ప్రధాన మంత్రి కార్యాలయం

సెందాయీ ఫ్రేమ్ వర్క్ ఫార్  డిజాస్టర్ రిస్క్  రిడక్శన్  మధ్యకాలిక సమీక్ష సందర్భం లో జరిగిన భారతదేశం-జాపాన్ సైడ్ ఈవెంట్


వైపరీత్యాల వేళ లో సంభవించ గల నష్ట భయం  తగ్గింపున కు సంబంధించిన అన్ని అంశాల ను ఒక సంతులితమైనపద్ధతి లో పరిష్కరించడం కోసం ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ ను రూపొందించవలసిన అవసరంఉంది: డాక్టర్ శ్రీ పి.కె. మిశ్రా

Posted On: 18 MAY 2023 11:30PM by PIB Hyderabad

సెందాయీ ఫ్రేమ్ వర్క్ ఫార్ డిజాస్టర్ రిస్క్ రిడక్శన్ (ఎస్ఎఫ్ డిఆర్ఆర్) 2015-2030 యొక్క మధ్యకాలిక సమీక్ష తాలూకు ఉన్నత స్థాయి సమావేశాన్ని పురస్కరించుకొని భారతదేశం యొక్క నేశనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథారిటి (ఎన్ డిఎమ్ఎ) మరియు జాపాన్ ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఏజెన్సీ (జెఐసిఎ) లు ఈ రోజు న ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రం లో ఒక రిస్క్ రిడక్శన్ హబ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశాయి. ఆటు పోటు లకు తట్టుకొని నిలబడ గలిగేటటువంటి మరియు నిలకడతనం కలిగినటువంటి భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని వైపరీత్యాల వేళల్లో సంభవించగల నష్ట భయం తగ్గింపు లక్ష్యం తో పెట్టుబడుల ను ప్రోత్సహించడం కోసం సభ్యత్వ దేశాలు పోషించవలసిన భూమికల ను గురించి చర్చించాలిఅన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఎస్ డిజి స్ సాధన కోసం మరియు నష్టాల ను కనీస స్థాయి కి పరిమితం చేయడం కోసం, జలవాయు పరివర్తన తో ముడిపడిన ప్రభావాల ను న్యూనీకరించడం కోసం, తద్ద్వారా ఏ విధమైనటువంటి ప్రతికూల స్థితుల ను అయినా తట్టుకొని నిలబడేటటువంటి ఒక సమాజాన్ని ఆవిష్కరించడం కోసం వైపరీత్యాల వేళ సంభవించగల నష్ట భయం తగ్గింపు సంబంధి ప్రక్రియల లో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రోత్సహించడం లో సభ్యత్వ దేశాల కు కీలకమైన భూమిక ఉందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. ఆటు పోటు లకు తట్టుకొని నిలచేటటువంటి మరియు స్థిర ప్రాతిపదిక కలిగినటువంటి సమాజాన్ని నిర్మించే దిశ లో ఇప్పటికే పొంచి ఉన్న నష్ట భయాల ను తగ్గించుకొనే మరియు రాబోయే కాలం లో ఎదురు కాగల నష్ట భయాల ను నివారించడం ప్రతి ఒక్క సభ్యత్వ దేశం బాధ్యత అంటూ ఈ కార్యక్రమం పిలుపు ను ఇచ్చింది.

 

 

 

 

ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి అయినటువంటి డాక్టర్ శ్రీ పి.కె. మిశ్రా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న భారతదేశం ప్రతినిధి వర్గాని కి నాయకత్వాన్ని వహిస్తారు. డాక్టర్ శ్రీ మిశ్రా తన ప్రసంగం లో డిజాస్టర్ రిస్క్ రిడక్శన్ అంశాని కి గ్లోబల్ పాలిసీ చర్చ లో యథోచిత ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోందని, దీనికి కారణం జి-20 మరియు జి-7 లు రెండూ కూడాను ఈ అంశాని కి ప్రాధాన్యాన్ని కట్టబెట్టాయని పేర్కొన్నారు. వైపరీత్యాల వేళ వాటిల్ల గల నష్ట భయాన్ని తగ్గించడాని కి సంబంధించిన అన్ని సవాళ్ళ ను పరిష్కరించ గలిగేటటువంటి ఒక ఆర్థిక పరమైన వ్యవస్థ ను రూపొందించవలసిన అవసరం సైతం ఉందని డాక్టర్ శ్రీ మిశ్రా నొక్కి పలికారు. అయితే, ఈ అంశం లో ఒక సంతులితమైనటువంటి మార్గాన్ని అనుసరించాలని, విపత్తులు ముంచుకు వచ్చే కాలాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లను బలపరచడం లో సదరు సభ్యత్వ దేశం యొక్క భూమిక ను నిర్ధిష్టం గా నిర్దేశించుకోవాలని ఆయన అన్నారు. ఈ దిశ లో మరిన్ని అంశాల ను చర్చించడాని కి జి-20 వర్కింగ్ గ్రూపు వచ్చే వారం లో రెండో సారి సమావేశం అవుతుంది.

 

 

జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న కాలం లో, మరి ఎస్ఎఫ్ డిఆర్ఆర్ కు అనుగుణం గా డిఆర్ఆర్ పై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపు (డిఆర్ఆర్ డబ్ల్యుజి) అయిదు ప్రాధాన్య అంశాల ను గురించి ప్రతిపాదించూన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం సముచితం గా ఉంటుంది. ఆ అంశాల లో జలం- వాతావరణం సంబంధి వైపరీత్యాలు అన్నింటి విషయం లోను ఒక ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ల పరం గా గ్లోబల్ కవరేజి, వైపరీత్యాలు మరియు జలవాయు సంబంధి సవాళ్ళ కు తట్టుకొని నిలబడగలిగేటట్లుగా మౌలిక సదుపాయాల సంబంధి వ్యవస్థల ను దిద్ది తీర్చడం కోసం ఇతోధికమైనటువంటి కట్టుబాటు; వైపరీత్యాల వేళ సంభవించగల నష్ట భయం తగ్గింపు ను దృష్టి లో పెట్టుకొని జాతీయ స్థాయి లో పటిష్టమైనటువంటి ఒక ఫైనాన్శియల్ ఫ్రేమ్ వర్క్ ను కలిగివుండడం; ‘‘బిల్డ్ బ్యాక్ బెటర్’’ సహా జాతీయ మరియు ప్రపంచ స్థాయి వైపరీత్య సంబంధి ప్రతిస్పందన వ్యవస్థ లను పటిష్ట పరచడం; ఇకోసిస్టమ్ ను ఆధారం గా చేసుకొని అనుసరించవలసిన విధానాల ను వీలైనంత ఎక్కువ గా అమలు పరచడం వంటివి భాగం గా ఉన్నాయి. చర్చలు జి-7, జి-20 సహా గ్లోబల్ సౌథ్ లో ప్రాతినిధ్యం ఉన్న నేత లు వైపరీత్యాల నష్టభయాన్ని తగ్గించడం (డిజాస్టర్ రిస్క్ రిడక్శన్-డిడిఆర్) కోసం అత్యవసర ప్రాతిపదికన కార్యాచరణ కు నడుం బిగించవలసిన అవసరాన్ని గుర్తెరగాల్సి ఉందని స్పష్టం చేశాయి.

 

 

 

సభ్యత్వ దేశాలు అపాయాలు మరియు నష్టభయాల కు సంబంధించినటువంటి సమాచారాన్ని వీలైనంత అధికం గా వెల్లడి చేసుకోవడం తో పాటే బహుళ దేశీయ సహకారాన్ని మొదలు పెట్టుకోవడం ఎంతైనా ముఖ్యమని స్పష్టం చేశాయి. ఇందులో డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్ ను వృద్ధి చెందింప చేసుకోవడానికి గాను డిఆర్ఆర్ కై తగినంత బడ్జెటు కేటాయింపు లో మార్గదర్శకత్వం వహించడం లో వాటి యొక్క సంబంధిత భూమిక లు కూడా కలసివున్నాయి. ఇంకా, వైపరీత్యం సంభవించిన తదుపరి ఉత్తమమైన రీతి లో పునర్ నిర్మాణం కోసం (బిల్డ్ బ్యాక్ బెటర్) నడుం కట్టడం లో సైతం సాయం అందగలదు.

 

 

2023 వ సంవత్సరం లో భారతదేశం అధ్యక్షత న జి-20 ఎస్ఎఫ్ డిఆర్ఆర్ తోపాటు ఎస్ డిజి స్ యొక్క లక్ష్యాల ను సాధించడం లో తోడ్పడడానికి శెర్ పా ట్రాక్ లో భాగం గా వైపరీత్యాల వేళ ఎదురయ్యే నష్టభయాల న్యూనీకరణ అంశం పై పనిచేసేటటువంటి ఒక వర్కింగ్ గ్రూప్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్శన్ ను ఏర్పాటు చేయాలి అనేదే. యునైటెడ్ నేశన్స్ ఆఫీస్ ఫార్ డిజాస్టర్ రిస్క్ రిడక్శన్ (యుఎన్ డిఆర్ఆర్) సహకారం తో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో ఐక్యరాజ్య సమితి లో భారతదేశం శాశ్వత ప్రతినిధి, రాజ ప్రతినిధి రుచిరా కంబోజ్ గారు మరియు భారతదేశ ప్రతినిధి వర్గానికి చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

***



(Release ID: 1925544) Visitor Counter : 139