ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ గాయని వాణీ జయరామ్ మృతిపై ప్రధాని సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2023 8:37PM by PIB Hyderabad
ప్రముఖ గాయని వాణీ జయరామ్ మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ప్రతిభావంతురాలైన గాయని వాణీ జయరామ్ తన మధుర స్వరంతో వేర్వేరు భాషలలో విభిన్న భావోద్వేగాలను ప్రతిబింబించే గొప్ప పాటలెన్నో పాడిన నేపథ్యంలో- ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆమె కన్నుమూత సృజనాత్మక ప్రపంచానికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను... ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1896508)
సందర్శకుల సూచీ సంఖ్య : : 232
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam