ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రికి ‘ఆర్డర్ ఆఫ్ నైల్’ పురస్కార ప్రదానం
प्रविष्टि तिथि:
25 JUN 2023 7:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ నైల్’ అందుకున్నారు. ఈ మేరకు కైరో నగరంలోని అరబ్ గణతంత్ర ఈజిప్ట్ అధ్యక్ష భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దేశాధ్యక్షుడు మాననీయ అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.
తనను ఈ పురస్కారంతో గౌరవించడంపై భారత ప్రజానీకం తరఫున అధ్యక్షుడు సిసికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ప్రధాని మోదీ ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు కావడం విశేషం.
*****
(रिलीज़ आईडी: 1935399)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam