సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
100 కోట్ల మంది ప్రజలు విన్న కార్యక్రమం ' మన్ కీ బాత్' కార్యక్రమం
100 వ ' మన్ కీ బాత్' కార్యక్రమం ప్రసారానికి ముందు ఐఐఎం నిర్వహించిన సర్వేలో వెల్లడి
క్రమం తప్పకుండా 23 కోట్ల మంది ప్రజలు మన్ కీ బాత్' కార్యక్రమం విన్నారని, జనాభాలో 96% మందికి మన్ కీ బాత్' కార్యక్రమం గురించి తెలుసు.. వెల్లడించిన సర్వే
శక్తివంతమైన , నిర్ణయాత్మక నాయకత్వం, ప్రేక్షకులతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండటంతో కార్యక్రమం ప్రజాదరణ పొందింది. సర్వే
మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల ప్రవర్తనను ప్రభావితం చేసే విధంగా ఉంది
60% మంది దేశ నిర్మాణంపై ఆసక్తి కనబరిచారు
73% మంది దేశం సరైన దిశలో వెళుతున్నట్లు భావిస్తున్నారు .. సర్వే నివేదిక వెల్లడి
Posted On:
24 APR 2023 6:52PM by PIB Hyderabad
దేశ జనాభాలో 96 % మంది ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి నెలా ' మన్ కీ బాత్' కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలుసు.100 కోట్ల మంది ప్రజలు ' మన్ కీ బాత్' కార్యక్రమాన్ని కనీసం ఒక్కసారి అయినా విన్నారు. ప్రసార భారతి కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, రోహ్‌తక్ నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. ప్రసార భారతి సీఈవో శ్రీ గౌరవ్ ద్వివేది, ఐఐఎం రోహ్‌తక్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ పి.శర్మ విలేకరుల సమావేశంలో ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించారు.కారక్రమాన్ని 23 కోట్ల మంది ప్రజలు క్రమం తప్పకుండా వింటున్నారని , మరో 41 కోట్ల మంది అప్పుడప్పుడు వింటున్నారని శ్రీ శర్మ వెల్లడించారు. ఈ 41 కోట్ల మంది క్రమం తప్పకుండా వైన్ శ్రోతలు గా మారే అవకాశం ఉందని చెప్పారు.
' మన్ కీ బాత్' రేడియో ప్రసారానికి జనాదరణ పొందడానికి సహకరించిన పరిస్థితులపై సర్వే నిర్వహించారు. ' మన్ కీ బాత్' కార్యక్రమం పట్ల ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు అన్న అంశాన్ని సర్వే ప్రస్తావించింది. ప్రేక్షకులతో భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవడం, శక్తివంతమైన నిర్ణయాత్మక నాయకత్వం వల్ల కార్యక్రమం విజయవంతం అయ్యింది అని సర్వే పేర్కొంది.కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధానమంత్రి ని సర్వేలో పాల్గొన్న ప్రజలు విజ్ఞానం, సానుభూతి మనస్తత్వం,ఏదైనా అంశాన్ని స్పష్టంగా చెప్పే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా గుర్తించారు. ప్రజలతో నేరుగా మమేకం అవుతూ అవసరమైన మార్గదర్శకత్వం ఇస్తున్న వ్యక్తి నిర్వహించడం 'మన్ కీ బాత్' విజయానికి మరో కారణమని ప్రజలు పేర్కొన్నారు.
99 సార్లు ప్రసారం అయిన ' మన్ కీ బాత్' కార్యక్రమం ప్రజలపై చూపిన ప్రభావాన్ని కూడా సర్వే అంచనా వేసింది. కార్యక్రమం విన్న వారిలో మెజారిటీ శ్రోతలు ప్రభుత్వ పనితీరు పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఆశాజనకంగా ఉన్న 73% మంది దేశం పురోగమనంలో ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 58% మంది శ్రోతలు తమ జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సంఖ్యలో (59%) ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందన్నారు. 63% మంది ప్రజలు ప్రభుత్వం పట్ల తమ వైఖరి సానుకూలంగా మారిందని వెల్లడించారు. 60% మంది దేశ నిర్మాణం కోసం పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని సర్వేలో పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనా దృక్పథం మారిందని సర్వే ద్వారా అంచనా వేయవచ్చు.
శ్రోతలను మూడు తరగతులుగా విభజించి సర్వే నిర్వహించారు. 44.7% మంది శ్రోతలు టీవీలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. 37.6% మంది మొబైల్ పరికరంలో కార్యక్రమాన్ని చూస్తున్నారు. 19 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు 62% మంది టీవీలో కార్యక్రమాన్ని చూసేందుకు ఇష్టపడుతున్నారు.
హిందీ భాషలో ప్రసారం అవుతున్న' మన్ కీ బాత్' కార్యక్రమం ప్రజల ఆదరణ ఎక్కువగా పొందింది. హిందీలో కార్యక్రమాన్ని చూడడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. హిందీ తర్వాత ఇంగ్లీష్ లో ప్రసారం అవుతున్న ' మన్ కీ బాత్' కార్యక్రమం 2వ స్థానంలో నిలిచింది.
సర్వే నిర్వహించడానికి 10003 మందిని ఎంపిక చేసి అభిప్రాయాలూ సేకరించామని డైరెక్టర్ శ్రీ ధీరజ్ శర్మ తెలియజేసారు, ఇందులో 60% మంది పురుషులు మరియు 40% మంది మహిళలు ఉన్నారు. 68 వృత్తులకు చెందినవారు సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 64% మంది అనధికారిక , స్వయం ఉపాధి రంగానికి చెందిన వారు. సర్వేలో పాల్గొన్న వారిలో 23% విద్యార్థులు పాల్గొన్నారు.
సైకోమెట్రిక్‌గా ప్యూరిఫైడ్ సర్వే ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా ఒక్కో జోన్‌కు సుమారు 2500 స్పందనలతో భారతదేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల సమాచారం సేకరించామని శ్రీ శర్మ తెలిపారు.
మన్ కీ బాత్ 22 భారతీయ భాషలు , 29 మాండలికాలతో పాటు, ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి మరియు స్వాహిలి వంటి 11 విదేశీ భాషలలో ప్రసారం అవుతున్నదని శ్రీ గౌరవ్ ద్వివేది తెలియజేశారు. . మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆకాశవాణికి చెందిన 500కి పైగా కేంద్రాలు ప్రసారం చేస్తున్నాయని ఆయన చెప్పారు
నిర్దిష్ట ఎపిసోడ్‌ల కోసం కాకుండా మొత్తం కార్యక్రమం చూపించిన ప్రాభవాన్ని అంచనా వేయడానికి సర్వే నిర్వహించామని శ్రీ గౌరవ్ ద్వివేది తెలిపారు. మన్ కీ బాత్ కి సంబంధించి డిజిటల్ సెంటిమెంట్ తక్షణమే అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని పరిమితుల కారణంగా సాంప్రదాయ మీడియా విషయంలో అందలేదని ఆయన తెలియజేశారు. సర్వే నిర్వహణ భాధ్యతను 2022 ఏప్రిల్ 18న ఐఐఎం రోహ్‌తక్‌కి అప్పగించారు.
మన్ కీ బాత్ గురించి:
ఆల్ ఇండియా రేడియో లో ప్రసారం అవుతున్న కార్యక్రమాల్లో మన్ కీ బాత్ ప్రముఖ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. 2014 అక్టోబర్ 3న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. , 2014న ప్రారంభించబడింది మరియు ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మొత్తం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్‌వర్క్‌లో కార్యక్రమం ప్రసారం అవుతోంది. 30 నిమిషాల పాటు కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమం 100 వ ఎపిసోడ్ 2023 ఏప్రిల్ 30న 1ప్రసారం అవుతుంది. . మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆకాశవాణి ఇంగ్లీష్ కాకుండా 22 భారతీయ భాషలు, 29 మాండలికాలు, 11 విదేశీ భాషల్లో ప్రసారం చేస్తోంది. హిందీ, సంస్కృతం, పంజాబీ, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, మలయాళం, ఒడియా, కొంకణి, నేపాలీ, కాశ్మీరీ, డోగ్రీ, మణిపురి, మైథిలీ, బెంగాలీ, అస్సామీ, బోడో, సంతాలి, ఉర్దూ, సింధీ భాషలు, ఛత్తీస్‌గఢి, గోండి, హల్బీ, సర్గుజియా, పహారీ, షీనా, గోజ్రీ, బాల్టీ, లడఖీ, కర్బీ, ఖాసీ, జైంతియా, గారో, నాగమీస్, హ్మార్, పైటే, థాడౌ, కబుయి, మావో, తంగ్‌ఖుల్, నైషి, ఆది, మోన్పా, అయో ఉన్నాయి. , అంగామి, కోక్బోరోక్, మిజో, లెప్చా, సిక్కిమీస్ (భుటియా) మాండలికాలలో కార్యక్రమం ప్రసారం అవుతుంది. .
***
(Release ID: 1919370)
Visitor Counter : 262
Read this release in:
Punjabi
,
Hindi
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
English
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada