ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ బస్సు దుర్ఘటనలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం


ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధినుంచి పరిహారం ప్రకటన

Posted On: 15 APR 2023 1:49PM by PIB Hyderabad

   మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో సంభవించిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధినుంచి పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వరుస ట్వీట్లలో పంపిన సందేశాల్లో:  

“మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో బస్సు ప్రమాదం నన్నెంతో బాధించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేర సహాయం అందిస్తోంది: ప్రధానమంత్రి” అని పేర్కొంది.

“అంతేకాకుండా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందించబడుతుంది: ప్రధానమంత్రి” అని తెలిపింది. 

***

DS/SH


(Release ID: 1917071) Visitor Counter : 175