ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుఎస్ లో ఆరోగ్య రంగానికి చెందిన అగ్రగామి నిపుణుల సమూహం తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 21 JUN 2023 9:06AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా లో ఆరోగ్య రంగాని కి చెందిన అగ్రగామి నిపుణుల సమూహం తో న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

ఆరోగ్య రంగాని కి సంబంధించిన వివిధ అంశాల ను గురించి ప్రధాన మంత్రి మరియు నిపుణులు చర్చించారు. వారి మధ్య జరిగిన చర్చ లలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కు ఉద్దేశించినటువంటి డిజిటల్ టెక్నాలజీస్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ పై అధిక శ్రద్ధ మరియు ఉత్తమమైనటువంటి ఆరోగ్య సంరక్షణ సంబంధి సన్నాహాలు సహా స్వాస్థ్య కార్య క్షేత్రం తో సంబంధం గల వివిధ అంశాలు చోటు చేసుకొన్నాయి.

సమావేశం లో భాగం పంచుకొన్న నిపుణు లో -

టెక్సాస్ లోని నేశనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ యొక్క సంస్థాపక అధిపతి డాక్టర్ శ్రీ పీటర్ హోటెజ్

టెక్సాస్ లో గల విరో వేక్స్ సిఇఒ డాక్టర్ శ్రీ సునీల్ ఎ. డేవిడ్


జనరల్ కేటలిస్ట్ కు సలహాదారు డాక్టర్ శ్రీ స్టీఫన్ క్లాస్కో

పెంసిల్వేనియా యూనివర్సిటీ కి చెందిన వ్హార్టన్ స్కూల్ లో హెల్థ్ కేయర్ మేనిజ్ మెంట్ యొక్క ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ లావ్ టన్ ఆర్. బర్న్ స్

వెరిలీ లైఫ్ సైన్సెజ్ యొక్క సంస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీ వివియన్ ఎస్. లీ - లు ఉన్నారు.


నోబెల్ పురస్కార గ్రహీత మరియు జాన్ హాప్ కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్థ్, ఇంకా జాన్ హాప్ కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో చికిత్సకుడు మరియు మోలెక్యూలర్ బాయోలాజిస్ట్ డాక్టర్ శ్రీ పీటర్ ఎగ్రే లు

 

***


(Release ID: 1934020) Visitor Counter : 129