మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆఖ‌రు తేదీ 31 ఆగ‌స్టు 2023వ‌ర‌కు పొడిగింపు

Posted On: 10 JUL 2023 12:17PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ఆఖ‌రు తేదీని  31 జులై 2023 నుంచి 31 ఆగ‌స్టు 2023కు మ‌హిళా, శిశుసంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ పొడిగించింది.  
ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎంఆర్‌బిపి), 2024కు ద‌ర‌ఖాస్తులు నేష‌న‌ల్ అవార్డ్స్ పోర్ట‌ల్ (https://awards.gov.in)లో అందుబాటులో ఉంచి ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయ‌డం జ‌రుగుతోంది. అసాధార‌ణ స్థాయిలో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చి, జాతీయ స్థాయిలో గుర్తింపుకు అర్హ‌మైన బాల‌ల‌కు సాహ‌సం, క్రీడ‌లు, సామాజిక సేవ‌, శాస్త్ర‌& సాంకేతిక, ప‌ర్యావ‌ర‌ణం, క‌ళ‌లు & సంస్కృతి రంగాల‌లో ఈ అవార్డుల‌ను ఇస్తారు. 
భార‌త పౌర‌స‌త్వం క‌లిగి, దేశంలో నివ‌సిస్తూ, 18 ఏళ్ళ‌కు (ద‌ర‌ఖాస్తు/  నామినేష‌న్ అందుకున్న ఆఖ‌రు తేదీనాటికి) మించ‌ని బాల‌లు ఎవ‌రైనా ఈ అవార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.  ఈ అవార్డుకు అర్హ‌మైన బాలుడు/  బాలిక‌ను ఏ వ్య‌క్తి అయినా నామినేట్ చేయ‌వ‌చ్చు. ఈ ల‌క్ష్యంతో రూపొందించిన ఆన్‌లైన్ పోర్ట‌ల్ https://awards.gov.in ద్వారా మాత్ర‌మే పిఎంఆర్‌బిపి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. 

 

***



(Release ID: 1938589) Visitor Counter : 168