ప్రధాన మంత్రి కార్యాలయం

విద్య మంత్రిత్వశాఖ యొక్క కార్యక్రమం అయినటువంటి జి20 జన్ భాగీదారి కార్యక్రమం లో ప్రజలు రికార్డుసంఖ్య లో పాలుపంచుకోవడా న్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 10 JUN 2023 7:53PM by PIB Hyderabad

విద్య మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం అయినటువంటి జి20 జన్ భాగీదారి కార్యక్రమం లో రికార్డు సంఖ్య లో ప్రజలు పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

 

భారతదేశం యొక్క జి20 అధ్యక్షత తాలూకు ప్రముఖ కేంద్ర బిందువు గానా అన్నట్లు, విద్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకం గా మిశ్రిత విద్య వ్యవస్థ ను దృష్టి లో పెట్టుకొని ‘‘ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యల సంబంధి జ్ఞ‌ానానికి పూచీపడే (ఎఫ్ఎల్ఎన్)’’ ఇతివృత్తాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే మరియు సమర్థించాలనే ఉద్దేశ్యం తో కార్యకలాపాల మరియు కార్యక్రమాల తాలూకు ఒక సిరీస్ ను నిర్వహిస్తున్నది.

ఈ కార్యక్రమం లో ఇంతవరకు 1.5 కోట్ల కు పైగా వ్యక్తులు ఉత్సాహపూర్వకం గా భాగం పంచుకొన్నారు. వారిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సముదాయం సభ్యులు కూడా ఉన్నారు.

 

విద్య మంత్రిత్వ శాఖ ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

’’ఈ రికార్డు భాగస్వామ్యాన్ని గమనించి రోమాంచితుడిని అయ్యాను. ఇది అన్ని వర్గాల ను కలుపుకొని పోవడం మరియు సతత భవిష్యత్తు ల పట్ల మన ఉమ్మడి దృష్టికోణాన్ని సుదృఢ పరుస్తుంది. దీనిలో పాలుపంచుకొన్న వారందరి కి మరియు భారతదేశం యొక్క జి-20 అధ్యక్షత ను బలపరచిన వారందరి కి ఇవే అభినందన లు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

*******

DS/ST



(Release ID: 1933645) Visitor Counter : 113