ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చార్టర్డ్‌ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా వారి సేవలకు ప్రధానమంత్రి ప్రశంసలు

प्रविष्टि तिथि: 01 JUL 2023 10:42AM by PIB Hyderabad

   చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం నేపథ్యంలో వారు దేశానికి అందిస్తున్న సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇవాళ చార్టర్డ్‌ అకౌంటెంట్ల దినోత్సవం #CharteredAccountantsDay సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. మన దేశానికి కీలకమైన ఆర్థిక వాస్తుశిల్పుల్లో ఒకరైన ఈ వృత్తి నిపుణులను మనం గౌరవిద్దాం. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో వారి విశ్లేషణాత్మక నైపుణ్యం, తిరుగులేని అంకితభావం కీలకం. వారి నైపుణ్యం సుసంపన్న, స్వయంసమృద్ధ భారతదేశ నిర్మాణంలో ఎంతగానో దోహదం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1936782) आगंतुक पटल : 208
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Nepali , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam