ప్రధాన మంత్రి కార్యాలయం
కంబోడియా రాజు శ్రీ నొరొడొమ్ సిహామోని తో సమావేశమైన ప్రధాన మంత్రి
సంస్కృతిపరం గా సన్నిహిత సంబంధాలు మరియు అభివృద్ధి కోసం భాగస్వామ్యం అంశాల పై ఉభయులు వారి వారిఆలోచనల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు
జి20 కిభారతదేశం అధ్యక్షత వహిస్తుండడాన్ని ప్రశంసించి, తన శుభాకాంక్షల ను తెలిపినకంబోడియా రాజు గారు
Posted On:
30 MAY 2023 8:32PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లో కంబోడియా రాజు శ్రీ నొరొడొమ్ సిహామోని తో సమావేశమయ్యారు. కంబోడియా రాజు గారు 2023 వ సంవత్సరం లో మే నెల 29 వ తేదీ మొదలుకొని 31 వ తేదీ మధ్య కాం లో భారతదేశానికి తన తొలి రాజకీయ యాత్ర నిమిత్తం విచ్చేశారు.
ఇరు దేశాల మధ్య గాఢమైన నాగరకత సంబంధాలు, బలమైన సాంస్కృతిక సంబంధాలు మరియు ప్రజల మధ్య గల సంబంధాల విషయమై ప్రధాన మంత్రి మరియు కంబోడియా రాజు శ్రీ నొరొడొమ్ సిహామోని లు చర్చించారు.
సామర్థ్య నిర్మాణం సహా వివిధ రంగాల లో కంబోడియా తో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలపరచుకోవాలని భారతదేశం సంకల్పించుకొందంటూ శ్రీ సిహామోని కి ప్రధాన మంత్రి బరోసా ను ఇచ్చారు. అభివృద్ధి పరమైన సహకారం విషయం లో భారతదేశం అమలుపరుస్తున్నటువంటి కార్యక్రమాల కు గాను కంబోడియా రాజు గారు ప్రధాన మంత్రి కి ధన్యవాదాల ను తెలియజేశారు. అంతేకాకుండా జ20 లోభారతదేశం అధ్యక్షత వహిస్తున్నందుకు గాను రాజుగారు తన తరఫున ప్రశంస ను వ్యక్తపరుస్తూ మరి శుభాకాంక్షల ను కూడా తెలియజేశారు.
***
(Release ID: 1928950)
Visitor Counter : 172
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam