ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోనిశివమొగ్గలో రూ.3,600 కోట్లకుపైగావిలువైన అనేకఅభివృద్ధి ప్రాజెక్టులకుప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధాని

శివమొగ్గ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం;

రెండు రైల్వే ప్రాజెక్టులు.. పలు రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన;

బహుళ-గ్రామీణ పథకాలకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన;మొత్తం 44 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం;

“ఇది కేవలం విమానాశ్రయం కాదు.. యువత కలలకు రెక్కలుతొడిగే కార్యక్రమం;

“విమానయానంపై దేశంలో ఎన్నడూ లేనంతగాఉత్సాహంపొంగుతున్న వేళ శివమొగ్గలో విమానాశ్రయం ప్రారంభోత్సవం”;

“విజయ శిఖరాలకు ఎదుగుతున్న నవ భారత సామర్థ్యానికి నేటి ఎయిరిఇండియా ప్రతీక”;

“రైల్వే.. రహదారి.. విమాన-‘ఐ’ మార్గాల ముందడుగుతోకర్ణాటక ప్రగతి బాటలు”;

“ఉత్తమఅనుసంధానంతో కూడిన మౌలిక సదుపాయాలుఈ ప్రాంతమంతటాకొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయి”;

“ఈ ద్వంద్వచోదకప్రభుత్వం మన గ్రామాలు..పేదలు.. తల్లులు.. సోదరీమణులకేఅంకితం”

Posted On: 27 FEB 2023 1:57PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని శివమొగ్గలో రూ.3,600 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. దీంతోపాటు శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో శివమొగ్గ- షికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైలుమార్గం, కోటగంగూరు రైల్వే కోచ్‌ డిపో ఉన్నాయి. అంతేకాకుండా రూ.215 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే బహుళ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటితోపాటు జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.950 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే పలు గ్రామీణ పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కూడా చేశారు. అటుపైన శివమొగ్గ నగరంలో రూ.895 కోట్లతో చేపట్టిన 44 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ... ఒకే భారతం-శ్రేష్ట భారతం’పై అంకిత భావాన్ని నేటికీ స‌జీవంగా ఉంచిన ప్రముఖ జాతీయ క‌వి కువెంపు పుట్టిన గడ్డకు శిరసాభివందనం చేస్తున్నానని ప్రకటించారు. శివమొగ్గలో కొత్త విమానాశ్రయం ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ- దీర్ఘకాలం ఎదురుచూసిన తర్వాత పౌరుల అవసరాలు నేడు నెరవేరుతున్నాయని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాన్ని ఎంతో సుందరంగా, అద్భుతంగా నిర్మించడంపై  వ్యాఖ్యానిస్తూ- కర్ణాటక సంప్రదాయాలు, సాంకేతికత సమ్మేళనానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇది కేవలం విమానాశ్రయం కాదని, యువత కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమమని చెప్పారు. ఇవాళ శంకుస్థాపన చేసిన ‘ఇంటింటికీ కొళాయి నీరు’ ప్రాజెక్టులు సహా రోడ్డు, రైలు ప్రాజెక్టుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుల ప్రయోజనాలు పొందనున్న జిల్లాల పౌరులకు అభినందనలు తెలిపారు.

   నంతరం శ్రీ బి.ఎస్.యడ్యూరప్ప జన్మదినం నేపథ్యంలో ప్రధానమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా జీవితంలో ఆయన కృషిని గుర్తు చేసుకున్నారు. శాసనసభలో ఇటీవల ఆయన చేసిన ప్రసంగం ప్రజాజీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. శ్రీ బి.ఎస్.యడ్యూరప్పకు గౌరవ సూచకంగా మొబైల్‌ ఫోన్ల ఫ్లాష్‌లైట్లను పైకెత్తి చూపాలని, ప్రధాని సూచించగా- ఆ మేరకు తమ సీనియర్‌ నేతపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ ప్రేక్షకులు, ప్రజలు భారీగా స్పందించారు. కర్ణాటక రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని ప్రధానమంత్రి అన్నారు. రైల్వే, రహదారి, విమాన-‘ఐ’ (డిజిటల్‌ సంధానం) మార్గాల ముందడుగుతో కర్ణాటక ప్రగతికి బాటలు పడ్డాయని ప్రధాని పేర్కొన్నారు. కర్ణాటక ప్రగతి రథాన్ని ద్వంద్వచోదక ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్నదని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో గ్రామాల నుంచి 2-3 అంచెల్లోని నగరాల దాకా విస్తృత ప్రగతిని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. లోగడ నగరాలు కేంద్రంగా అభివృద్ధిపై దృష్టి పెట్టేవారని, నేడు రెండు ఇంజన్ల ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రగతి రథాన్ని నడిపిస్తున్నదని ఆయన వివరించారు. “ఈ విధమైన ఆలోచన విధానానికి శివమొగ్గ అభివృద్ధే నిదర్శనం” అని ప్రధాని ఉదాహరించారు.

   దేశంలో విమానయానంపై ఎన్నడూ లేనంతగా ఉత్సాహం పొంగుతున్న నేపథ్యంలో శివమొగ్గలో విమానాశ్రయం ప్రారంభమైందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రయాణ విమానం కొనుగోలుకు ఎయిరిండియా ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నదని ఆయన తెలిపారు.  కాగా, 2014లో కాంగ్రెస్‌ పాలన సమయాన ఎయిరిండియా గురించి ఎప్పుడూ ప్రతికూల ప్రస్తావనే వచ్చేదని గుర్తుచేశారు. అలాగే అనేక కుంభకోణాలకు అదొక ప్రతీకగా ఉండేదని, నష్టదాయక వ్యాపార వ్యూహానికి మచ్చుతునకలా భావంచబడేదని పేర్కొన్నారు. అదే ఎయిరిండియా ఇవాళ, విజయ శిఖరాలకు చేరుతున్న నవ భారత సామర్థ్యానికి ప్రతీకగా మారిందని చెప్పారు. భారత వైమానికి మార్కెట విస్తరణను ప్రస్తావిస్తూ- సమీప భవిష్యత్తులోనే దేశానికి వేలాది విమానాలు అవసరం కాగలవని, వాటిని నడిపించగల యువశక్తి కూడా వేల సంఖ్యలో కావాల్సి ఉంటుందని చెప్పారు. ఇక మనం నేడు విమానాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్‌లో తయారైన విమానాల్లో దేశ పౌరులు ప్రయాణించే రోజు ఎంతోదూరంలో లేదని ప్రధాని వ్యాఖ్యానించారు.

   దేశంలో వైమానిక రంగం అనూహ్య విస్తృతికి దోహదం చేసిన ప్రభుత్వ విధానాల గురించి ప్రధానమంత్రి వివరించారు. గత ప్రభుత్వాల తరహాలో కాకుండా ప్రస్తుత ప్రభుత్వం చిన్న నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ముందడుగు వేసిందని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక 2014 వరకూ 7 దశాబ్దాల తర్వాత దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 మాత్రమేనని ప్రధాని గుర్తుచేశారు. కానీ, కేవలం గడచిన 9 సంవత్సరాల్లోనే అనేక చిన్న నగరాలను కలుపుతూ మరో 74 విమానాశ్రయాలు నిర్మితమయ్యాయని పేర్కొన్నారు. అలాగే హవాయి చెప్పులు ధరించే సామాన్యులు కూడా హవాయి జహాజ్‌ (విమానం)లో ప్రయాణించగలగాలనే తన దృక్పథానికి అనుగుణంగా సరసమైన విమాన ప్రయాణం కోసం ‘ఉడాన్’ పథకం ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

   “ప్రకృతి సౌందర్యానికి, సంస్కృతికి, వ్యవసాయానికి పట్టుకొమ్మవంటి శివమొగ్గలో ఇవాళ ప్రారంభించిన కొత్త విమానాశ్రయం ఈ నగరాభివృద్ధికి కొత్త బాటలు వేస్తుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పశ్చిమ కనుమలు, పచ్చదనం, వన్యప్రాణుల అభయారణ్యాలు, నదులు, ప్రసిద్ధ జోగ్ జలపాతం, ఎలిఫెంట్ క్యాంప్, సింహధామ్‌లోని సింహాల సఫారీ, అగుంబే పర్వత శ్రేణులకు నిలయమైన మలెనాడు ప్రాంతానికి శివమొగ్గ ముఖద్వారమని ఆయన పేర్కొన్నారు. గంగానదిలో మునకవేయని, తుంగభద్ర నది నీటిని తాగని వారి జీవితం అసమగ్రమేననే నానుడిని ప్రధాని గుర్తుచేశారు. శివమొగ్గ సాంస్కృతిక సంపద గురించి మాట్లాడుతూ- జాతీయ కవి కువెంపుతోపాటు ప్రపంచంలో ఏకైక సజీవ సంస్కృత గ్రామం మట్టూర్సహా శివమొగ్గలోని అనేక భక్తివిశ్వాస కేంద్రాలను ప్రధాని ప్రస్తుతించారు. అలాగే స్వాతంత్ర్య సమరంలో ఇస్సూరు గ్రామ పోరాట స్ఫూర్తిని కూడా ఆయన ప్రస్తావించారు.

   శివమొగ్గ వ్యవసాయ వైశిష్ట్యాన్ని వివరిస్తూ- దేశంలోని అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఇదొకటని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో వివిధ రకాల పంటలు ఆకట్టుకుంటాయని  ఆయన అన్నారు. ఈ వ్యవసాయ సంపదకు రెండు ఇంజన్ల ప్రభుత్వం చేపడుతున్న పటిష్ట అనుసంధాన కార్యక్రమాలతో చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. ఇక కొత్త విమానాశ్రయం పర్యాటక రంగం ప్రగతికి, ఆర్థిక కార్యకలాపాల వేగానికి, ఉపాధి అవకాశాల సృష్టికి దోహదం చేస్తుందని ప్రధాని అన్నారు. రైలు మార్గం అనుసంధానంతో రైతులకు కొత్త మార్కెట్ల సౌలభ్యం కలుగుతుందని ఆయన చెప్పారు.

 

శివమొగ్గ - శికారిపుర- రాణిబెన్నూర్ కొత్త మార్గం నిర్మాణం పూర్తి అయితే హావేరి మరియు దావణగెరె జిల్లా లు కూడా లాభపడతాయి అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ఈ మార్గం లో ఏ లెవెల్ క్రాసింగూ ఉండబోదు, దీనిత ఈ మార్గం సురక్షితమైన మార్గం గా మారుతుంది, ఇక్కడ రైళ్లు సాఫీ గా నడవగలుగుతాయి అని ఆయన తెలియ జేశారు.

 

కొద్దిసేపే నిలచి ఉండే స్టేశన్ గా ఉన్నటువంటి కోటగంగనూర్ స్టేశన్ సామర్థ్యం ఒక కొత్త కోచింగ్ టర్మినల్ నిర్మాణం అనంతరం ఊతాన్ని అందుకోగలదు అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. దీనిని ప్రస్తుతం 4 రైలు మార్గాలు, 3 ప్లాట్ ఫార్మ్ స్ మరియు ఒక రైల్ వే కోచింగ్ డిపో యుక్తం గా అభివృద్ధిపరచడం జరుగుతోంది అని ఆయన వెల్లడించారు. శివమొగ్గ ఈ ప్రాంతంలో విద్యబోధన కేంద్రం గా నిలుస్తోంది అని ప్రధాన మంత్రి అంటూ, పెరిగిన సంధానం శివమొగ్గ ను సందర్శించడాన్ని సమీప ప్రాంతాల విద్యార్థుల కు సులభతరం గా మార్చివేస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఇది ఈ ప్రాంతం లో వ్యాపారానికి మరియు పరిశ్రమల కు కొత్త తలుపులను తెరుస్తుందని కూడా ఆయన తెలిపారు. ‘‘మంచి సంధాన సౌకర్యాల తో కూడిన మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతం మొత్తంమీద సరిక్రొత్త ఉపాధి అవకాశాల ను సృష్టించనుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

శివమొగ్గ యొక్క మహిళల కు జీవించడం లో సౌలభ్యాన్ని సమకూర్చడం కోసం చేపట్టినటువంటి ఒక పెద్ద ప్రచార ఉద్యమమే జల్ జీవన్ మిశన్ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. జల్ జీవన్ మిశన్ మొదలుపెట్టడాని కంటే ముందు శివమొగ్గ లో 3 లక్షల కుటుంబాల కు గాను 90 వేల కుటుంబాలు మాత్రమే నల్లా నీటి కనెక్శన్ లను కలిగివున్నాయి అని ప్రస్తుతం డబల్ ఎన్ జిన్ ప్రభుత్వం 1.5 లక్షల కుటుంబాల కు నల్లా నీటి కనెక్శన్ లను అందించిందని, మొత్తం కుటుంబాల కు ఈ సదుపాయాన్ని అందించేందుకు పనులు కొనసాగుతూ ఉన్నాయని ఆయన తెలిపారు. గడచిన మూడున్నరేళ్ల లో 40 లక్షల మంది నల్లా నీటి కనెక్శన్ లను అందుకొన్నట్లు చెప్పారు.

‘‘డబల్ ఎన్ జిన్ ప్రభుత్వం గ్రామాల కు, పేద ప్రజలకు, మన మాతృమూర్తులు మరియు మన సోదరీమణుల కు చెందిన ప్రభుత్వం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. టాయిలెట్ లు, గ్యాస్ కనెక్శన్ లు మరియు నల్లా ల ద్వారా మంచినీటి సరఫరా లను గురించి ప్రధాన మంత్రి ఉదాహరణలు గా చెప్తూ, మాతృమూర్తుల మరియు సోదరీమణుల ఇక్కట్టులు అన్నింటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి గొట్టపు మార్గం ద్వారా నీరు అందేటట్టు చూడడానికి డబల్ ఎన్ జిన్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి తో పాటుపడుతున్నది అని ఆయన స్పష్టంచేశారు.

 

ఆ తరహా అవకాశం వెతుక్కొంటూ రావడం భారతదేశం యొక్క స్వాతంత్ర్యం చరిత్ర లో ఇదే మొట్టమొదటిసారి మరి భారతదేశం యొక్క వాణి ప్రపంచ రంగస్థలం పైన వినపడుతున్నది అని ఆయన నొక్కిచెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ వెస్టర్ లు భారతదేశం లో పెట్టుబడి పెట్టాలని అనుకొంటున్నారు మరి ఇది కర్నాటక కు , ఇక్కడి యువజనులకు ప్రయోజనాల ను అందిస్తుంది అని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, కర్నాటక ప్రగతి కై ఈ ప్రచార ఉద్యమం మరింత వేగాన్ని పుంజుకొంటుంది అని అందరికి బరోసా ను ఇచ్చారు. ‘‘మనం కలసి నడవాల్సివుంది. మనం కలసి ముందుకు పోవలసివుంది’’ అని అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మాయి, కర్నాటక పూర్వ ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యెడియూరప్ప, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి తో పాటు కర్నాటక ప్రభుత్వం లో మంత్రులు మరియు ఇతరులు ఉన్నారు.

 

పూర్వరంగం

 

శివమొగ్గ లో విమానాశ్రయాన్ని ప్రారంభించడం తో దేశవ్యాప్తం గా వాయుమార్గాల అనుసంధానాన్ని మెరుగుపరచేందుకు ప్రధాన మంత్రి ఇస్తున్న ప్రాధాన్యం మరింత ఉత్తేజాన్ని అందుకొంటుంది. ఈ కొత్త విమానాశ్రయాన్ని దాదాపు గా 450 కోట్ల రూపాయల తో నిర్మించడమైంది. ఇందులోని పేసింజర్ టర్మినల్ బిల్డింగు గంట కు 300 మంది ప్రయాణికుల కు ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా మల్ నాడు ప్రాంతం లోని శివమొగ్గ, తదితర ఇరుగు పొరుగు ప్రాంతాల కు సంధానాన్ని మెరుగుపరుస్తుంది కూడా.

 

శివమొగ్గ లో రెండు రైల్ వే ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో శివమొగ్గ- శికారిపుర-రాణిబెన్నూరు కొత్త రైలుమార్గం, కోటిగంగూరు రైల్ వే కోచింగ్ డిపో లు ఉన్నాయి. ఈ కొత్త రైలుమార్గాన్ని 990 కోట్ల రూపాయల తో నిర్మించనుండగా ఇది బెంగళూరు-ముంబయి ప్రధాన మార్గం లో మల్ నాడు ప్రాంతాని కి మెరుగైన సంధానాన్ని కల్పిస్తుంది. శివమొగ్గ నుండి కొత్త రైళ్ల ప్రారంభానికి, బెంగళూరు తో పాటు మైసూరు లో మరమ్మతు సదుపాయాల లో రద్దీ ని తగ్గించడానికి వీలుగా శివమొగ్గ నగరం లోని కోటెగంగూరు రైల్ వే కోచింగ్ డిపో ను 100 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడం జరుగుతుంది.

 

వీటితో పాటు బహుళ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకూ ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. 215 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించే ప్రాజెక్టుల లో బైందూరు-రాణిబెన్నూరు ను కలుపుతూ ఎన్‌హెచ్‌-766సి పరిధి లో శికారిపుర పట్టణం కోసం కొత్త బైపాస్ రోడ్డు ఒకటి. మెగరవళ్లి నుండి ఆగుంబె దాకా ఎన్‌హెచ్‌-169ఎ విస్తరణ; ఎన్‌హెచ్‌-169 పరిధి లోని తీర్థహళ్లి తాలూకాలో గల భారతీపుర వద్ద కొత్త వంతెన నిర్మాణం వంటివి ఉన్నాయి.

 

 

కార్యక్రమం లో భాగం గా జల్‌ జీవన్‌ మిశన్‌ కింద 950 కోట్ల రూపాయల తో చేపట్టిన పలు గ్రామీణ పథకాల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం చేయడంతో పాటు మరికొన్నిటికి శంకుస్థాపన కూడా చేశారు. వీటిలో గౌతమపుర సహా 127 గ్రామాల కు సంబంధించిన బహుళ-గ్రామ పథకం ప్రారంభోత్సవం ఒకటి కాగా, 860 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించే మరో మూడు బహుళ-గ్రామ పథకాలు ఉన్నాయి. ఈ నాలుగు పథకాలు గృహాల కు నల్లా కనెక్శన్ లను అందిస్తాయి. ఈ పథకాల వల్ల 4.4 లక్షల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందుతారని ఒక అంచనా ఉంది.

 

 

శివమొగ్గ నగరం లో 895 కోట్ల రూపాయల కు పైగా విలువైన 44 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. వీటిలో 110 కి.మీ.ల పొడవైన 8 స్మార్ట్ రోడ్ ప్యాకేజీలు ఉన్నాయి; ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్‌ కంట్రోల్ సెంటర్, బహుళ-స్థాయి ల కార్ పార్కింగ్; స్మార్ట్ బస్ శెల్టర్ ప్రాజెక్టు లు; ఘన వ్యర్థ పదార్థాల ఆధునిక నిర్వహణ వ్యవస్థ; శివప్ప నాయక్ పేలెస్ వంటి వారసత్వ ప్రాజెక్టుల ను ఇంటరాక్టివ్ మ్యూజియమ్ గా రూపొందించడం, 90 కన్సర్వెన్సీ లేన్‌ స్, పార్కుల ఏర్పాటు, రివర్‌ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు లు వీటిలో భాగం గా ఉన్నాయి.

 

 

 

***

DS/TS


(Release ID: 1902823) Visitor Counter : 129