ప్రాధాన్యతను పునరుద్ఘాటించాయి.   ఇంతే కాకుండా సైబర్ సహకారాన్ని మరింతగా పెంచడంలో ద్వైపాక్షిక సైబర్ చర్చల పాత్రను నొక్కిచెప్పాయి.   రెండు దేశాలు మొదటి, మూడవ కమిటీలలో పురోగతి ఉన్న ఐరాస  సైబర్ ప్రక్రియలపై
అభిప్రాయాలను పరస్పరం ప్రశంసించాయి.   ఉమ్మడి ప్రయోజనకర అంశాలపై కలసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయి.  ఐసిటి
ల వినియోగంలో బాధ్యతాయుతంగా ముందడుగు వేసేందుకు భవిష్యత్ కార్యాచరణతో సహా ప్రస్తుత తొలి కమిటీ (2021-25) అధ్యయన బృందం చర్చలకు మద్దతివ్వడానికి,  సంయుక్తంగా పనిచేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి.   సైబర్ నేరాలను నిరోధించడం, తగ్గించడం, దర్యాప్తు చేయడం, విచారించడం,  నేరపూరిత ప్రయోజనాల కోసం ఐసిటిల వినియోగాన్ని అరికట్టడం కోసం ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో సమగ్ర అంతర్జాతీయ ఒప్పందాన్ని వివరించడానికి,  రెండు దేశాలు పరస్పరం సన్నిహితంగా పనిచేయడానికి అంగీకరించాయి.   బాధితులకు సత్వర న్యాయం,  ప్రాథమిక హక్కుల పరిరక్షణ సైబర్ స్పేస్ లో తలెత్తుతున్న సవాళ్లను పరిష్కరించడానికి సైబర్ సంసిద్ధతను మెరుగుపరచడానికి సైబర్ మూల వసతుల మెరుగుకు భరోసా ఇవ్వడంలో సామర్ధ్య పెంపునకు గల ప్రాముఖ్యతను భారత్ పునరుద్ఘాటించింది.  సైబర్ ముప్పును తొలగించే ఉత్తమ పద్ధతుల సమాచారం,  అభివృద్ధి చెందుతున్న జాతీయ సైబర్ రక్షణ వ్యూహం పరిణామాలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి.  

  6.1.6  డిజిటల్ నియంత్రణ శాసనం:  సమాచార/దత్తాంశాల సంరక్షక సంస్థ సహా  సిఎన్ఐఎల్ తదితర ఫ్రెంచ్ నిర్వాహకులు, సంబంధిత భారతీయ వ్యవహర్తల మధ్య సంభాషణను రెండు దేశాలు ప్రోత్సహిస్తాయి.  ఐరోపా స్థాయిలో వారు డిజిటల్ నియంత్రణ, సమాచార గోప్యతపై ఐరోపా సమాజంతో సన్నిహిత చర్చలకు మద్దతిస్తారు.   సమాచారం, ప్రజాస్వామ్యంపై భాగస్వామ్య లక్ష్యాలకు రెండు దేశాలు మద్దతిస్తాయి.    

  6.1.7   డిజిటల్ సాంకేతికతపై సహకారం:   భారత్ - ఫ్రాన్స్ డిజిటల్ సాంకేతికతతో శీఘ్రగతిన పురోగతి,  పరివర్తన ఆవశ్యకతను గుర్తించాయి.  డిజిటలీకరణకు సంబంధించిన విధానాలలో తమ బలాల  తాత్విక కలయికను ఉపయోగించుకోవడానికి సుముఖంగా ఉన్నాయి.  ప్రభుత్వ డిజిటల్ ప్రాథమిక వసతులు,  సైబర్ భద్రత,  అంకురాల సూపర్ కంప్యూటింగ్,  5జి/6జి టెలికాం డిజిటల్ నైపుణ్యాభివృద్ధి రంగాలలో తమ సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.  
         సైబర్ సెక్యూరిటీ డిజిటల్ సాంకేతికతపై ఇండో-ఫ్రెంచ్ మార్గదర్శక సూచీకి అనుగుణంగా శాంతియుత సురక్షిత బహిరంగ సైబర్ స్పేస్ ను ప్రోత్సహించడంలో తమ్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు సంబంధిత పర్యావరణ వ్యవస్థలో భాగస్వాములుగా చేరడానికి ఉభయ దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.   వినూత్నత, ఉద్యోగ కల్పన, ఆర్ధిక వృద్ధిని సాధించడంలో అంకుర సంస్థల సామర్ధ్యాన్ని గుర్తిస్తూ రెండు దేశాలు తమ సంబంధిత స్టార్ట్ అప్ వ్యవస్థాపక నెట్ వర్క్ ల మధ్య మెరుగైన సంబంధం ద్వారా ద్వైపాక్షిక సహకారాన్ని సులభతరం చేయడానికి భాగస్వామ్య నిబద్ధతను చాటి చెప్పాయి.   2022లో వైవాటెక్ లో మొదటి దేశంగా భారత్ పాల్గొనడం, ఈ సంవత్సరం గణనీయమైన స్థాయిలో పాల్గొనడం డిజిటల్ యుగంలో భారత్ ప్రత్యేక పాత్రను , డిజిటల్ రాజ్యంలో ప్రపంచ నాయకత్వం కోసం సమున్నత భాగస్వామిగా భారత్ విలువను ప్రతిబింబిస్తుంది.  
         ఇండియా, ఫ్రాన్స్ అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి వారి పౌరులను శక్తివంతం చేసే సహకారాన్ని ప్రోది చేయడానికి డిజిటల్ శతాబ్దంలో వారి పూర్తి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాయి.   ఈ స్పూర్తితో గత వారం ఎన్ పి సి ఐ ఇంటర్నేషనల్  పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ ఐ పి ఎల్) ఫ్రాన్స్ లేరా కలెక్ట్ యూనిఫైడ్ పేమెంట్స్ ని ఐరోపాలో ఫ్రాన్స్ అమలు చేయడానికి ఒక ఒప్పందం అమలు చేశాయి.    చెల్లింపు విధానం ఫలితమిచ్చే దిశగా చివరి దశలో ఉంది.  యుపిఐని ఆమోదించిన ఫ్రాన్స్ లో మొదటి వ్యాపారిగా పారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ తో సెప్టెంబర్ 2023 నాటికి ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది.
          బహిరంగ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సమ్మిళిత డిజిటల్ ఆర్ధిక వ్యవస్థలు డిజిటల్ సమాజాల అభివృద్ధికి డిజిటల్ ప్రభుత్వ ప్రాథమిక వసతులు డిపిఐ విధానం శక్తిపై నమ్మకంతో భారత్, ఫ్రాన్స్ వసతుల కల్పన ద్వారా అధునాతన బహుళ మదుపరుల ఎక్స్చేంజి లను ఏర్పాటు చేసుకున్నాయి.  ఇన్ఫినిటీ (ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)  ప్లాటుఫారంలు, మేము మా రెండు దేశాల డిజిటల్ పర్యావరణ వ్యవస్థలు కలయిక ద్వారా పురోగతి సాధించడంపై సంబరాలు జరుపుకుంటాం.   డిపిఐలోని ఉమ్మడి ప్రాజెక్టులు బహుళ రంగాలలో ఎంతగా ప్రభావం చూపగలవో గుర్తించాము.  డిపిఐ విధానం సాంకేతిక మార్కెట్లు, పాలనను పౌరులను శక్తివంతం చేయడానికి ఆర్ధిక, సామాజిక పరివర్తనను ఉత్తేజపరచడానికి  ప్రభుత్వ సేవల విధానాన్ని మెరుగు పర్చడానికి సార్వభౌమ స్థిరమైన డిజిటల్ పరిష్కారాల కోసం మార్కెట్ పోటీతత్వాన్ని ప్రోత్సహించడం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కూడా దోహదపడుతుంది.   ఉమ్మడి డిపిఐ సహకార ప్రయత్నాల్లో భాగంగా పారదర్శక పద్ధతులను ఉపయోగించడం ద్వారా వాణిజ్య, సంస్కృతి మొదలైన రంగాలలో అధిక ప్రభావ కార్యక్రమాలను భారతదేశం ఫ్రాన్స్ పరస్పరం గుర్తించాయి.    రెండు దేశాల మధ్య ఇటువంటి సహకారాన్ని పరస్పరం స్వాగతించాయి.   ఇండో-పసిఫిక్,  ఆఫ్రికా , ఆ వెలుపల ఉన్న ఇతర దేశాలకు ఈ విధానాన్ని తీసుకెళ్ళడంలో ఒకరికొకరు ఉమ్మడిగా సహకరించుకోవడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.  

II – భూగోళం  కోసం భాగస్వామ్యం
1) మన వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి ఇంధన భద్రతను బలోపేతం చేయడం  

1.1 భారతదేశ పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ, ఇంధన భద్రతను పెంచడం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు7, పారిస్ శీతోష్ణ స్థితి  ఒప్పంద లక్ష్యాలను సాధించడం ద్వారా పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడం అనే ముప్పేట లక్ష్యంతో, తక్కువ కార్బన్ ఉండే ఆర్థిక వ్యవస్థ వైపు పరివర్తనపై భారతదేశం, ఫ్రాన్స్ సన్నిహితంగా సహకరిస్తున్నాయి. పారిస్ ఒప్పందం దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఇంధన మిశ్రమంలో కాలుష్య రహిత వనరుల వాటాను పెంచడం అవసరమని భారతదేశం, ఫ్రాన్స్ గుర్తించాయి. ఇంధన భద్రత సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఈ దిశగా సంయుక్తంగా పనిచేయడానికిఈ రెండు దేశాలు  కట్టుబడి ఉన్నాయి. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో స్థిరమైన పరిష్కారాలలో అణుశక్తి వినియోగం కూడా ఉందనే నమ్మకాన్ని భారత్ , ఫ్రాన్స్
పంచుకుంటున్నాయి.

1.2 ఇండో-పసిఫిక్‌లో వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం: ఇండో-పసిఫిక్ పార్క్స్ భాగస్వామ్యం, అంతర్జాతీయ  సౌర కూటమితో  సహా బహుపాక్షిక, మూడవ దేశం కార్యక్రమాల ద్వారా భారతదేశం, ఫ్రాన్స్ ఈ ప్రాంతంలోని దేశాలకు స్థిరమైన అభివృద్ధి పరిష్కారాలను అందిస్తాయి. సముద్ర, భూసంబంధమైన జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (IPOI). సుస్థిర అభివృద్ధికి (SUFIP ఇనిషియేటివ్ - ఇండో-పసిఫిక్‌ ప్రాతంలో స్థిరమైన ద్రవ్యస్థితి ) ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని భాగస్వాములను  సమీకరించే లక్ష్యంతో తమ అభివృద్ధి బ్యాంకుల మధ్య సంప్రదింపులను భారత్, ఫ్రాన్స్  స్వాగతించాయి. నీలి ఆర్థిక వ్యవస్థ, ప్రాదేశిక స్థితిస్థాపకత, క్లైమేట్ ఫైనాన్స్‌కు సంబంధించిన సమస్యలపై భారత్, ఫ్రాన్స్ చర్చలు సహకారాన్ని ప్రోత్సహిస్తాయి. భారతదేశం, ఫ్రాన్స్ తమ పౌర భద్రతా సంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ముఖ్యంగా విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమిలో వారి జ్ఞానం, నైపుణ్యం, విత్తనాల ఫైనాన్సింగ్‌ను పంచుకోవడం ద్వారా సహజ ప్రమాదాలు, వాతావరణ మార్పు సంబంధిత విపత్తులను అంచనా వేయడంలో,ప్రతిస్పందించడంలో తమ సహకారాన్ని అభివృద్ధి చేస్తాయి.

1.3 ఎలక్ట్రోన్యూక్లియర్: జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ (JNPP)కి సంబంధించిన చర్చల సమయంలో సాధించిన పురోగతిని ఇరుపక్షాలు స్వాగతించాయి. EPR రియాక్టర్‌లతో కూడిన ప్రాజెక్టులలో విస్తరణ కోసం భారతదేశం నుండి సివిల్ న్యూక్లియర్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల శిక్షణ కోసం EDF ప్రతిపాదనను వారు స్వాగతించారు. ఈ విషయంలో ఒక ఒప్పందం ముందస్తు ముగింపు కోసం ఎదురుచూస్తున్నారు. స్కిల్స్ ఇండియా చొరవకు అనుగుణంగా, సంబంధిత ఫ్రెంచ్ సంస్థలు అణు రంగంలో శిక్షణను బలోపేతం చేయడానికి, భారతీయ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను ప్రోత్సహించడానికి/సులభతరం చేయడానికి భారతీయ సహచరులతో కలిసి పని చేస్తాయి. తక్కువ, మధ్య తరహా  పవర్ మాడ్యులర్ రియాక్టర్లు లేదా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (SMR), అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ రియాక్టర్ల (AMR)పై భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. అణు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి జూల్స్ హోరోవిట్జ్ రీసెర్చ్ రియాక్టర్ (JHR)పై రెండు దేశాలు తమ సహకారాన్ని కొనసాగిస్తాయి. వాటి మార్పిడిని మెరుగుపరుస్తాయి.  

1.4 డీకార్బోనేటెడ్ హైడ్రోజన్: గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రణాళికను అంగీకరించిన తరువాత, డీకార్బోనేటెడ్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాలు, నియంత్రణ ప్రమాణాలలో ఆవిష్కరణలో భారత్, ఫ్రాన్స్ సన్నిహిత సహకారాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. కార్యాచరణ పరిష్కారాలను అమలు చేయడానికి రెండు దేశాల కంపెనీల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి.

1.5 పునరుత్పాదక/అక్షయ  ఇంధనాల అభివృద్ధికి భారత్, ఫ్రాన్స్ కట్టుబడి ఉన్నాయి. సౌరశక్తిపై ప్రత్యేకించి, భారతదేశం, ఫ్రాన్స్ తమ సౌర కార్యక్రమాలలో మూడవ దేశాలకు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సౌర కూటమిలో తమ సన్నిహిత సహకారం, ప్రమేయంపై ఆధారపడతాయి, ప్రత్యేకించి STAR-C కార్యక్రమం సెనెగల్‌లో ఉమ్మడి పరిశోధన,
అభివృద్ధి ద్వారా సోలార్ అకాడమీ ఏర్పాటు చేస్తారు.

1.6 జలవిద్యుత్‌పై, భారత్, ఫ్రాన్స్ తమ సహకారాన్ని బలోపేతం చేస్తున్నాయి. రెండు దేశాలలో వ్యాపార పథకాలకు మద్దతు ఇస్తున్నాయి, ముఖ్యంగా ఇప్పటికే ఉన్న వ్యవస్థల  పునరుద్ధరణ, రన్-ఆఫ్-రివర్ సొల్యూషన్స్, పంప్-స్టోరేజ్ సొల్యూషన్‌ల
ప్రచారం కొనసాగిస్తాయి.

1.7 ఇంధన సామర్థ్యం: భారతదేశంలో నిర్వహిస్తున్న  స్మార్ట్ సిటీల కార్యక్రమాల విజయాన్ని నిర్మించడం, దాని భవనాలు, పట్టణ, పారిశ్రామిక, రవాణా సౌకర్యాల ఇంధన పనితీరును మెరుగుపరచడం, తెలివైన విద్యుత్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, దాని ఆర్థిక వ్యవస్థ శక్తి తీవ్రతను తగ్గించడం, ఇంధన పనితీరును మెరుగుపరచడం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్ మద్దతు ఇస్తుంది. ఎనర్జీ డేటా సేకరణ, విశ్లేషణలో నైపుణ్యాన్ని పంచుకోవడానికి రెండు పక్షాలు అంగీకరించాయి.

2) వాతావరణ మార్పు, జీవవైవిధ్యానికి చేటు, కాలుష్యం అనే ముప్పేట/త్రివిధ  సంక్షోభాలను సంయుక్తంగా పరిష్కరించడం

2.1 వాతావరణ మార్పు, పర్యావరణ కాలుష్యం, జీవవైవిధ్యానికి చేటు ముప్పేట సవాళ్ల గురించి తెలుసుకుని, భారత్, ఫ్రాన్స్ తమ సహకారాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయి. వాతావరణ మార్పు పరిణామాలు ప్రజారోగ్యానికి నిజమైన ముప్పును సూచిస్తాయి కాబట్టి, భారత్, ఫ్రాన్స్ వన్ హెల్త్ విధానం స్ఫూర్తితో ప్రజారోగ్య రంగంలో సహకరిస్తున్నాయి, PREZODE చొరవలో సహకారాన్ని అన్వేషించడం ద్వారా, ఒప్పందం చర్చలలో పాల్గొంటాయి. మహమ్మారిపై, ద్వైపాక్షికంగా, ఆసుపత్రి, ఔషధ సహకార రంగాలలో. ఫిబ్రవరి 2022లో ఆమోదించిన  బ్లూ ఎకానమీ, ఓషన్ గవర్నెన్స్‌పై ప్రణాళికలో  భాగంగా, మత్స్య వనరుల స్థిరమైన నిర్వహణపై సహకారం, సముద్ర పరిశోధన, సాంకేతికతలపై IFREMER, NIOT/MoES మధ్య ఒప్పందం కొత్త సహకార రంగాలను తెరుస్తుంది. 2025లో జరిగే UNOCకి ముందు G20 బృందంలో సముద్రంపై సంభాషణను ప్రారంభించేందుకు వారు మద్దతు ఇస్తున్నారు.

2.2 వాతావరణ మార్పు: వీలైనంత త్వరగా కర్బన రాహిత్యాన్ని  సాధించడానికి, వరుసగా 2050, 2070 తర్వాత కాకుండా తమ వాతావరణ ఆశయాలను స్థిరంగా పెంచడానికి భారత్,  ఫ్రాన్స్ కట్టుబడి ఉన్నాయి.

2.3 స్థిరమైన భవనాలు: వాతావరణం, జీవవైవిధ్య విధానాల విజయంలో భవనాలను కర్బన రహితం చేయడం, స్థితిస్థాపకత ప్రాముఖ్యతను భారత్ , ఫ్రాన్స్ గుర్తించాయి, అలాగే జనాభా శ్రేయస్సు, భద్రతకు దోహదం చేస్తాయి. దీని కోసం, భారత్,  ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక విధానాలు, వినూత్న మార్గాల నిర్వచనం అమలులో సహకరిస్తున్నాయి, కొత్త భవనాల నిర్మాణాన్ని సాధారణీకరించడం, ఇప్పటికే ఉన్న భవనాల పునరుద్ధరణ శూన్య ఉద్గార పనితీరుతో, భవిష్యత్ వాతావరణాలకు అనుగుణంగా, వైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాస్తుశిల్పం. ఈ సందర్భంలో, నిర్మాణంలో పొదుపు, వనరుల సామర్థ్యంపై ప్రధానంగా ఆధారపడిన విధానాన్నిభారత్, ఫ్రాన్స్ ప్రోత్సహిస్తున్నాయి. ఈ విధానం భారతదేశం ఆమోదించిన మిషన్ లైఫ్ లేదా లైఫ్ స్టైల్స్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌కు అనుగుణంగా ఉంది. అక్టోబర్ 2022లో ఫ్రాన్స్ మద్దతు ఇస్తుంది.

2.4 వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ప్లాస్టిక్ కాలుష్యం:  ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి కొత్త చట్టబద్ధమైన అంతర్జాతీయ సాధనం కొనసాగుతున్న చర్చలలో భారత్, ఫ్రాన్స్ చురుకుగా పాల్గొంటున్నాయి. ఒకేసారి వాడి పారవేసే ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలనపై ఇండో-ఫ్రెంచ్ నిబద్ధతలో తోడుగా కొత్త దేశాలను భాగస్వామ్యం చేయడానికి భారత్, ఫ్రాన్స్ కృషి చేస్తున్నాయి.


2.5 జీవవైవిధ్యానికి  నష్టం: జాతీయ పరిస్థితులు, ప్రాధాన్యతలు, సామర్థ్యాలకు అనుగుణంగా కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ (KMGBF) ప్రపంచ స్వభావం గల లక్ష్యాలు,  లక్ష్యాల ప్రాముఖ్యతను, వాటి ప్రభావవంతమైన అమలును భారత్, ఫ్రాన్స్  గుర్తించాయి. భారత్, ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ పార్క్స్ భాగస్వామ్యాన్ని (I3P) అమలు చేస్తూనే ఉన్నాయి. జాతీయ అధికార పరిధి (BBNJ) కి మించిన ప్రాంతాలలో సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగంపై ఒప్పందాన్ని పొందికగా, సహకార పద్ధతిలో, జీవ వైవిధ్య నష్టం, సముద్ర పర్యావరణ వ్యవస్థల క్షీణతను పరిష్కరించడానికి వీలుగా అములు చేయడాన్ని భారత్, ఫ్రాన్స్ స్వాగతించాయి.

3) భారతదేశంలో పట్టణ, పర్యావరణ పరివర్తనలు అలాగే సామాజిక చేర్పులకు మద్దతు ఇవ్వడం

3.1  ఫ్రాన్స్‌ను దాని నైపుణ్యం, దాని కంపెనీలు, ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (AFD)  ద్వారా ఇండియాలో విజయవంతంగా పట్టణ పరివర్తనను సాధించడానికి తన  ప్రధాన భాగస్వామిగా  చేసుకోవాలని భారత్  భావిస్తోంది.

3.2 సమీకృత వ్యర్ధాల నిర్వహణ: వ్యర్థాల సేకరణ & రవాణా, వ్యర్థాల నుండి సంపద పరిష్కారాలను బలోపేతం చేయడంతో కూడిన సమగ్ర వ్యర్థ పదార్థాల నిర్వహణపై దృష్టి సారించి వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా నగరాలకు మద్దతు ఇచ్చే పరిష్కారాలపై భారt, ఫ్రాన్స్ తమ సహకారాన్ని బలోపేతం చేస్తున్నాయి; నగరాల ద్వారా ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం. సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ (CITIIS 2.0) పథకం  2వ దశ ప్రారంభం ఈ ప్రాంతంలో వినూత్న పరిష్కారాలను ప్రోత్సహిస్తుంది. CITIIS 2.0 రాష్ట్ర స్థాయిలో క్లైమేట్ గవర్నెన్స్‌ను ప్రోత్సహించడం, పురపాలక సిబ్బంది సామర్థ్యాలను పెంపొందించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

3.3 రవాణా &అర్బన్ మొబిలిటీ: భారత్, ఫ్రాన్స్ రవాణా రంగంలో తమ సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా, చలనశీలత సమస్యలను పరిష్కరించడానికి కొత్త పరిష్కారాలను అన్వేషించడం ద్వారా రవాణాపై తమ సంభాషణను మరింతగా పెంచుకుంటున్నాయి, ముఖ్యంగా అహ్మదాబాద్, సూరత్‌ వంటి పట్టణ ప్రాంతాలలో పథకాలు ఏర్పాటు చేయడం.

3.4 సామాజిక చేర్పు:  భారత్, ఫ్రాన్స్ మరింత సమగ్రమైన, పర్యావరణ హితమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారతీయ నిధులు (అన్నపూర్ణ, ఇండస్ ఇండ్ బ్యాంక్, నియోగ్రోత్) అండతో పాటు మరియు ప్రోపార్కో మద్దతు ఉన్న విధంగా మహిళలు , జనాభాలో  దుర్బలల  ఆర్థిక చేర్పునకు  దోహదపడే కార్యక్రమాలు మరియు ప్రాధాన్యత అభివృద్ధి ప్రాంతాల వికాసాన్ని ప్రోత్సహించడానికి ఉత్సుకతతో  ఉన్నాయి.

4) స్థిరమైన వృద్ధి, తక్కువ కార్బన్ శక్తికి పరివర్తనను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులను సులభతరం చేయడం.

4.1 మరింత స్థితిస్థాపక విలువ శృంఖల  ఆవృద్ధి అనేది భారత్ , ఫ్రాన్స్‌ మధ్య ఒక సాధారణ లక్ష్యం, దీని కోసం వారు ఈ అంశానికి ఉపకరించే  పరిస్థితులు, విధాన మార్పిడిని సృష్టించడం ద్వారా సులభతరం చేస్తారు.

4.2 వాణిజ్యం: భారత్,  ఫ్రాన్స్‌ తమ తమ మార్కెట్లలో ముఖ్యంగా ద్వైపాక్షిక ఫాస్ట్ ట్రాక్ ప్రక్రియ సందర్భంలో భారతీయ, ఫ్రెంచ్ ఎగుమతిదారులు మరియు పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తమ ద్వైపాక్షిక సంభాషణను తీవ్రతరం చేస్తున్నాయి.

4.3 క్రాస్-ఇన్వెస్ట్‌మెంట్: భారత్,  ఫ్రాన్స్ తమ సంబంధాలను బలోపేతం చేయడానికి, రెండు దేశాలలో కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి భారతీయ, ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహిస్తాయి, ముఖ్యంగా భారతదేశంలో ఫ్రెంచ్ పెట్టుబడిదారుల ఉనికిని, ఫ్రాన్స్‌లో భారతీయ పెట్టుబడిదారుల ఉనికిని పెంచే లక్ష్యంతో చర్యలు చేపడతారు.   ఈ క్రమంలో ఇన్వెస్ట్ ఇండియా, బిజినెస్ ఫ్రాన్స్ పరస్పరం ఆర్థిక వ్యవస్థలలో ఫ్రాన్స్, భారత్ నుండి పెట్టుబడులను సులభతరం చేయడంలో సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.

 

III - ప్రజల కోసం భాగస్వామ్యం

1)   మార్పిడిని ప్రత్యేకంగా యువత ప్రయోజనం కోసం ప్రోత్సహించడం

1.1    విద్యార్థులు, పట్టభద్రులు, విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు మరియు నిపుణులైన  కార్మికుల చలనశీలతను పెంపొందించడంలో మా భాగస్వామ్య కట్టుబాటు వాస్తవరూపం దాల్చడంలో  2021లో అమల్లోకి వచ్చిన వలస, కదలికపై భాగస్వామ్య ఒప్పందం ముఖ్యమైన చర్య.   భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య యాత్రికుల రాకపోకలను  ప్రోత్సహించడం మరియు ప్రైవేట్ రంగం మరియు వ్యాపార వర్గాలకు వీసాల జారీని సులభతరం చేయడం ద్వారా ప్రజలు -- ప్రజలు మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. భారతదేశం మరియు ఫ్రాన్స్ ఇచ్చిపుచ్చుకునే విధంగా అధికారిక పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా మినహాయింపును మంజూరు చేస్తాయి.  ఈ మినహాయింపు ప్రభావాన్ని 2026లో మదింపు వేస్తాయి.  దానితోపాటు రెండు దేశాల మధ్య నిపుణుల  చలనశీలతను ప్రోత్సహించడానికి డిప్లొమాలు మరియు వృత్తిపరమైన అర్హతల పరస్పర గుర్తింపును ప్రోత్సహించే కార్యక్రమాలపై సంయుక్తంగా పని చేస్తాయి.

1.2 వృత్తిపరమైన మరియు భాషా శిక్షణలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు మరియు ప్రైవేట్ కంపెనీల మధ్య భాగస్వామ్య అభివృద్ధిని రెండు దేశాలు ప్రోత్సహిస్తాయి. భాషాపరమైన సహకారం కోసం జరిగే  ప్రయత్నాలను వారు పునరుత్తేజితం చేస్తారు. భారతీయ పాఠశాలల్లో ఫ్రెంచ్ భాషా బోధన అభివృద్ధిని ప్రోత్సహిస్తారు, భాషా ఉపాధ్యాయుల మార్పిడి మరియు శిక్షణను ప్రోత్సహిస్తారు, మార్పిడి కార్యక్రమాల కోసం వీసా మంజూరుకు మద్దతు ఇస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ఒకరికొకరు పరస్పరం భాషలను బోధించడానికి వారు ఇస్తున్న ప్రాముఖ్యతను నొక్కిచెబుతాయి. రెండు దేశాల మధ్య రాకపోకలు ప్రోత్సహించడంలో భాషలు కీలక పాత్ర పోషిస్తాయి.

1.3 విద్యార్థుల చలనశీలత: భారతదేశం మరియు ఫ్రాన్స్ తమ విద్యా సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు విద్యార్థుల మార్పిడిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఇండో-ఫ్రెంచ్ ఆరోగ్య ప్రాంగణం (క్యాంపస్) నమూనాలో, అలాగే పరిశోధకుల చలనశీలత, ముఖ్యంగా శాస్త్ర, సాంకేతికత వంటి ప్రాధాన్యతా  రంగాలలో ఉమ్మడి శిక్షణా కార్యక్రమాల అభివృద్ధిని భారతదేశం మరియు ఫ్రాన్స్ ప్రోత్సహిస్తాయి. భారతీయ పూర్వ విద్యార్థుల (స్నాతకుల) సమాజం ఏర్పాటుకు, ఫ్రాన్స్‌లో కనీసం ఒక సెమిస్టర్‌ చదివిన భారతీయులు ఫ్రెంచ్ విశ్వవిద్యాలయ వ్యవస్థ గుర్తించిన విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ స్థాయికి చేరుకోవడంతో పాటు స్కెంజెన్ అవసరాలకు అనుగుణంగా పూర్తి ఆమోదయోగ్యమైన ఫైల్ ఉన్నట్లయితే ఫ్రాన్స్ వారికి ఐదేళ్లు అమలులో ఉండే స్కెంజెన్ వీసాలను జారీ చేస్తుంది.  

        వచ్చే రెండేళ్లలో అంటే 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆహ్వానించాలనే తమ అభ్యుదయేచ్ఛను ఫ్రాన్స్ పునరుద్ఘాటించింది.  2030 నాటికి ఈ సంఖ్యను 30,000కు పెంచాలనే వాంఛను వ్యక్తం చేసింది.  

ఈ లక్ష్యాల సాధనకు సులభతరం చేయడానికి, ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లో అధ్యయనాల ప్రమోషన్‌ను బలోపేతం చేస్తుంది మరియు భారతదేశంలో ఈ ప్రమోషన్‌కు అంకితమైన సిబ్బందిని పెంచుతుంది. ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు మరియు ఇతర ఉన్నత విద్యా సంస్థలలో "అంతర్జాతీయ తరగతులను" కూడా ఫ్రాన్స్ సృష్టిస్తుంది, ఇక్కడ భారతీయ విద్యార్థులు ఫ్రెంచ్ భాష మరియు విద్యా విషయాలలో శిక్షణ పొందుతారు. ఇది ఫ్రెంచ్ భాషలో బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లలో చేరడానికి వారిని అనుమతిస్తుంది. ఫ్రెంచ్ ప్రభుత్వం అటువంటి తరగతులను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తుంది, అయితే భారత ప్రభుత్వం భారతదేశంలోని మాధ్యమిక విద్యా వ్యవస్థలో దీనిని ప్రోత్సహిస్తుంది.
ఈ లక్ష్యాల సాధనను సులభతరం చేయడానికి,  ఫ్రాన్స్‌లో అధ్యయనాలను ప్రోత్సహించడాన్ని  ఫ్రాన్స్ బలోపేతం చేస్తుంది.  భారత్ లో  దీనికి  అంకితమైన సిబ్బంది సంఖ్యను  పెంచుతుంది. భారతీయ విద్యార్థులు ఫ్రెంచ్ భాష మరియు విద్యా విషయాలలో శిక్షణ పొందడానికి ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలలో "అంతర్జాతీయ తరగతులను" కూడా ఫ్రాన్స్ ఏర్పాటు చేస్తుంది. ఫ్రెంచ్ భాషలో బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లలో చేరడానికి వారిని అనుమతిస్తారు. అటువంటి తరగతులను ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తుంది.  అదే సమయంలో భారత ప్రభుత్వం దానిని సెకండరీ విద్యావ్యవస్థలో ప్రోత్సహిస్తుంది.

1.4 మన పౌర సమాజాల మధ్య స్థిరమైన మార్పిడి:  తమ  పౌర సమాజాల మధ్య, ముఖ్యంగా ఫ్రాన్స్-ఇండియా ఫౌండేషన్, భారతదేశంలోని అలయన్స్ ఫ్రాంకైసెస్ నెట్‌వర్క్‌తో సహా భవిష్యత్ కార్యక్రమాలలో మార్పిడిని ప్రారంభించే నిర్మాణాలు మరియు యంత్రాంగాలను బలోపేతం చేయడం భారతదేశం,  ఫ్రాన్స్‌ కొనసాగిస్తాయి. భారతదేశం మరియు ఫ్రాన్స్ 2025 నాటికి భారతదేశంలో ఫ్రెంచ్ వలంటీర్ల సంఖ్యను రెట్టింపు చేయడానికి మరియు ఫ్రాన్స్‌లో భారతీయ వలంటీర్ల సంఖ్యను ఐదుకు పెంచడానికి "అంతర్జాతీయ సంఘీభావ స్వయంసేవ మరియు పౌర సేవ" పథకం వంటివి  రెండు దేశాలలో జరిగే యువ మార్పిడిని ప్రోత్సహిస్తాయి.

2) మన సంస్కృతుల మధ్య క్రమంతప్పని  సంభాషణను ప్రోత్సహించడం

2.1 మన రెండు దేశాలు ఇప్పుడు సాంస్కృతిక మార్పిడి కోసం మూలాధారమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మరియు మన సృజనాత్మక పరిశ్రమలను సన్నిహితం చేయడానికి గల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాయి:

2.2 మ్యూజియంలు మరియు వారసత్వ రంగంలో సహకారం: సుసంపన్నమైన సంస్కృతి మరియు చరిత్ర కలిగిన దేశాలుగా, భారతదేశం మరియు ఫ్రాన్స్ తమ వారసత్వాన్ని ప్రదర్శించడానికి మరియు భవిష్యత్తు తరాలకు అందించడానికి వారి ఉమ్మడి కృషిని తీవ్రం  చేస్తాయి. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఉద్దేశ్య ప్రకటన లేఖపై సంతకం చేయడాన్ని భారతదేశం మరియు ఫ్రాన్స్ స్వాగతించాయి. ప్రధాన సాంస్కృతిక ప్రాజెక్టుల అనుభవం, ముఖ్యంగా గ్రాండ్ లౌవ్రే ప్రయోజనాన్ని భారతదేశానికి ఫ్రాన్స్ అందిస్తుంది. పురావస్తు పురాతన వస్తువులు, చిత్రలేఖనాలు , నాణాల శాస్త్రం, అలంకార కళలు మొదలైన వాటి ప్రదర్శన, నిల్వ మరియు ప్రదర్శన కోసం నిదర్శనగా చూపిన గ్రాండ్ లౌవ్రే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్‌కు తగిన పరిశీలనగా ఉంటుంది.

2.4 సినిమా:  ఐరోపాలో అతిపెద్ద సినిమా మార్కెట్ ఫ్రాన్స్ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నిర్మాత ఇండియా పరస్పరం తమ
చిత్రాల ఎగుమతికి సహాయపడుతున్నాయి.  దృశ్య -  శ్రవణ సహనిర్మాణ ఒప్పందం ద్వారా ఉమ్మడి నిర్మాణాలు చేపట్టేందుకు సులువు అవుతోంది.  తద్వారా చిత్ర నిర్మాణానికి వారి దేశంలో గల ఆకర్షణీయ స్థలాలను ప్రోత్సహించడానికి వీలవుతుంది.  

2.5 కళాత్మక మరియు సాహిత్య సహకారం: భారతదేశం మరియు ఫ్రాన్స్ మన రెండు దేశాల మధ్య వృత్తి నిపుణులు మరియు కళాకారుల కదలికల స్థాయిని పెంచే లక్ష్యాన్ని సాధించడానికి ఉమ్మడిగా పాటుపడతాయి. ఈ ఏడాది మార్చి 3వ తేదీన ప్రారంభించిన విల్లా స్వాగతం నమూనాలో, రెసిడెన్సీలలో దీర్ఘకాలిక బసకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా  స్థిరమైన అభివృద్ధికి అనుకూలంగా ఫ్రెంచ్ కళాకారులను రెసిడెన్సీలకు స్వాగతించాలని భావిస్తున్నారు. విల్లా స్వాగతం అనేది రెసిడెన్సీల నెట్‌వర్క్.  భారత్ అంతటా 16 రెసిడెన్సీలు ఉన్నాయి.  భారత్ చరిత్ర నుంచి నేర్చుకునే  ఫ్రెంచ్ కళాకారులు మరియు రచయితల సంఘాన్ని సృష్టించాలని ఫ్రాన్స్ కోరుకుంటుంది.    భారత్, ఫ్రాన్స్ కలిపి 2035 నాటికి 300 మంది విల్లా స్వాగతం పొందినవారు (అలంకృతులు) ఉండేందుకు కట్టుబడి ఉన్నాయి.   ఫ్రాన్స్‌లో భారతీయ కళాకారులు ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత లలిత కళా అకాడమీ సహాయం చేస్తుంది. ఫ్రాన్స్ జాతీయులలో భారతీయ కళాత్మక సంప్రదాయాలపై విస్తృత ఆసక్తిని పెంపొందించడానికి ఈ మద్దతును కొనసాగిస్తుంది.

2.6 భాషాపరమైన సహకారం: భారతదేశంలో అలయన్స్ ఫ్రాంకైసెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ,  ఫ్రెంచ్ భాషాబోధన కార్యక్రమాల అభివృద్ధిని ముఖ్యంగా భారతీయ ప్రైవేట్‌ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో  పాఠ్యాంశాలు మరియు బోధనాభ్యాస సామగ్రితో పాటు వయస్సుకి తగిన పాఠ్యపుస్తకాలను అందించడం ద్వారాప్రోత్సహించడానికి భారత్, ఫ్రాన్స్ కట్టుబడి ఉన్నాయి.    భారతదేశంలో అలయన్సెస్ ఫ్రాంకైసెస్ నెట్‌వర్క్‌లో విద్యార్థుల సంఖ్యను  50,000 మందికి పెంచాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి వారు కట్టుబడి ఉన్నారు. ఇంకా ఫ్రాన్స్‌లో పాఠశాల మరియు ఉన్నత విద్యా సంస్థలలో  భారతీయ భాషలను ప్రాచీన భారతీయ లిపిలను ప్రోత్సహిస్తారు. దీని కోసం భారతదేశం నుండి ప్రత్యేక విద్యా మరియు భాషా సంస్థల సహకారం తీసుకోవచ్చు.

2.7 ఫ్రాంకోఫోన్ దేశాలు మరియు ప్రాంతాలు మరియు ఫ్రెంచ్ సంస్కృతితో బలమైన అనుబంధం ఉన్నవారికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకోఫోనీలో చేరే అంశాన్ని పరిశీలించాలని భారత్ ను  ఫ్రాన్స్ ప్రోత్సహించింది. ఫ్రాన్స్ ఆహ్వానాన్ని భారత్ స్వాగతించింది.

2.8  పారిస్‌లో 2024లో జరిగే ఒలింపిక్ మరియు పారాలింపిక్ క్రీడలకు ప్రధానమైన క్రీడ మరియు ఆరోగ్యకరమైన జీవన విలువలకు భారత్,  ఫ్రాన్స్ మద్దతిస్తున్నాయి.   ఈ దిశలో రెండు దేశాలు క్రీడా రంగంలో సహకారానికి సంబంధించిన ఉద్దేశ్య లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) పైన  సంతకాలు చేయడాన్ని స్వాగతించాయి.  ఇది భారతీయ అథ్లెట్లకు భవిష్యత్తులో జరిగే ప్రధాన క్రీడా పోటీల సన్నాహాల్లో,  వారి శిక్షణలో ఎంతగానో సహాయపడుతుంది

2.9 భారత్ , ఫ్రాన్స్  దేశాల ప్రజల (ప్రజల-ప్రజల) మధ్య సంబంధాలను పెంపొందించడానికి , ప్రధానంగా దౌత్య అవసరాలను తీర్చడానికి మరియు దక్షిణ ఫ్రాన్స్‌లో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతదేశం తన కాన్సులేట్ జనరల్‌ కార్యాలయాన్ని ఫ్రాన్స్‌లోని మార్సెల్ లో  ప్రారంభించనుంది.  అదేవిధంగా ఫ్రాన్స్ తమ దౌత్య కార్యాలయం "బ్యూరో డి ఫ్రాన్స్" ను   హైదరాబాద్‌లో ప్రారంభించింది.

           భారత్ -ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నత స్థితిని ఆశించి రూపొందించిన ఈ మార్గసూచీ (రోడ్ మ్యాప్)  ద్వారా కొత్త  వైవిధ్యభరిత సహకార రంగాలలోకి సాగుతుంది.  అదే సమయంలో ఉమ్మడి ప్రయోజనం కలిగించే  కార్యక్రమాలను మరింత వృద్ధిచేస్తుంది.


 

****



(Release ID: 1940665) Visitor Counter : 143