హోం మంత్రిత్వ శాఖ

"అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ , అక్రమ రవాణా దినోత్సవం" సందర్భంగా కేంద్ర హోం,సహకార మంత్రి శ్రీ అమిత్ షా సందేశం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న కఠిన వైఖరి సత్ఫలితాలను ఇస్తోంది.. శ్రీ అమిత్ షా

వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించి "హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్" విధానంతో కార్యాచరణ ప్రణాళిక అమలు ... శ్రీ అమిత్ షా

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అన్ని సంస్థలు, ప్రజలకు "అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ , అక్రమ రవాణాదినోత్సవం" అభినందనలు తెలిపిన కేంద్ర హోంమంత్రి

భారతదేశంలో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అనుమతించం... భారతదేశం మీదుగా ఇతర దేశాలకు మాదకద్రవ్యాల రవాణాను అనుమతించం.. స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి

దేశంలో 2006-13 లో పట్టుబడిన రూ.768 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు. 2014-22 లో.22,000 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు.

అంతకుముందు కాలంతో పోల్చితే మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై 181% ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
మాదక ద్రవ్యాల రహిత భారతదేశం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది ..శ్రీ అమిత్ షా

స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను తిరిగి ఉపయోగించకుండా నిరోధించ

Posted On: 26 JUN 2023 11:55AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడానికి  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న కఠిన వైఖరి  సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి  శ్రీ అమిత్ షా అన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించి "హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్" విధానంతో కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ ఫలితాలు సాదిస్తున్నామని ఆయన వివరించారు.    

 జూన్ 26 వ తేదీని "మాదకద్రవ్యాల దుర్వినియోగం , అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం"గా పాటిస్తున్న సందర్భంగా విడుదల చేసిన సందేశంలో కేంద్ర హోంమంత్రి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న  అన్ని సంస్థలు, ప్రజలకు  అభినందనలు తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అఖిల భారత స్థాయిలో 'నాషా ముక్త్ పఖ్వాడా' ను నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

భారతదేశంలో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అనుమతించం అని స్పష్టం చేసిన  కేంద్ర హోం మంత్రి  భారతదేశం మీదుగా ఇతర దేశాలకు మాదకద్రవ్యాల రవాణాను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. మాదక ద్రవ్యాలను నిరోధించడానికి అమలు జరుగుతున్న కార్యక్రమంలో అన్ని జాతీయ సంస్థలు , ముఖ్యంగా "నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో" నిరంతరం కృషి చేస్తున్నాయి అని కేంద్ర హోం  శాఖ  తెలిపారు. కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2019లో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించింది. ప్రతి రాష్ట్రంలో పోలీసు విభాగంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్  ఏర్పాటుఅయ్యింది. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్  మొదటి జాతీయ సమావేశం 2023 ఏప్రిల్ లో ఢిల్లీలో జరిగింది.

మాదకద్రవ్యాల దుర్వినియోగం, దుష్ప్రభావాలపై  జాతీయ స్థాయి లో వివిధ సంస్థల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని  శ్రీ అమిత్ షా తెలిపారు. మాదక ద్రవ్యాల అణచివేతకు అమలు చేసిన కఠిన చర్యల వల్ల  2014-22 మధ్య కాలంలో 22,000 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని ఆయన తెలిపారు. 2006-13 లో పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ కేవలం రూ.768 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ   దాదాపు 30 రెట్లు పెరిగిందన్నారు.  గతంతో పోలిస్తే మాదక ద్రవ్యాల వ్యాపారులపై 181% ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం పట్ల మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.  స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు తిరిగి వినియోగంలోకి రాకుండా చేయడానికి 2022  జూన్ లోపట్టుబడ్డ మాదక ద్రవ్యాలను నాశనం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని శ్రీ అమిత్ షా తెలిపారు. కార్యక్రమం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న సుమారు 6 లక్షల కిలోల మాదకద్రవ్యాలు నాశనం అయ్యాయి. . 

మాదక ద్రవ్యాల సాగు ని నాశనం చేయడానికి , ప్రజల్లో అవగాహన కల్పించడానికి  అన్ని సంస్థలు, రాష్ట్రాల సమన్వయంతో కార్యక్రమాలు అమలు చేస్తున్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ "మాదకద్రవ్యాల రహిత భారతదేశం" కోసం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కార్యక్రమం విజయవంతం కాదు అని స్పష్టం చేసిన శ్రీ షా  దేశ ప్రజలందరూ తమను, తమ కుటుంబాన్ని మాదక ద్రవ్యాలకు  దూరంగా ఉండాలని  విజ్ఞప్తి చేశారు.  యువతను, సమాజాన్ని నాశనం మాదక ద్రవ్యాలు నాశనం చేస్తున్నాయని శ్రీ అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదిస్తున్న అక్రమ  ఆదాయం  దేశ భద్రతకు వ్యతిరేకంగా వినియోగం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అమలు జరుగుతున్న కార్యక్రమాల్లో  చురుగ్గా పాల్గొనాలని తమ  చుట్టూ జరుగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారం గురించి భద్రతా సంస్థలకు తెలియజేయాలని ఆయన  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

సమిష్టి కృషితో మాదక ద్రవ్యాల సమస్య పరిష్కారం అవుతుంది అని  శ్రీ అమిత్ షా అన్నారు.  సమిష్టి కృషితో రూపుమాపగలమని, 'మాదక ద్రవ్య  రహిత భారత్'లక్ష్యం సాధ్యం అవుతుందని  శ్రీ అమిత్ షా అన్నారు.  'మాదక ద్రవ్య  రహిత భారత్ నిర్మాణానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరిస్తున్న   ఎన్‌సిబి, ఇతర సంస్థలకు మంత్రి అభినందనలు  తెలిపారు.  విజయం సాధించే వరకు కృషి జరగాలని ఆయన కోరారు. 

***



(Release ID: 1935391) Visitor Counter : 199