ప్రధాన మంత్రి కార్యాలయం
‘సిజిటిఎంఎస్‌ఇ’ కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో హామీలు రూ.1లక్ష కోట్లకు చేరడంపై ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
30 MAR 2023 11:19AM by PIB Hyderabad
దేశంలోని సూక్ష్మ-చిన్నతరహా పరిశ్రమల కోసం రుణ హామీ పథకం (సిజిటిఎంఎస్‌ఇ) కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ హామీలు రూ.1 లక్ష కోట్లకు చేరడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత స్థాయిని అందుకోవడానికి ఊపునివ్వడంలో భాగంగా యువతలోని వ్యవస్థాపక ఉత్సహంపై ఎనలేని విశ్వాసం ఉంచినట్లు శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎంఎస్‌ఎంఇ' మంత్రిత్వశాఖ పోస్ట్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“మన ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరేవిధంగా యువతలోని వ్యవస్థాపక ఉత్సహంపై ఎనలేని విశ్వాసం ఉంచాం” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1912226)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati