సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గడచిన 9 సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరించిన విధానాలు ,పౌరుల విశ్వాసం పెరగడానికి, సమ్మిళత వృద్ధికి ఎలా దోహదపడ్డాయన్న అంశంపై చర్చించిన జాతీయ సమ్మేళనం.

Posted On: 27 MAY 2023 5:44PM by PIB Hyderabad

గడచిన తొమ్మిది సంవత్సరాలలో ప్రభుత్వం అనుసరించిన విధానాలు, చేపట్టిన కార్యక్రమాలు ప్రజలలో విశ్వాసం పెంపొందించడానికి, సమ్మిళిత వృద్ధికి ఏవిధంగా దోహదపడ్డాయన్న అంశంపై చర్చించేందుకు,
సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు జన్ జన్ కా విశ్వాస్ పేరుతో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సమావేశమై చర్చించారు. ఇందుకు సంంబంధించి ‘9 సంవత్సరాల సేవ, సుహాసన్, గరీబ్ కల్యాన్ :జాతీయ సదస్సు’పేరుతో చర్చ జరిగింది. ఇందులో బాక్సర్ నిఖత్ జరీన్,
నటుడు నవాజుద్దిన్ సిద్దికి, భారతదేశానికి యునిసెఫ్ ప్రతినిధులు సింథియా మెకాఫ్రె, , నర్సు, పద్మశ్రీ అవార్డు గ్రహీత,శాంతి థెరిసా లక్రా, పర్యావరణ వేత్త అనిల్ ప్రకాశ్ జోషి, సీకో సహ వ్యవస్థాపకురాలు దివ్యా జైన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ రిచా అనిరుధ్ ఈ కార్యక్రమానికి మోడరేటర్గా వ్యవహరించారు.

ప్రపంచవేదికపై భారతీయ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించిన కార్యక్రమం ఖేలో ఇండియా : నిఖత్ జరీన్
భారత ప్రభుత్వం ప్రారంభించిన ఫ్లాగ్షిప్ పథకం ఖేలో ఇండియా , భారత క్రీడాకారుల ప్రతిభకు రెక్కలు తొడిగిందని, ఇది ఎంతో మంది యువ క్రీడాకారులు, ప్రతిభ గల క్రీడాకారులు తమ ప్రతిభను జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందకు వీలు కల్పించిందని
భారత బాక్సర్, రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా గెలిచిన నిఖత్ జరీన్ అన్నారు. అలాగే బేటి బచావ్, బేటీ పఢావో సమాజంలో తీసుకువచ్చిన పరివర్తనాత్మక మార్పు గురించి కూడా ఆమె ప్రస్తావించారు.
ఇది బాలికలకు , తన లాంటి వారికి సాధికారత కల్పిస్తోందని చెప్పారు.  
 బాలికల పట్ల  దృక్ఫథంలో మార్పు వచ్చింది,  ఇందుకు బేటీ బచావో బేటీ పఢావో కారణం : నవాజుద్దిన్ సిద్దిఖి.
ప్రముఖ నటుడు నవాజుద్దిన్ సిద్దిఖి మాట్లాడుతూ , గత కొన్ని సంవత్సరాలుగా పరివర్తన మరింత సులభతరమైందని అన్నారు. ఏ యువతీ యువకుడైనా  , దేనినైనా సాధించదలచుకుంటే అతని కలను సాకారం చేసుకునేందుకు గట్టి మద్దతు లభిస్తున్నదని,
ఇందుకు మద్దతు నిచ్చే వ్యవస్థలు ఉన్నాయని ఆయన అన్నారు. బేటి బచావో బేటీ పఢావో గురించి మాట్లాడుతూ ఆయన, బాలికల  విషయంలో దృక్పథంలోను, ఆలోచనలలోనూ సమాజంలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు.
ఇది తల్లిదండ్రులు వారిని చూస్తున్న తీరులోనూ, వారు సాధిస్తున్న విజయాలలోనూ ప్రతిఫలిస్తోందని ఆయన అన్నారు. ఎంతో కాలం అణిచివేతకు గురైన మహిళలు, ఆత్మవిశ్వాసంతో  ముందుకు వస్తున్నారని,  సమాజం దీనిని స్వాగతిస్తున్నదని అన్నారు.
‘‘అంతర్జాతీయ వేదికపై భారత్ను ప్రముఖ స్థానంలో నిలబెట్టడంలో ప్రభుత్వం అద్భుత కృషి చేసింది’: దివ్యా జైన్
సీఖో సహవ్యవస్థాపకురాలు , దివ్యా జైన్ ఈ సదస్సులో మాట్లాడుతూ, మహిళా కేంద్రిత అభివృద్ధి గొప్ప మార్పు తీసుకువచ్చిందని అన్నారు. గత 9 సంవత్సరాలలో 7 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక బృందాలలో
చేరారని ఆమె గుర్తుచేశారు.  మహిళలు పురోభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వ పథకాలు రూపుదిద్దుకున్నాయని ఆమె చెప్పారు.  గతంలో మహిళలు ముందుకు రావడానికి అంతగా ఆసక్తి ప్రదర్శించే వారు కారు. కానీ ఇప్పుడు
మహిళలు ముందుకు వస్తున్నారు. దానితో మొత్తం సమాజమే ముందుకు నడుస్తున్నది.దీనితో మొత్తం సమాజంలోనే మార్పు వస్తున్నది అని దివ్యాజైన్ అన్నారు. ఈ మార్పు గ్రామాలలో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని ఆమె అన్నారు.
ఒక స్టార్టప్ ఎంటర్ప్రెన్యుయర్గా మాట్లాడుతున్నానని అంటూ ఆమె, గత సంవత్సరం భారతదేశం పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పారు. ఇవాళ,  ప్రపంచ వేదికపై ఇండియా అవసరం ఎంతో ఉన్నదని ఆమె చెప్పారు.
 ఇందుకు ప్రభుత్వం అద్భుత కృషి చేసిందని ఆమె తెలిపారు.  మన ఎంటర్ప్రెన్యుయర్లు, మన యువత కృషిని గుర్తించాల్సిన అవసరాన్ని తెలియజెప్పామన్నారు. భవిష్యత్తును నిర్ణయించేది మనమేనని కూడా ఆమె స్పష్టం చేశారు.
‘మారుమూల  ప్రాంతాల ప్రజలకూ సాధికారత కల్పించిన ఆయుష్మాన్ భారత్’
అండమాన్ నికోబార్ దీవులకు చెందిన,  పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆరోగ్య రంగానికి చెందిన, వైద్య సేవలు అందిస్తున్న నర్సు శాంతి థెరిసా లక్రా ఈ సమావేశంలో మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ కింద ఏర్పాటు చేసిన వెల్నెస్ కేంద్రాలు,
ప్రజలకు సాధికారత కల్పించడంలో చెప్పుకోదగిన ముందడుగుగా ఆమె తెలిపారు. ఈ పథకం కింద అందిస్తున్న ఆర్ధిక సహాయం ప్రత్యేకించి షెడ్యూలు తెగల వారికి, మారుమూల , లోతట్టు ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి
ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు.  మామూలుగా మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం కష్టమైన పని అని అయితే డిజిటల్ ఇండియా ద్వారా, ఇతర ఔట్ రీచ్ సేవల ద్వారా మారుమూల ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు
చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.  ఆస్పత్రులలో ప్రసవాలు పెరగడం ఇందుకు నిదర్శనంగా ఆమె తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులలో సముద్రంపై బ్రిడ్జి నిర్మించడం వల్ల రోడ్ అనుసంధానత పెరిగిందని కూడా ఆమె తెలిపారు.

“గ్రామాల ప్రగతిపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి. ముందుకు దూసుకువెళుతున్న భారత్’’
పర్యావరణవేత్త అనిల్ ప్రకాష్ జోషి మాట్లాడుతూ, దేశం ఇవాల సమ్మిళిత, పర్యావరణ స్పృహ కలిగిన సంపద సృష్టి గురించి దేశం ఆలోచిస్తున్నదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ఇందులో చేర్చడం ప్రారంభించిందని, అలాగే పర్యావరణ పరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా దేశాన్ని అభివృద్ధిచెందిన  ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దేందుకు కృషి జరుగుతోందన్నారు.
వాన నీటిని ఒడిసిపట్టుకునే క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం, భూ సార పరీక్షల వంటి కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పాలన మెరుగైన పాలనకు వీలుంటుందని,, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.
భారతదేశం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నదని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు పురోభివృద్ధి సాధిస్తున్నాయన్నారు.

‘మన యువ , చైతన్యవంతమైన ఎంటర్ప్రెన్యుయర్లు వృద్ధిలోకి రావడానికి దోహదపడిన స్టార్టప్ ఇండియా’
 బయోకాన్ లిమిటెడ్, బయోకాన్ బయాలజిక్స్ లిమిటెడ్ ఎక్సిక్యుటివ్ ఛైర్పర్సన్ , సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ,  ప్రభుత్వం ఎన్నో వీడియో సందేశాలు,
 ఎన్నో పరివర్తనాత్మక చర్యల వల్ల  ప్రజల జీవితాలలో సానుకూల మార్పు సంభవించిందని చెప్పార. ఆరోగ్య సేతు, కోవిన్ యాప్లు సాంకేతికంగా అద్భుతాలని ఆమె అన్నారు. ఇవి కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఉపకరించాయన్నారు.
దీనితో డిజిటల్ ప్లాట్ఫారం ను ఉపయోగించి పెద్ద ఎత్తున వాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టడానికి వీలైందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ గురించి ప్రస్తావిస్తూ, జన ఔషధీ కేంద్రాలుఎంతో మంది ప్రజలకు  ప్రాణావసర మందులను అందుబాటులోకి తెచ్చాయన్నారు.
మన దేశంలో ఎంతో మంది యువ, డైనమిక్ ఎంటర్ప్రెన్యుయర్లు ఉన్నారని,  ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఇండియా ద్వారా వారికి అందిన మద్దతు కు కృతజ్ఞతలని ఆమె తెలిపారు.
‘సమగ్ర విద్యకు సహాయపడుతున్న నూతన విద్యా విధానం ’
ఇండియాలో యూనిసెఫ్ ప్రతినిధి, సింథియా మెక్ కాఫ్రె మాట్లాడుతూ, భారత ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్స్ సర్వే నిర్వహించిందని, దీనివల్ల బాలలు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారన్నది తెలుసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు.
దీని ఆధారంగా ప్రభుత్వం ఆయా విద్యార్ధులను వ్యక్తిగతంగా మెరుగుపరిచేందుకు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దీనిని బట్టి ఇండియా పునాది విద్యపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నదన్నారు.
తద్వారా పిల్లలు పాఠశాలలో సురక్షిత వాతావరణంలో ఉండగలుగుతారన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటివి అన్నీ బాలల జీవితంలో అంతర్భాగమని  ఇవన్నీ మెరుగైన విద్యకు దోహదపడతాయన్నారు.
పారిశుధ్యం, పౌష్టికాహార ప్రాధాన్యతతో పలు కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయన్నారు. వినూత్న వైఖరితో  ప్రభుత్వం పునాది విద్యపై దృష్టి కేంద్రీకరించిందని వారు తెలిపారు. పలు రకాలుగా బాలలో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని,
ఆ రకంగా 21 శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా వారు నైపుణ్యాలు సంతరించుకోవడానికి వీలుపడుతుందని చెప్పారు. పారిశుధ్యం, పౌష్టికాహార కార్యక్రమాలు బాలలు ఆరోగ్యకరంగా వృద్ధిలోకి రావడానికి ఉపకరిస్తాయన్నారు.
జాతీయ విద్యా విధానంలో  పునాది విద్యకు , వృత్తి విద్యకు, ఎంటర్ ప్రెన్యుయర్ అభ్యసనానికి ప్రాధాన్యతనిచ్చారని, ఇది బాలల సాధికారతకు దోహదపడుతుందని, సమగ్ర విద్యకు వీలు కల్పిస్తుందని ఆమె తెలిపారు.

***


(Release ID: 1927818) Visitor Counter : 207