ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన అమెరికా జాతీయ భద్రతసలహాదారు
ద్వైపాక్షిక సహకారం నెలకొన్న వివిధ రంగాల లో చోటు చేసుకొన్నపురోగతి ని గురించి ప్రధాన మంత్రి కి తెలిపిన ఎన్ఎస్ఎ శ్రీ సులివన్
ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన వేళ ఆయన కు స్వాగతం పలకాలని అధ్యక్షుడుశ్రీ బైడెన్ ఉవ్విళ్లూరుతున్నారని శ్రీ సులివన్ తెలియజేశారు
భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పెరుగుతూ, బలపడుతూ ఉండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
అమెరికా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో కలసి ఆకర్షణీయమైన సంభాషణ కై ఎదురు చూస్తున్నట్లు వెల్లడించిన ప్రధాన మంత్రి
Posted On:
13 JUN 2023 8:02PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అమెరికా జాతీయ భద్రత సలహాదారు శ్రీ జేక్ సలివన్ ఈ రోజు న సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక సహకారం నెలకొన్న వివిధ రంగాల లో చోటు చేసుకొన్న పురోగతి ని గురించి అమెరికా జాతీయ భద్రత సలహాదారు శ్రీ సులివన్ ప్రధాన మంత్రి దృ ష్టి కి తీసుకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ బైడెన్ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భం లో ఆయన కు స్వాగతం పలకడానికి ఉత్సాహం తో ఉన్నారని శ్రీ సులివన్ వెల్లడించారు.
భారతదేశానికి మరియు అమెరికా కు మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పెరుగుతూ ఉండడం తో పాటు బలపడుతూ ఉన్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు శ్రీ బైడెన్ ను కలుసుకొని పరస్పర హితం ముడిపడ్డ ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ అంశాల పైన ఉపయోగకరమైన పర్యటన తో పాటు చర్చ ల కోసం తాను ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1932229)
Visitor Counter : 160
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam