ప్రధాన మంత్రి కార్యాలయం
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప్రమాదంపై ప్రధానమంత్రి సంతాపం
Posted On:
14 APR 2023 8:46AM by PIB Hyderabad
పీఐబీ ఢిల్లీ ద్వారా 2023 ఏప్రిల్ 14న ఉదయం 8:46 గంటలకు పోస్ట్ చేయబడినది
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం మంజూరుకు ఆమోదం తెలిపారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప్రమాదం వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ PM @narendramodi తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధినుంచి తలా ₹2 లక్షల వంతున, క్షతగాత్రులకు ₹50వేల చొప్పున మంజూరు చేసేందుకు ఆమోదించారు” అని పేర్కొంది.
(Release ID: 1916594)
Visitor Counter : 149
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam