ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్గణతంత్రం లోని పేరిస్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 JUL 2023 5:12PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేరిస్ కు 2023 జులై 13 వ తేదీ న మధ్యాహ్నం పూట చేరుకొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెథ్ బోర్న్ గారు విమానాశ్రయం లో ప్రత్యేకం గా స్వాగత వచనాలను పలికారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సంప్రదాయబద్ధ స్వాగతం తో పాటు గౌరవ వందనాన్ని కూడా సమర్పించడం జరిగింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బేస్టిల్ డే పరేడ్ లో గౌరవ అతిథి గా పాలుపంచుకోనున్నారు. ఈ సందర్శన లో భారతదేశం - ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు 25 వ వార్షికోత్సవ సమారోహం కూడా భాగం కానుంది.

 

 

 

**


(रिलीज़ आईडी: 1939488) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam