ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంప్రదాయ క్రీడా మహోత్సవం నిర్వహణకు ఒడిషా కేంద్రీయ విశ్వవిద్యాలయం చొరవపై ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 23 APR 2023 10:00AM by PIB Hyderabad

   భారతదేశ ఉన్నత క్రీడా సంప్రదాయాలు, వైవిధ్యంపై అవగాహన కల్పించే దిశగా సంప్రదాయ క్రీడా మహోత్సవం నిర్వహణకు ఒడిషా కేంద్రీయ విశ్వవిద్యాలయం చొరవ చూపడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

దీనిపై కేంద్ర సహాయమంత్రి డాక్టర్‌ సుభాష్‌ సర్కార్‌ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“భారతదేశ ఉన్నత క్రీడా సంప్రదాయాలు, వైవిధ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా సంప్రదాయ క్రీడా మహోత్సవం నిర్వహించాలని ఒడిషా కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1918629

*****

DS/ST


(रिलीज़ आईडी: 1919023) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam