సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ లో జరిగిన అన్నెసీ అంతర్జాతీయ యానిమేషన్ ఫెస్టివల్ (ఏ ఐ ఏ ఎఫ్) లో భారతీయ సృజన ప్రదర్శన


భారత ప్రతినిధివర్గానికి సమాచార & ప్రసార శాఖ కార్యదర్శి ఆధిపత్యం వహించారు. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్

(ఏవిజిసి) రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను గురించి విశేష ప్రచారం కల్పించారు. ఇండియాలో అంతర్జాతీయ యానిమేషన్ ఫెస్టివల్ నిర్వహించే అవకాశాలను గురించి చర్చించారు.

Posted On: 14 JUN 2023 2:43PM by PIB Hyderabad


        ఇండియా ఈ ఏడాది మొదటిసారి అన్నెసీ అంతర్జాతీయ యానిమేషన్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నది.   భారత సమాచార & ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వచంద్ర  భారత ప్రతినిధి వర్గానికి అధిపతి.   యానిమేషన్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రతినిధివర్గంలో సభ్యులుగా ఉన్నారు.  భారత్ లో సృష్టిస్తున్న యానిమేషన్ మరియు వి ఎఫ్ ఎక్స్ విషయం ఉన్న వీడియోలను ప్రపంచ ప్రేక్షకుల కోసం అన్నేసి ఫెస్టివల్ లో ప్రదర్శించారు.  
       వి ఎఫ్ ఎక్స్ మరియు యానిమేషన్ విషయ ప్రాధాన్యం ఉన్న వీడియోల కోసం ప్రపంచం నులుమూలల నుంచి ఉత్పత్తి సంస్థలు ఇండియాకు వస్తున్నాయి.   వచ్చే సంవత్సరంలో ఇండియాలో  యానిమేషన్ వ్యాపారం రూ. 18000 కోట్లకు చేరగలదని అంచనా.  అందువల్ల అన్నేసి ఫెస్టివల్ లో ఇండియా పాల్గొనడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

   ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇండియాలో యానిమేషన్ ఉత్పత్తులు చేస్తున్న విదేశీ కంపెనీలకు ఇండియా ప్రోత్సాహకాలు ఇస్తోందని శ్రీ అపూర్వ చంద్ర అన్నారు.  దీని నుంచి ప్రయోజనం పొందాలని ఆయన కంపెనీలను కోరారు.  ఇండియాలో ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి తరువాత ప్రోత్సాహకాలు పరిశ్రమకు  ఇవ్వడానికి ఇండియా కట్టుబడి ఉందని అన్నారు.  

      ఫెస్టివల్ లో ఏ ఐ ఏ ఎఫ్ డైరెక్టర్ మైఖేల్ మారిన్ తో  శ్రీ చంద్ర చర్చించారు.  అన్నేసి లో ఇండియా ప్రాతినిధ్యం పెంచడం గురించి , యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్ ఏర్పాటుకు ఇండియా, ఫ్రాన్స్ మధ్య సహకారానికి గల అవకాశాలను గురించి చర్చించారు.   సరస్వతి యంత్రం ఇతివృత్తంగా రూపొందించిన పెవిలియన్ ను ఆయన ప్రారంభించారు.   బహుమతులు గెలుచుకున్న భారతీయ సృజనాత్మక కళాకారులతో  సంభాషించారు.

       యానిమేషన్ రంగంలో ప్రతిభ కనబరచిన యువ సృష్టికర్తలు అరవింద్ జీన, నికిత ప్రభుదేశాయ్ జీనా, ఉపమన్యు భట్టాచార్య, కల్ప సంఘవితో పాటు  పరిశ్రమలో సీనియర్లు సరస్వతి వాని బలగం, కిరీట్ ఖురానా,  బీరేన్ ఘోష్, అనిల్ వాన్వారి మరియు అన్నే దోషి తదితరులు  ఫెస్టివల్ లో పాల్గొన్నారు.  అంతేకాక శ్రీ చంద్ర ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు.  దేశంలో యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించడానికి, వ్యాపార సౌలభ్యం కోసం భారత  ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను గురించి వివరించారు.

***


(Release ID: 1932738) Visitor Counter : 138