ప్రధాన మంత్రి కార్యాలయం
ఏప్రిల్ 20వ తేదీన గ్లోబల్ బౌద్ధశిఖరాగ్ర సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
సదస్సుఇతివృత్తం - "సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందనలు - అభ్యాసం కోసంతత్వశాస్త్రం"
ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖ పండితులు, సంఘ నాయకులు మరియు ధర్మ సాధకుల ఈ సదస్సులో పాల్గొననున్నారు
प्रविष्टि तिथि:
18 APR 2023 10:58AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 20న ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోక్ లో జరిగే గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తారు.
అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 20,21 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్రపంచ బౌద్ధ సదస్సు ఇతివృత్తం "సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందనలు – అభ్యాసం కోసం తత్వశాస్త్రం ".
బౌద్ధ, సార్వజనీన సమస్యలపై ప్రపంచ బౌద్ధ ధర్మ నాయకత్వాన్ని, పండితులను నిమగ్నం చేయడానికి, వాటిని సమిష్టిగా పరిష్కరించడానికి విధానపరమైన సూచనలను అందించడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ప్రయత్నం. ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చల ద్వారా సమకాలీన పరిస్థితులలో బుద్ధ ధర్మం యొక్క ప్రాథమిక విలువలు ఏ విధంగా ప్రేరణను, మార్గదర్శకత్వాన్ని అందించగలవో అన్వేషిస్తుంది.
ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పండితులు, సంఘ నాయకులు, ధర్మసాధకులు పాల్గొంటారు, వారు ప్రపంచ సమస్యలపై చర్చిస్తారు, విశ్వజనీన విలువలపై ఆధారపడిన బుద్ధ ధర్మంలో సమాధానాలను అన్వేషిస్తారు. చర్చలు నాలుగు అంశాల క్రింద జరుగుతాయి: బుద్ధ ధర్మం మరియు శాంతి; బుద్ధ ధర్మం: పర్యావరణ సంక్షోభం, ఆరోగ్యం మరియు స్థిరత్వం; నలంద బౌద్ధ సంప్రదాయం పరిరక్షణ; బుద్ధ ధమ్మ తీర్థయాత్ర, జీవన వారసత్వం మరియు బుద్ధ అవశేషాలు: దక్షిణ, ఆగ్నేయ మరియు తూర్పు ఆసియాలోని దేశాలకు భారతదేశం యొక్క శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలకు స్థిరమైన పునాది.
***
(रिलीज़ आईडी: 1917678)
आगंतुक पटल : 272
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Odia
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam