ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

భారతదేశం యొక్కఅధ్యక్షత న ఎస్ సిఒ శిఖర సమ్మేళనం

Posted On: 30 MAY 2023 8:15PM by PIB Hyderabad

భారతదేశం 2022 వ సంవత్సరం సెప్టెంబర్ 16 వ తేదీ నాడు జరిగిన సమర్ కంద్ సమిట్ లో ఎస్ సిఒ యొక్క వంతులవారీ అధ్యక్ష పదవీ బాధ్యతల ను స్వీకరించింది. భారతదేశం యొక్క ప్రప్రథమ అధ్యక్షత న, ఎస్ సిఒ కౌన్సిల్ యొక్క దేశాధినేతల 23 వ శిఖర సమ్మేళనాన్ని 2023 వ సంవత్సరం లో జులై 4 వ తేదీ నాడు వర్చువల్ పద్ధతి లో నిర్వహించడం జరుగుతుంది, ఈ సమ్మేళనాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు.

ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవలసింది గా చైనా, రశ్యా, కజాఖ్ స్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తాజికిస్తాన్ మరియు ఉజ్ బెకిస్తాన్ ల వంటి ఎస్ సిఒ సభ్యత్వ దేశాలు అన్నిటిని ఆహ్వానించడం జరిగింది. దీనికి తోడు, ఇరాన్, బెలారూస్ మరియు మంగోలియా లను కూడాను పర్యవేక్షక దేశాల హోదా లో ఆహ్వానించడమైంది. ఎస్ సిఒ సంప్రదాయాల కు అనుగుణం గా తుర్క్ మెనిస్తాన్ ను సైతం అధ్యక్ష దేశం తరఫు న అతిథి గా పిలవడమైంది. ఎస్ సిఒ లోని సెక్రటేరియట్, ఇంకా ఎస్ సిఒ ఆర్ఎటిఎస్ లో ప్రముఖుల ను కూడా ను ఈ సమిట్ లో పాలుపంచుకొంటారు. దీని కి అదనం గా, యుఎన్, ఆసియాన్, సిఐఎస్, సిఎస్ టిఒ, ఇఎఇయు మరియు సిఐసిఎ ల వంటి ఆరు అంతర్జాతీయ సంస్థ లు మరియు ప్రాంతీయ సంస్థల కు చెందిన ప్రముఖుల ను కూడా ఆహ్వానించడం జరిగింది.
’ఒక సురక్షితమైనటువంటి ఎస్ సిఒ దిశ లో పయనంఅనేది ఈ శిఖర సమ్మేళనాని కి ఇతివృత్తం గా ఉంది. 2018 ఎస్ సిఒ శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి సిక్యోర్ (ఎస్ఇసియుఆర్ఇ) అనే సంక్షిప్త పదాన్ని ఉపయోగించారు. ఈ పదం లో ఒక్కొక్క అక్షరం.. ఎస్ సిక్యోరిటీ ని, ఇ ఇకానమి మరియు ట్రేడ్ ను, సి కనెక్టివిటీ ని, యు యూనిటీ ని, ఆర్ రిస్పెక్ట్ ఫార్ సావరినిటీ ఎండ్ టెరిటోరియల్ ఇన్ టిగ్రిటీ ని ఇ ఇన్ వైరన్ మంట్ ను సూచిస్తాయి. ఈ అంశాల ను ఎస్ సిఒ కు భారతదేశం అధ్యక్ష పదవీ కాలం లో ప్రముఖం గా చాటి చెప్పడమైంది.
భారతదేశం తన అధ్యక్షత న సహకారం తాలూకు కొత్త స్తంభాల ను నెలకొల్పింది - ఆ స్తంభాల లో స్టార్ట్-అప్ మరియు నూతన ఆవిష్కరణ లు, సాంప్రదాయిక వైద్యం, డిజిటల్ ఇన్ క్లూజన్, యువత సశక్తీకరణ మరియు బౌద్ధ వారసత్వాన్ని వ్యాప్తి చేయడం భాగం గా ఉన్నాయి. దీని కి అదనం గా, భారతదేశం ఇతర సభ్యత్వ దేశాల మధ్య చారిత్రిక బంధాల ను, నాగరకత పరమైన బంధాల ను ప్రోత్సహించేటందుకు గాను దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల ను ఇతోధికం గా పెంపు చేయడాని కి శ్రమించింది. ఈ కార్యక్రమాల లో 2022-23 లో వారాణసీ లో నిర్వహించినటువంటి మొట్టమొదటి ఎస్ సిఒ సాంస్కృతిక మరియు పర్యటక రాజధాని సమ్మేళనం లో వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల ను జరుపుకోవడమైంది.
ఎస్ సిఒ కు భారతదేశం యొక్క అధ్యక్షత ను వహించే కాలం లో సభ్యత్వ దేశాల మధ్య పరస్పరం ప్రయోజన కరమైనటువంటి సహకార పూర్వక కార్యక్రమాల ను విరివి గా చేపట్టడం జరిగింది. భారతదేశం మొత్తం మీద 134 కార్యక్రమాల ను మరియు సమావేశాల కు ఆతిథేయి గా ఉండింది. వాటి లో 14 మంత్రిత్వ స్థాయి సమావేశాలు కూడా కలిసి ఉన్నాయి. ఎస్ సిఒ లో ఒక సకారాత్మకమైనటువంటి మరియు ఫలప్రదమైనటువంటి పాత్ర ను పోషించడాని కి భారతదేశం కట్టుబడి ఉంది. దీనికి అదనం గా, భారతదేశం తన అధ్యక్షత యొక్క పరిణతి ని ఒక సఫలమైన ఎస్ సిఒ శిఖర సమ్మేళనాన్ని నిర్వహించి చాటుకోవాలని ఆశ పడుతున్నది.

 

***

 



(Release ID: 1930799) Visitor Counter : 149