ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ఎన్ టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో నిర్ణీత పరిమితికి మించి పెట్టుబడులు పెట్టడానికి మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అధికార బదలాయింపు ప్రస్తుత మార్గదర్శకాల నుంచి ఎన్ టిపిసి లిమిటెడ్ కు మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


60 గిగావాట్ల సామర్ధ్యంతో ఎన్ టిపిసి లిమిటెడ్ నెలకొల్పనున్న పునరుత్పాదక శక్తి యూనిట్ లో ఎన్ఆర్ఈఎల్ దాని ఇతర జేవీలు/ అనుబంధ సంస్థలలో ఎన్ జీఈఎల్ పెట్టుబడి పెట్టడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 17 MAR 2023 7:22PM by PIB Hyderabad

ఎన్ టిపిసి లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన  ఎన్ టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో నిర్ణీత పరిమితికి మించి పెట్టుబడులు పెట్టడానికి  కేంద్ర ప్రభుత్వ మహారత్న రంగ సంస్థలకు అధికార బదలాయింపు  ప్రస్తుత మార్గదర్శకాల నుంచి  ఎన్ టిపిసి లిమిటెడ్ కు మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల  మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక శక్తి సామర్థ్య  లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ టిపిసి  60 గిగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పనున్న యూనిట్ లో    రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ( ఎన్ఆర్ఈఎల్ )లో  ఎన్ జీఈఎల్   దాని ఇతర జేవీ లు/అనుబంధ సంస్థలు తమ  నికర విలువలో 15% గరిష్ట స్థాయికి లోబడి రూ. 5,000 కోట్ల నుంచి రూ. 7,500 కోట్లు వరకు పెట్టుబడి పెట్టడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

కాప్ 26 లో అంగీకరించిన విధంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తూ లక్ష్యాన్ని సాధించడానికి కృషి సాగిస్తోంది. శిలాజేతర ఇంధన వనరులను ఉపయోగించి  2030 నాటికి 500 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 

దేశ విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ టిపిసి తన పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించింది. నూతన పెట్టుబడులు వినియోగించి 60 గిగావాట్ల సామర్ధ్యంతో పునరుత్పాదక ఇంధన వనరులు ఉపయోగించి పనిచేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపిస్తుంది. దీనివల్ల 2030 నాటికి 500 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న  భారతదేశం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది. 2070 నాటికి శూన్య ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవడానికి  ఎన్ టిపిసి ప్రణాళిక సహకరిస్తుంది. 

ఇటీవల జరిగిన కాప్ 26 సదస్సులో  'పంచమిత్ర' విధానం అమలు చేసి శూన్య ఉద్గార విడుదల స్థాయికి చేరుకుంటామని భారతదేశం ప్రకటించింది. దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిందింది. 

పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్ టిపిసి రూపొందించిన ప్రణాళికను  ఎన్ జీఈఎల్  అమలు చేస్తుంది. ప్రస్తుతం ఎన్ జీఈఎల్ పనిచేస్తున్న/ నిర్మాణం పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న  15 పునరుత్పాదక కేంద్రాలు,  ఎన్ఆర్ఈఎల్ ద్వారా 2,861 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవడానికి   ఎన్ఆర్ఈఎల్  పోటీ రంగంలో ప్రవేశించి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి  ప్రణాళిక రూపొందించింది.ఎన్ టిపిసి కి  ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు  ప్రపంచ గ్రీన్ ఎనర్జీ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషించడానికి సహకరిస్తాయి. సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగం తగ్గుతుంది. బొగ్గు దిగుమతి కోసం చేస్తున్న వ్యయం గణనీయంగా తగ్గుతుంది. దేశంలో ప్రతి ప్రాంతంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. 

ఎన్ టిపిసి నెలకొల్పనున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు నిర్మాణ దశ, పని ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత వెలది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను అందిస్తుంది. 

***



(Release ID: 1908296) Visitor Counter : 146