ప్రధాన మంత్రి కార్యాలయం
సరస్సులు.. వృక్షాలుసహా ప్రకృతితో బెంగళూరుకు విశిష్ట అనుబంధం ఉంది: ప్రధానమంత్రి
Posted On:
01 APR 2023 9:33AM by PIB Hyderabad
వివిధ వృక్షజాతులు, సరస్సులు సహా ప్రకృతితో బెంగళూరుకు అవినాభావ సంబంధం ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
బెంగళూరులోని వృక్ష వైవిధ్యంపై ప్రముఖ చిత్రకారిణి, ఉద్యాన నిపుణురాలు, ప్రకృతి ప్రేమికురాలైన శ్రీమతి సుభాషిణి చంద్రమణి ట్వీట్లపై స్పందిస్తూ, ఇదే తరహాలో తమతమ నగరాలు, పట్టణాల్లోని విశిష్టతలను అందరితోనూ పంచుకోవాలని ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“బెంగళూరుతోపాటు ఈ నగరంలోని వృక్ష వైవిధ్యాన్ని విశదం చేసిన ఈ ట్వీట్ ఎంతో ఆసక్తి కలిగించింది. అనేక వృక్షజాతులు, సరస్సులు సహా ప్రకృతితో బెంగళూరుకు అవినాభావ సంబంధం ఉందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో వివిధ నగరాలు, పట్టణాల ప్రజలు కూడా తమ ప్రాంతాల గురించి ఇదేవిధంగా ఆసక్తికర సమాచారం పంచుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1912847)
Visitor Counter : 181
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam