ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ 100 భాగాల ప్రసారంపై దివ్యాంగ మహిళ చిత్రించిన కళాఖండాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
05 MAY 2023 11:40AM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని అజ్మీర్ నగర వాస్తవ్యురాలైన దివ్యాంగ మహిళ ‘మన్ కీ బాత్’ 100 భాగాల ప్రసారంపై చిత్రించిన కళాఖండాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“హృదయాన్ని రంజింపజేసే అద్భుత చిత్రమిది. అజ్మీర్ గడ్డపై జన్మించిన ప్రియ పుత్రిక నందిని ఈ రూపంలో పంపిన అభినందన సందేశం చూసి నేనెంతో పులకించిపోయాను. నా తరఫున ఆమెకు అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1922259)
Visitor Counter : 184
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam