ప్రధాన మంత్రి కార్యాలయం
కొత్త టెక్నాలజీని వాడుకోవటంలో భారతీయులను మించినవారు లేరు: ప్రధాని
Posted On:
10 JUN 2023 4:07PM by PIB Hyderabad
ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కనిపెట్టటానికి, వినియోగంలో పెట్టటానికి ఉత్సాహం చూపటంలో భారతీయులని మించిన వారు లేరని ప్రధాని వ్యాఖ్యానించారు. ముందు ముందు కూడా ఈ ధోరణి కొనసాగటానికి ప్రభుత్వం తనవంతు సహకారం కొనసాగిస్తుందని ప్రకటించారు. డిజిటల్ చెల్లింపులలో దేశం దేశం వేస్తున్న ముందడుగును ప్రస్తావిస్తూ ఒక పౌరుడు చేసిన ట్వీట్ కు ప్రధాని ఇలా స్పందించారు:
"సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకొని వాడుకోవటం విషయానికొస్తే, భారతీయులు తిరుగులేని విజేతలు! కొత్త ఆవిష్కరణాల విషయంలోనూ, పరిజ్ఞానాన్ని వాడుకోవటంలోనూ ముందుంటామని నిరూపించారు. ఈ మార్పు దేశమంతటా స్పష్టంగా కనబడుతోంది. ఈ వేగాన్ని ముందు ముందు కూడా కొనసాగిద్దాం. “
(Release ID: 1931385)
Visitor Counter : 204
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada