ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రెంచ్ వ్యోమగామి, పైలట్ , నటుడు థామస్ పెస్క్వెట్ తో ప్రధాన మంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
14 JUL 2023 10:06PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లో ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇంజనీర్, పైలట్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి , నటుడు శ్రీ థామస్ పెస్క్వెట్ తో సమావేశమయ్యారు.
అంతరిక్ష రంగంలో, ముఖ్యంగా స్టార్టప్ లను ప్రోత్సహించడంలో, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భారతదేశం సాధించిన పురోగతిని శ్రీ పెస్క్వెట్ కు ప్రధాన మంత్రి వివరించారు. యువతను ఉత్తేజ పరిచేందుకు, అంతరిక్ష రంగ సహకారాలను అన్వేషించడానికి భారతదేశాన్ని సందర్శించాలని శ్రీ పెస్క్వెట్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
వ్యోమగామిగా తన అనుభవాలను శ్రీ పెస్క్వెట్ ప్రధాన మంత్రితో పంచుకున్నారు. భవిష్యత్తులో అంతరిక్ష కార్యక్రమాలు, సాంకేతికతల స్వరూప స్వభావాలను చర్చించారు.
***
(रिलीज़ आईडी: 1939761)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam