ప్రధాన మంత్రి కార్యాలయం

శతాబ్దాల నాటి గుజరాత్‌.. తమిళనాడు బంధాన్ని ‘ఎస్‌టి సంగమం’ బలోపేతం చేస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 26 MAR 2023 10:49AM by PIB Hyderabad

   గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల మధ్య శతాబ్దాల కిందట ఏర్పడిన బంధాన్ని సౌరాష్ట్ర-తమిళనాడు సంగమం (‘ఎస్‌టి’ సంగమం) నేడు మరింత బలోపేతం చేస్తున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సౌరాష్ట్ర-తమిళనాడు సమ్మేళనం వేడుకల్లో భాగంగా తమిళనాడులోని సేలంలో దాండియా నృత్య ప్రదర్శనను తిలకించినట్లు కేంద్ర రైల్వేలు-జౌళి శాఖ సహాయమంత్రి శ్రీమతి దర్శనా జర్దోష్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో తనతోపాటు (గుజరాత్‌) రాష్ట్ర మంత్రిమండలిలో సహాయమంత్రి శ్రీ జగదీష్ విశ్వకర్మ కూడా పాల్గొన్నారని అందులో తెలిపారు.

దీనిపై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

“గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల మధ్య శతాబ్దాల నాటి బంధాన్ని సౌరాష్ట్ర-తమిళనాడు సంగమం #STSangamam మరింత బలోపేతం చేస్తోంది” అని పేర్కొన్నారు.


******

DS/ST(Release ID: 1910959) Visitor Counter : 176