ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సర్వే 2022-23 సారాంశం


ప్రపంచవ్యాప్త ఆర్థిక-రాజకీయ పరిణామ క్రమం మేరకు 2023-24లో
భారత జీడీపీ వృద్ధి 6.0 శాతం నుంచి 6.8 శాతానికి చేరుకోగలదు;

ఆర్థిక సంవత్సరం-2024లో వాస్తవ పరిస్థితుల మేరకు ప్రాథమిక
జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే 2022-23 అంచనా;

మునుపటి ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.7 శాతంతో పోలిస్తే మార్చి-2023తో ముగిసే ఏడాదికి (వాస్తవ పరిస్థితుల్లో) ఆర్థిక వ్యవస్థ 7శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా;

సూక్ష్మ-చిన్న-మధ్యతరహా (ఎంఎస్‌ఎంఇ) పరిశ్రమల రంగానికి రుణ లభ్యత
వృద్ధి 2022 జనవరి-నవంబర్ కాలంలో సగటున 30.5 శాతం దాటింది;

ఆర్థిక సంవత్సరం-23 తొలి 8 నెలల్లో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం (కాపెక్స్) 63.4 శాతందాకా పెరగడం ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మరో వృద్ధి చోదకం;

ఆర్‌బిఐ అంచనా మేరకు ఆర్థిక సంవత్సరం-23లో మొత్తం
ద్రవ్యోల్బణం 6.8 శాతం కాగా- ఇది లక్ష్య పరిధికన్నా ఎక్కువ;

వలస కార్మికులు నిర్మాణ కార్యకలాపాలకు తిరిగి మళ్లడంతో హౌసింగ్ మార్కెట్‌ స్తంభన వ్యవధి గత ఏడాదినాటి 42 నెలలతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం-23

మూడో త్రైమాసికంలో గణనీయంగా పతనమై 33 నెలలకు దిగివచ్చింది;

ఆర్థిక సంవత్సరం-22తోపాటు 2023 తొలి అర్ధభాగంలో ఎగుమతుల వృద్ధి పెరుగుదల ఉత్పత్తి ప్రక్రియలను స్వల్ప వేగంనుంచి శరవేగ స్థాయికి చేర్చింది;

ఆర్థిక సంవత్సరం-23లో వాణిజ్య.. హోటల్‌.. రవాణా రంగాల సేవలు పుంజుకోగా రెండో త్రైమాసికానికి జీడీపీలో ప్రైవేటు వినియోగం 58.4 శాతానికి చేరి 2013-14 నుంచి అన్ని సంవత్సరాల రెండో త్రైమాసికాలతో పోలిస్తే ఎక్కువగా నమోదైంది;

ప్రపంచ వాణిజ్యంలో వృద్ధి 2022లో 3.5 శాతం కాగా- 2023లో
1.0 శాతానికి పరిమితం కాగలదని ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా

Posted On: 31 JAN 2023 2:00PM by PIB Hyderabad

   ప్రపంచవ్యాప్తంగా సాగే ఆర్థిక-రాజకీయ పరిణామాల తీరు ఆధారంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6.0 శాతం నుంచి 6.8 శాతానికి చేరుకోగలదని ఆర్థిక సర్వే ఆశావహ అంచనాలు వెలువరించింది.

 

   ఈ ఆశావహ అంచనాలకు ఊతమిచ్చిన అనేక సానుకూలాంశాల్లో ముఖ్యమైనవి కొన్ని: ప్రైవేటు వినియోగం పుంజుకోవడంతో ఉత్పత్తి కార్యకలాపాలకు ఉత్తేజం లభించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా మూలధన వ్యయం (కాపెక్స్‌) పెరిగింది. సార్వత్రిక టీకా కార్యక్రమ విజయంతో రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్‌ మాళ్లు, సినిమాలు వగైరా ప్రత్యక్ష సేవలపై ప్రజా వ్యయానికి వీలుచిక్కింది. వలస కార్మికులు తిరిగి నగరాలకు మళ్లీ నిర్మాణ కార్యకలాపాల్లో పాల్గొనడంతో హౌసింగ్ మార్కెట్‌ స్తంభన వ్యవధి గత ఏడాదినాటి 42 నెలలతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో గణనీయంగా తగ్గి 33 నెలలకు దిగివచ్చింది. అలాగే కార్పొరేట్‌ సంస్థల ఆస్తిఅప్పుల పట్టికలు బలం పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులకు చక్కని మూలధనీకరణవల్ల రుణ సరఫరా పెంపునకు అవి సిద్ధమయ్యాయి. దీంతో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా (ఎంఎస్‌ఎంఇ) పరిశ్రమల రంగానికి రుణ లభ్యతలో గణనీయ వృద్ధి నమోదైంది.

   కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఆర్థిక సర్వే 2022-23ను ప్రవేశపెట్టారు. ఇది ఆర్థిక సంవత్సరం-24లో వాస్తవ పరిస్థితులపరంగా జీడీపీలో ప్రాథమిక వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది. ఈ అంచనాలను ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి)సహా దేశీయంగా భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) వంటి బహుపాక్షిక వ్యవస్థల అంచనాలతో స్థూలంగా పోల్చి చూడవచ్చు.

 

   ఆర్థిక సంవత్సరం-24లో వృద్ధి వేగవంతం కాగలదన్న ఈ అంచనాలకు తోడ్పడిన అంశాల్లో-  విస్తృత రుణవితరణ, కార్పొరేట్‌, బ్యాంకింగ్‌ రంగాల ఆస్తిఅప్పుల పట్టికలు బలోపేతం కావడంవల్ల మూలధన పెట్టుబడుల చక్రం విస్తృతి వంటివి ప్రధానమైవి. అలాగే ప్రభుత్వ డిజిటల్‌ వేదికల విస్తరణ, పీఎం గతిశక్తి, జాతీయ రవాణా విధానం, తయారీ రంగానికి చేయూతనిచ్చే ఉత్పాదకాధారిత ప్రోత్సాహక పథకాల నుంచి కూడా ఆర్థిక వృద్ధికి మరింత మద్దతు లభించనుంది.

 

                    

మొత్తంమీద వాస్తవ పరిస్థితుల దృష్ట్యా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి 8.7 శాతం కాగా, 2023 మార్చితో ముగిసే సంవత్సరానికి 7 శాతంగా నమోదు కాగలదని ఆర్థిక సర్వే పేర్కొంది. కోవిడ్‌-19, రష్యన్-ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఫెడరల్ రిజర్వ్ నేతృత్వంలోని ఆర్థిక వ్యవస్థల పరిధిలోగల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో భాగంగా విధానపరమైన వడ్డీరేట్లను సమకాలీకరించాయి. దీంతో అమెరికా డాలర్ విలువసహా నికర దిగుమతి ఆర్థిక వ్యవస్థలలో కరెంట్ ఖాతా లోటు (సిఎడి) పెరుగుదల అనివార్యమైంది. ఇలా మూడురకాల ఉత్పాతాలు విరుచుకుపడినప్పటికీ ప్రపంచవ్యాప్త ఆర్థిక సంస్థలు భారతదేశాన్ని ఆర్థిక సంవత్సరం-23లో 6.5-7.0 శాతం మధ్య వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అంచనా వేస్తుండటం గమనార్హం.

   ఈ సర్వే ప్రకారం- ఆర్థిక సంవత్సరం-23లో భారత ఆర్థికవృద్ధి ప్రధానంగా ప్రైవేట్ వినియోగం, మూలధన కల్పన ద్వారా సాధ్యమైంది. ఈ రెండూ ఉపాధి సృష్టికి తోడ్పడటంతో పట్టణ నిరుద్యోగిత శాతం తగ్గింది. అలాగే ఉద్యోగ భవిష్య నిధిలో చందాదారుల నికర నమోదు వేగవంతమైంది. అంతేగాక 200 కోట్లకుపైగా మోతాదులతో ప్రపంచంలో రెండో అతిపెద్ద టీకాల కార్యక్రమం విజయవంతమై వినియోగదారులలో మనోవిశ్వాసం పెరిగింది. దేశవ్యాప్తంగా వినియోగం పుంజుకోవడానికి ఇది దోహదం చేసింది. అయినప్పటికీ, ఉద్యోగ కల్పన  వేగవంతం కావడంలో ప్రైవేట్ మూలధన వ్యయం సత్వర నాయకత్వ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.

 

   వృద్ధిపై భారత దృక్పథం ఆశావహంగా ఉండటానికి దోహదం చేసిన నాలుగు ప్రధానాంశాలను సర్వే ఉటంకించింది. ఈ మేరకు (i) చైనాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలోనూ మిగిలిన ప్రపంచ దేశాల్లో ఆరోగ్య, ఆర్థిక పతనం పరిమిత కావడం వల్ల  సరఫరా క్రమం సాధారణ స్థాయికి చేరుతుండటం; (ii) చైనా ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరుచుకున్నా ద్రవ్యోల్బణ సంకేతాలు ముఖ్యమైనవిగా లేదా స్థిరంగా లేకపోవడం; (iii) ప్రధాన అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థ (ఎఇ)లలో మాంద్యం ధోరణులు కఠిన ద్రవ్య విధాన చర్యల నిలిపివేతకు దారితీయడం, ఫలితంగా 6 శాతానికి తక్కువగా స్థిరమైన దేశీయ ద్రవ్యోల్బణం నేపథ్యంలో భారతదేశానికి మూలధన ప్రవాహం తిరిగి రావడంసహా; (iv) ఇవన్నీ కలగలసి మానవ మనోభావాల మెరుగుదలకు దారితీయడంతో ప్రైవేట్ రంగ పెట్టుబడికి మరింత ఊపునిస్తాయని పేర్కొంది.

   మరోవైపు కేంద్ర ప్రభుత్వ ‘అత్యవసర రుణాధారిత హామీ పథకం’ (ఇసిఎల్‌జిఎస్‌) పొడిగింపు ఫలితంగా సూక్ష్మ-చిన్న-మధ్యతరహా (ఎంఎస్‌ఎంఇ) పరిశ్రమల రంగానికి రుణ లభ్యత వృద్ధి 2022 జనవరి-నవంబర్ మధ్య కాలంలో సగటున 30.5 శాతం దాటిందని కూడా సర్వే వివరించింది. ఈ విధంగా ‘ఇసిఎల్‌జిఎస్‌’ ద్వారా రుణ చెల్లింపుల భారాన్ని ప్రభుత్వం తగ్గించడంతో ‘ఎంఎస్‌ఎంఇ’ రంగం వేగంగా కోలుకుంటున్నదని, ఆ సంస్థల నుంచి వస్తుసేవల పన్ను చెల్లింపులలో పెరుగుదల ఇందుకు నిదర్శనమని సర్వే పేర్కొంది. అంతేకాకుండా  ఒడుదొడుకుల బాండ్‌ మార్కెట్ల నుంచి లాభాంశాలు పెరిగిన నేపథ్యంలో రుణగ్రహీతల నిధుల సమీకరణ ఎంపికలో మార్పు మొత్తంగా బ్యాంకుల నుంచి రుణ లభ్యతను పెంచింది. బాహ్య రుణాలపై బ్యాంకులకు వడ్డీ, ఇతరత్రా ప్రక్రియల ఖర్చులు పెరగడం కూడా ఇందుకు దారితీసింది. ఆర్థిక సంవత్సరం-24లో ద్రవ్యోల్బణం తగ్గి, రుణసమీకరణలో వాస్తవ వ్యయం పెరగని పక్షంలో రుణలభ్యత వృద్ధి మరింత వేగం అందుకుంటుంది.

   ఆర్థిక సంవత్సరం-23 తొలి 8 నెలల్లో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం (కాపెక్స్) 63.4 శాతం పెరగడంతోపాటు 2022 జనవరి-మార్చి త్రైమాసికం నుంచి ప్రైవేట్‌ రంగ ‘కాపెక్స్‌’ పెరగడం కూడా ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మరో వృద్ధి చోదకంగా మారింది. ఇదే ధోరణి కొనసాగితే పూర్తి సంవత్సరపు మూలధన వ్యయ బడ్జెట్‌ సంపూర్ణం కాగలదని అంచనా. కార్పొరేట్‌ సంస్థల ఆస్తిఅప్పుల పట్టీల బలోపేతంతోపాటు రుణపరపతి పెంచుకోగలిగే సామర్థ్యం ఫలితంగా ప్రైవేట్ ‘కాపెక్స్‌’లో నిరంతర మెరుగుదల తథ్యమన్నది స్పష్టమవుతోంది. మహమ్మారి సమయంలో నిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవడాన్ని ప్రస్తావిస్తూ- టీకాల కార్యక్రమ విజయంతో పుంజుకున్న వినియోగం గృహ మార్కెట్లోకి మళ్లడంతో వలస కార్మికులు నగరాలకు తిరిగి వచ్చి నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారని సర్వే తెలిపింది. హౌసింగ్ మార్కెట్‌ స్తంభన వ్యవధి గత ఏడాదినాటి 42 నెలలతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం-23 మూడో త్రైమాసికంలో గణనీయంగా పతనమై 33 నెలలకు దిగిరావడమే ఇందుకు రుజువని ఉదాహరించింది.

   మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోందని సర్వే పేర్కొంది. తద్వారా గ్రామీణ కుటుంబాలకు ఆదాయ వనరుల వైవిధ్యీకరణలో పరోక్ష అవకాశాలు కల్పిస్తోందని కూడా చెబుతోంది. ఇక పీఎం-కిసాన్, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు దేశంలో ఆహార భద్రతకు భరోసా ఇచ్చాయని, వీటి సానుకూల ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) అంగీకరించిందని పేర్కొంది. మరోవైపు గృహ సదుపాయాలు, మహిళా సాధికారత, లింగ-సంతానోత్పత్తి శాతం వంటి సూచీల ఆధారంగా చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఫలితాలు కూడా ఆర్థిక సంవత్సరం 2016 నుంచి 2020దాకా గ్రామీణ సంక్షేమం మెరుగుదలను స్పష్టం చేస్తున్నాయని వివరించింది.

   భారత ఆర్థిక వ్యవస్థ మహమ్మారి సవాలును అధిగమిస్తూ ముందడుగు వేసిందని, అనేక దేశాలతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం-22లో పూర్తిగా పుంజుకుందని సర్వే గుర్తుచేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం-23లో మహమ్మారి పూర్వ వృద్ధి పథం దిశగా తననుతాను గాడిన పెట్టుకున్నదని ఆశావాదం వెలిబుచ్చింది. అయినప్పటికీ ప్రస్తుత సంవత్సరంలో ఐరోపా  ఘర్షణల ఫలితంగా పెరిగిన ద్రవ్యోల్బణ నియంత్రణ సవాలును కూడా భారత్‌ దీటుగా ఎదుర్కొందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ వస్తు విపణిలో ధరల సడలింపుతోపాటు ప్రభుత్వం, ‘ఆర్‌బిఐ’ చేపట్టిన చర్యలు చివరకు 2022 నవంబరులో చిల్లర ద్రవ్యోల్బణాన్ని ‘ఆర్‌బిఐ’ నిర్దేశిత గరిష్ఠస్థాయికన్నా దిగువకు తీసుకురాగలిగినట్లు పేర్కొంది.

 

 

 

   ఏది ఏమైనప్పటికీ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ రూపాయి విలువ క్షీణత సవాలును ఎదుర్కొనాల్సి ఉందని సర్వే హెచ్చరించింది. మరోవైపు అమెరికా ఫెడరల్‌ విధాన రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ప్రపంచ విపణిలో వస్తు ధరలు పెరగడం, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఊపందుకుంటున్న నేపథ్యంలో ‘సిఎడి’ అగాధం కొనసాగవచ్చునని తెలిపింది. అలాగే ప్రపంచ వృద్ధి మందగమనం, ఈ ఏడాది ద్వితీయార్థంలో  ప్రపంచ మార్కెట్ పరిమాణాన్ని వాణిజ్యం కుదించడంతో ఎగుమతి ఉద్దీపన నష్టం కూడా ఉంటుందని స్పష్టం చేసింది.

   ఈ పరిస్థితుల నడుమ 2023లో ప్రపంచ వృద్ధి తగ్గుతుందని అంచనా, తదుపరి సంవత్సరాల్లోనూ సాధారణంగా మందకొడిగా ఉంటుందని అంచనా. డిమాండ్ మందగించడం వల్ల ప్రపంచ విపణిలో వస్తుధరలు తగ్గుతాయి.. దీంతోపాటు ఆర్థిక సంవత్సరం-24లో భారత ‘సిఎడి’ కూడా మెరుగవుతుంది. అయితే, దేశీయ డిమాండుతో వేగంగా పుంజుకోవడంసహా దానికన్నా కాస్త తక్కువగానైనా ఎగుమతులలో పెరుగుదల వల్ల కరెంట్ ఖాతా నిల్వలపై ప్రతికూల ప్రభావం పడవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరం పుంజుకుంటున్న వృద్ధి తదుపరి ఏడాదికీ కొనసాగే అవకాశం ఉన్నందున ‘సిఎడి’ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతయినా ఉందని సర్వే హెచ్చరించింది.

   ఆర్థిక సర్వే మరో ఆసక్తికర వాస్తవాన్ని మన ముందుంచింది. అదేమిటంటే- సాధారణంగా మునుపటి కాలంలో తీవ్ర అనూహ్య ఉత్పాతాలు సంభవించినా వాటిమధ్య వ్యవధి ఉండేది. అయితే, ఈ సహస్రాబ్దిలోని మూడో దశాబ్దంలో- 2020 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వరుసగా మూడు సవాళ్లు కుదిపేశాయని గుర్తుచేసింది. ముందుగా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఉత్పాదకత కుంచించుకుపోయింది. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోసింది. ఈ రెండింటికీ తోడు ఫెడరల్‌ రిజర్వు నేతృత్వంలోని వివిధ ఆర్థిక వ్యవస్థల పరిధిలోగల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణ నియంత్రణలో భాగంగా ఏకీకృత విధాన వడ్డీ రేట్ల పెంపుద్వారా స్పందించాయి. ఫెడ్‌ రిజర్వ్‌ రేట్ల పెంపుతో మూలధన ప్రవాహం అమెరికా వైపు మళ్లగా, అనేక దేశాల కరెన్సీతో డాలరు విలువ పెరిగిపోయింది. ఫలితంగా కరెంటు ఖాతాల్లో లోటు (సిఎడి) విస్తృతమై, దిగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ పెరుగుదల ఒత్తిడికి దారితీసింది.

   వడ్డీ రేట్ల పెంపు, నిరంతర ద్రవ్యోల్బణం కూడా 2022, 2023 సంవత్సరాలకు ప్రపంచ వృద్ధి అంచనాలను ‘ఐఎంఎఫ్‌’ తగ్గించేందుకు దారితీశాయి. ఈ మేరకు 2022 అక్టోబరులో సవరించిన ప్రపంచ ఆర్థిక దృక్పథ అంచనాలను ‘ఐఎంఎఫ్‌’ ప్రకటించింది. చైనా ఆర్థిక వ్యవస్థకు బీటలువారడటం కూడా వృద్ధి అంచనాలను తగ్గించేందుకు దోహదపడింది. అంతేగాక మందగిస్తున్న ప్రపంచ వృద్ధికితోడు ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లోని ఆర్థికేతర రంగ రుణాలు ఎక్కువైన నేపథ్యంలో అవి కఠిన ద్రవ్య విధాన చర్యలు చేపట్టడం వల్ల ఆర్థిక కుంగుబాటు వ్యాప్తికి దారితీయవచ్చు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం కొనసాగుతుండటం, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు మరింత పెంచాలని సూచిస్తుండటం వంటి పరిణామాలతో ప్రపంచ ఆర్థిక అంచనాలపై ప్రతికూలత ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది.

భారత ఆర్థిక ప్రతిరోధం - వృద్ధి చోదకాలు

   ఆర్‌బిఐ ద్వారా కఠిన ద్రవ్య విధాన చర్యలు, ‘సిఎడి’ విస్తరణ, ఎగుమతుల వృద్ధి మందగించడం వంటి అంశాలు ఐరోపాలో భౌగోళిక-రాజకీయ ఘర్షణణల ఫలితమేనని సర్వే స్పష్టంగా చెప్పింది. ఈ పరిణామాలు ఆర్థిక సంవత్సరం-23లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రతికూలత ముప్పు తెచ్చిపెట్టినందున ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను దిగువకు సవరించడం ప్రారంభించాయని తెలిపింది. ఈ మేరకు ‘ఎన్‌ఎస్‌ఒ’ విడుదల చేసిన ముందస్తు అంచనాలుసహా అన్నిరకాల అంచనాలూ ఇప్పుడు విస్తృతంగా వృద్ధి పరిధిని 6.5-7.0 శాతంగా చూపుతున్నాయి.

 

 

   అంచనాలు దిగువకు సవరించబడినా ఆర్థిక సంవత్సరం-23 వృద్ధి అంచనా మాత్రం దాదాపు అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలకన్నా అధికంగానే ఉంది. అంతేకాదు... మహమ్మారికి దారితీసిన దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ సగటు వృద్ధికన్నా ఇది కాస్త ఎక్కువేనని చెప్పాలి. ప్రపంచంలో 2022 సంవత్సరం వేగంగా పురోగమిస్తున్న రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా ఉందని ‘ఐఎంఎఫ్‌’ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నా, దేశీయంగా కఠిన ద్రవ్య విధానం అవలంబిస్తున్నా, మరోవైపు పునాది ప్రభావ అనుకూలత లేకున్నా భారత్‌ 6.5-7.0 శాతం వృద్ధి సాధించగలదన్న అంచనాలు మన దేశ ఆర్థిక ప్రతిరోధకతను నిరూపిస్తున్నాయి. ఆ మేరకు కోలుకోగల సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకాలను శక్తిమంతం చేయడంలో దేశీయ ఉద్దీపనలు నిరంతరం బాహ్య ఉద్దీపనలను భర్తీ చేస్తుండటం భారత ఆర్థిక ప్రతిరోధకతకు నిదర్శనం. ఆర్థిక సంవత్సరం-23 ద్వితీయార్థంలో ఎగుమతుల వృద్ధి మధ్యస్థంగా ఉండవచ్చు. కానీ, ఆర్థిక సంవత్సరం-22తోపాటు 2023 ప్రథమార్థంలో ఎగుమతుల వృద్ధి పెరుగుదల ఉత్పత్తి ప్రక్రియలను స్వల్ప వేగంనుంచి శరవేగ స్థాయికి చేర్చింది.

   తదనుగుణంగా తయారీ, పెట్టుబడి కార్యకలాపాలు గాడినపడ్డాయి. ఎగుమతుల వృద్ధిని నియంత్రించే సమయానికి దేశీయ వినియోగం పుంజుకుని భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి తగినంతగా పరిపక్వం చెందింది. ఆర్థిక సంవత్సరం-23లో వాణిజ్య.. హోటల్‌.. రవాణా రంగాల సేవలు పుంజుకోగా రెండో త్రైమాసికానికి జీడీపీలో ప్రైవేటు వినియోగం 58.4 శాతానికి చేరి 2013-14 నుంచి అన్ని సంవత్సరాల రెండో  త్రైమాసికాలతో పోలిస్తే ఎక్కువగా నమోదైంది. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం-23లో రెండో త్రైమాసికంలో 16 శాతం వరుసకాలపు వృద్ధిని నమోదు చేసింది.

 

   అనేక ఆర్థిక వ్యవస్థల్లో దేశీయ వినియోగం పుంజుకున్నప్పటికీ భారతదేశంలో అత్యధిక స్థాయిలో పుంజుకోవడం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. దేశీయ సామర్థ్య వినియోగం పెరగడానికి ఇది తోడ్పడింది. ఆ మేరకు 2022 నవంబరులో దేశీయ ప్రైవేట్ వినియోగం ప్రోత్సాహకరంగా ఉంది. అంతేగాక వినియోగదారుల విశ్వాసంపై ‘ఆర్‌బిఐ’ 2022 డిసెంబరులో వెల్లడించిన తన తాజా సర్వే నివేదికలో ప్రస్తుత, భవిష్యత్‌ ఉపాధి-ఆదాయ పరిస్థితులపై ప్రజా విశ్వాసం మెరుగుపడగలదని స్పష్టం చేసింది.

 

సర్వే మరొక పునరుత్తేజాన్ని కూడా సూచిస్తుంది.   గృహ రుణాలకు డిమాండ్ పుంజుకోవడంతో హౌసింగ్ మార్కెట్‌లో కూడా " పెరిగిన డిమాండ్ బైట పడటాన్ని " ప్రతిబింబించిందని పేర్కొంది. పర్యవసానంగా, అమ్ముడవని గృహాలు తగ్గాయి, గృహాల ధరలు పెరుగుతున్నాయి. కొత్త నివాసాల నిర్మాణం వేగాన్ని పుంజుకుంది.  ఇది నిర్మాణ రంగానికి చెందిన అసంఖ్యాక వెనుక మరియు ముందు అనుబంధ రంగాల అనుసంధానాలను ప్రేరేపించింది. వ్యాక్సినేషన్ కవరేజ్ యొక్క సార్వత్రికీకరణ కూడా హౌసింగ్ మార్కెట్‌ను పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిచింది, ఎందుకంటే వ్యాక్సినేషన్ చేయకుంటే వలస వచ్చిన కార్మికులు కొత్త నివాసాలను నిర్మించడానికి తిరిగి రాలేరు.

 

కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల  మూలధన బడ్జెట్ (కాపెక్స్) చాలా పెరగటం వల్ల అలాగే  మూలధన పనులు వేగంగా అమలు చేయబడుతున్నందున గృహనిర్మాణం మాత్రమే కాకుండా, సాధారణ నిర్మాణ కార్యకలాపాలు ఎఫ్ వై 23లో గణనీయంగా పెరిగాయి.

 

మూలధన ( కాపెక్స్) గుణకం అంచనా ప్రకారం, దేశం యొక్క ఆర్థిక ఉత్పత్తి  మూలధన(కాపెక్స్) మొత్తం కంటే కనీసం నాలుగు రెట్లు పెరుగుతుంది. రాష్ట్రాలు మొత్తంగా వారి కాపెక్స్ ప్రణాళికలతో మంచి పనితీరును కనబరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వలె, రాష్ట్రాలు కూడా మూలధన పనుల కోసం కేంద్రం యొక్క గ్రాంట్-ఇన్-ఎయిడ్ మద్దతు అలాగే 50 సంవత్సరాలలో తిరిగి చెల్లించే వడ్డీ రహిత రుణం మద్దతు  ద్వారా పెద్ద మూలధన బడ్జెట్‌లు అమలు చేస్తున్నారు.

 

అలాగే, భారత ప్రభుత్వం యొక్క చివరి రెండు బడ్జెట్‌లలో  ఒక ప్రత్యేక కాపెక్ష్ దృష్టి దేశంలోని మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడానికి మాత్రమే ఉద్దేశించిన ఒక వివిక్త చొరవ కాదు. ఇది వ్యూహాత్మం కాని పీ ఎస్ యూ ల అమ్మకాలు ద్వారా (డిజిన్వెస్ట్‌మెంట్)  మరియు నిష్క్రియంగా ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తులను ఖాళీ చేసి వాటి స్థానం లో విస్తృతమైన ఆర్థిక పరిధి లోకి ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షించే లక్ష్యంతో చేసిన వ్యూహాత్మక ప్యాకేజీలో భాగం.

ఇక్కడ మూడు పరిణామాలు మొదటిది ఎఫ్ వై 23లో కాపెక్స్ బడ్జెట్‌లో గణనీయమైన పెరుగుదలకు అలాగే దాని అధిక వ్యయం రేటుకు మద్దతు ఇస్తున్నాయి, రెండవది ప్రత్యక్ష పన్నుల రాబడి వసూళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నాయి మరియు జీ ఎస్ టీ వసూళ్లు కూడా బాగా ఉన్నాయి,2022 జనవరి-మార్చి త్రైమాసికం నుండి కాపెక్స్‌లో అధిక వృద్ధి,  బడ్జెట్ ద్రవ్య లోటు లోపలే కాపెక్స్ బడ్జెట్ పూర్తి ఖర్చులు. మూడవదిగా ప్రైవేట్ రంగ పెట్టుబడులు పుంజుకోవడానికి ఆదాయ వ్యయాల పెరుగుదల పరిమితం చేయబడింది. ప్రైవేట్ రంగం ప్రకటించిన ప్రాజెక్ట్‌లు మరియుపెరుగుతున్న క్యాపెక్స్ ఖర్చులు ఈ ధోరణికి సాక్ష్యం చూపుతోంది

 

ఎగుమతుల డిమాండ్‌లో పెరుగుదల, వినియోగం పుంజుకోవడం మరియు పబ్లిక్ క్యాపెక్స్, కార్పోరేట్ పెట్టుబడి/తయారీ కార్యకలాపాలలో పునరుద్ధరణకు దోహదపడగా, వారి బలమైన బ్యాలెన్స్ షీట్‌లు కూడా వారి వ్యయ ప్రణాళికలను సాకారం చేయడంలో పెద్ద పాత్ర పోషించాయి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ నుండి నాన్-ఫైనాన్షియల్ డెట్ డేటా ప్రకారం, గత దశాబ్ద కాలంలో, భారతీయ నాన్-ఫైనాన్షియల్ ప్రైవేట్ సెక్టార్ డెట్ మరియు నాన్-ఫైనాన్షియల్ కార్పోరేట్ అప్పులు వాటా జీ డీ పీ లో దాదాపు ముప్పై బేసిస్ పాయింట్లు శాతం  తగ్గాయి.

 

2022 జనవరి-మార్చి త్రైమాసికం నుండి రుణం లో సంవత్సరానికి వార్షిక వృద్ధి రెండంకెలకు చేరుకోవడం మరియు చాలా రంగాలలో రుణాల కోసం డిమాండ్‌ పెరుగుతున్నందున భారతదేశంలోని బ్యాంకింగ్ రంగం కూడా రుణాల కోసం డిమాండ్‌కు సమాన స్థాయిలో స్పందించింది.

 

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితి గణనీయమైన మార్పును పొందింది, లాభాలు క్రమ వ్యవధిలో బుక్ చేయబడుతున్నాయి మరియు వాటి నిరర్ధక ఆస్తులు (NPAలు) త్వరిత పరిష్కారం/లిక్విడేషన్ కోసం దివాలా మరియు దివాలా బోర్డ్  (IBBI) ద్వారా వేగంగా ట్రాక్ చేయబడ్డాయి. అదే సమయంలో, ప్రభుత్వం పీ ఎస్ బీ లను బాగా క్యాపిటలైజ్ చేయడానికి తగిన బడ్జెట్ మద్దతును అందిస్తోంది, వాటి క్యాపిటల్ రిస్క్-వెయిటెడ్ అడ్జస్టెడ్ రేషియో (CRAR) పరిమిత స్థాయిల కంటే సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఎఫ్ వై 23లో ఇప్పటివరకు కార్పొరేట్ బాండ్‌లు మరియు ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్‌లు (ECBలు) అందించిన తక్కువ డెట్ ఫైనాన్సింగ్‌ను బ్యాంకులు భర్తీ చేయడానికి ఆర్థిక బలం సహాయపడింది. కార్పొరేట్ బాండ్లపై పెరుగుతున్న రాబడులు మరియు ఈ సీ బీ లపై అధిక వడ్డీ/హెడ్జింగ్ ఖర్చులు ఈ సాధనాలను మునుపటి సంవత్సరం కంటే తక్కువ ఆకర్షణీయంగా మార్చాయి.

 

ఆర్‌బిఐ ఎఫ్‌వై 23లో ప్రధాన ద్రవ్యోల్బణం 6.8 శాతంగా అంచనా వేసింది, ఇది లక్ష్య పరిధికి వెలుపల ఉంది. అదే సమయంలో, ఇది ప్రైవేట్ వినియోగాన్ని నిరోధించేంత ఎక్కువగా ఉండదు అలాగే పెట్టుబడి పెట్టే ప్రేరణను బలహీనపరిచేంత తక్కువ కాదు.

 

భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థిక మరియు వృద్ధి సవాళ్లు

 

ఎఫ్‌వై 21లో కనిపించిన గణనీయమైన జీ డీ పీ సంకోచంలో  మహమ్మారి యొక్క రెండు తరంగాల ప్రభావం తర్వాత ఒమిక్రాన్ యొక్క మూడవ వేవ్‌లో వైరస్ నుండి త్వరగా కోలుకోవడం 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక ఉత్పత్తి నష్టాన్ని తగ్గించడానికి దోహదపడింది. తత్ఫలితంగా, ఎఫ్‌వై 22లో అవుట్‌పుట్ ఎఫ్‌వై 20లో దాని ప్రీ-పాండమిక్ స్థాయిని అధిగమించింది, అనేక దేశాల కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి పునరుద్ధరణను ప్రదర్శిస్తోంది. అయితే, ఐరోపాలోని సంఘర్షణ ఎఫ్‌వై 23లో ఆర్థిక వృద్ధి మరియు ద్రవ్యోల్బణం  అంచనాలను సవరించాల్సిన అవసరం ఏర్పడింది. దేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి 2022లో ఆర్ బీ ఐ యొక్క భరించే  పరిధి కంటే ఎక్కువగా ఉంది, నవంబర్ 2022లో లక్ష్యం 6 శాతం నుంచి దిగువకు తిరిగి రావడానికి ముందు,  పది నెలల పాటు లక్ష్య శ్రేణి కంటే ఎక్కువగా ఉంది.

 

గ్లోబల్ కమోడిటీ ధరలు సడలించిబడ్డాయి కానీ సంఘర్షణకు ముందు స్థాయిలతో పోల్చితే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని భారతదేశ వృద్ధి ఊపందుకోవడం ద్వారా ఇప్పటికే విస్తరించిన సీ ఏ డీ ని మరింత విస్తృతం చేశాయని పేర్కొంది. ఎఫ్‌వై 23 కోసం, సీ ఏ డీ కి ఆర్థిక సహాయం చేయడానికి అలాగే భారత రూపాయిలో అస్థిరతను నిర్వహించడానికి ఫారెక్స్ మార్కెట్‌లో జోక్యం చేసుకోవడానికి భారతదేశం తగినంత ఫారెక్స్ నిల్వలను కలిగి ఉంది.

 

భవిష్య దృష్టి: 2023-24

 

మహమ్మారి నుండి భారతదేశం కోలుకోవడం చాలా త్వరగా జరిగిందని, రాబోయే సంవత్సరంలో వృద్ధికి దేశీయ డిమాండ్ మరియు మూలధన పెట్టుబడులు పుంజుకుంటాయని సర్వే పేర్కొంది.  ఆరోగ్యకరమైన ఆర్థిక సహాయంతో  ప్రైవేట్ రంగ కొత్త మూలధన నిర్మాణ చక్రం యొక్క ప్రారంభ సంకేతాలు కనిపిస్తున్నాయి, మరింత ముఖ్యంగా మూలధన వ్యయంలో ప్రైవేట్ రంగం యొక్క అతిజాగ్రత్తకు ప్రత్యామ్నయంగా ప్రభుత్వం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచింది.

 

బడ్జెట్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎఫ్‌వై16 నుండి ఎఫ్‌వై23 వరకు 2.7 రెట్లు పెరిగింది, ఇది కాపెక్స్ చక్రాన్ని తిరిగి ఉత్తేజపరిచింది. వస్తువులు మరియు సేవల పన్ను, దివాలా మరియు దివాలా కోడ్ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మరియు పారదర్శకతను మెరుగుపరిచాయి. ఆర్థిక క్రమశిక్షణ మరియు మెరుగైన సమ్మతిని నిర్ధారించాయని సర్వే పేర్కొంది. ఐ ఎం ఎఫ్  వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్, అక్టోబర్ 2022 ప్రకారం ప్రపంచ వృద్ధి 2022లో 3.2 శాతం నుండి 2023లో 2.7 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడింది. పెరిగిన అనిశ్చితితో పాటు ఆర్థిక ఉత్పత్తి నెమ్మదిగా వృద్ధి చెందడం వాణిజ్య వృద్ధిని తగ్గిస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనాలోకూడా 2022లో 3.5 శాతం నుండి 2023లో 1.0 శాతానికి ప్రపంచ వాణిజ్య వృద్ధిలో తరుగుదల కనిపిస్తుంది. బాహ్యంగా కరెంట్ ఖాతా బ్యాలెన్స్‌కు రిస్క్‌లు పలు వైపుల నుండి ఉత్పన్నమవుతాయి. కమోడిటీ ధరలు రికార్డు స్థాయిలో గరిష్ఠ స్థాయిల నుండి వెనక్కి తగ్గినప్పటికీ, అవి ఇప్పటికీ సంఘర్షణకు ముందు స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నాయి. వస్తువుల అధికధరలకు తోడు బలమైన దేశీయ డిమాండ్ భారతదేశం యొక్క మొత్తం దిగుమతి బిల్లును పెంచుతుంది అలాగే కరెంట్ ఖాతా బ్యాలెన్స్‌లో అననుకూల పరిణామాలకు దోహదం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడం వల్ల ఎగుమతి వృద్ధి యదావిధిగా ఉండటం వల్ల ఇది మరింత తీవ్రతరం కావచ్చు. కరెంటు ఖాతా లోటు మరింత పెరిగితే, రూపాయి విలువ తరుగుదల ఒత్తిడికి లోనవుతుంది. స్థిరపడిన ద్రవ్యోల్బణం బిగుతుగా మారే చక్రాన్ని పొడిగించవచ్చు,  అందువల్ల రుణ ఖర్చులు 'ఎక్కువ కాలం' ఉండవచ్చు. అటువంటి సందర్భంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎఫ్‌వై 24లో తక్కువ వృద్ధిని నమోదు చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ,  ప్రపంచ వృద్ధి మందగమనం యొక్క దృశ్యం రెండు శుభ సూచికలను అందిస్తుంది, చమురు ధరలు తక్కువగా ఉంటాయి మరియు భారతదేశం యొక్క సీ ఏ డీ ప్రస్తుతం అంచనా వేసిన దాని కంటే మెరుగ్గా ఉంటుంది, అలాగే మొత్తం బాహ్య పరిస్థితిని నిర్వహించదగినదిగా ఉంటుంది.

 

భారతదేశ సమ్మిళిత వృద్ధి

 

ఉద్యోగాలను సృష్టించినప్పుడు వృద్ధి  సమ్మిళితంగా ఉంటుందని సర్వే నొక్కి చెప్పింది. సెప్టెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల పట్టణ నిరుద్యోగిత రేటు 9.8 శాతం నుండి ఒక సంవత్సరం తర్వాత 7.2 శాతానికి (సెప్టెంబర్ 2022తో ముగిసే త్రైమాసికం) క్షీణించిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) చూపినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి స్థాయిలు పెరిగాయని అధికారిక మరియు అనధికారిక వర్గాలు ధృవీకరించాయి.  ఇది శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR)లో మెరుగుదలతో పాటు, ఎఫ్‌వై 23 ప్రారంభంలో మహమ్మారి ప్రేరిత మందగమనం నుండి ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుత్తేజాన్ని నిర్ధారిస్తుంది.

 

ఎఫ్‌వై 21లో, ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని ప్రకటించింది, ఇది సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షించడంలో విజయవంతమైంది. ఇటీవలి సిబిల్ నివేదిక (ECLGS అంతర్దృష్టులు, ఆగష్టు 2022) కోవిడ్ షాక్‌ను ఎదుర్కోవడంలో ఎమ్ ఎస్ ఎం ఈ లకు ఈ పథకం మద్దతునిచ్చిందని చూపింది, ఈ సి ఎల్ జీ ఎస్ (ECLGS) ని పొందిన రుణగ్రహీతలలో 83 శాతం మంది మైక్రో-ఎంటర్‌ప్రైజెస్. ఈ మైక్రో యూనిట్లలో, సగానికి పైగా మొత్తం రూ.10 లక్షల కంటే తక్కువ రుణంతీసుకున్నారు.

 

ఇంకా, సిబిల్ డేటా కూడా ఈ సి ఎల్ జీ ఎస్ కి అర్హత ఉన్న ఎంటర్‌ప్రైజెస్ కంటే ఈ సి ఎల్ జీ ఎస్ రుణగ్రహీతలు తక్కువ నిరర్థక ఆస్తుల రేట్లు కలిగి ఉన్నారని చూపిస్తున్నా కానీ వారు దాని నుండి ప్రయోజనం పొందలేదు. ఇంకా, ఎఫ్‌వై 21లో వ్యాపారం క్షీణించిన తర్వాత ఎమ్ ఎస్ ఎం ఈ లు చెల్లించే జీ ఎస్ టీ చెల్లింపులు, ఎమ్ ఎస్ ఎం ఈ లను లక్ష్యంగా చేసుకున్న ముందస్తు ప్రభుత్వ జోక్యం యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ, చిన్న వ్యాపారాల యొక్క ఆర్థిక  సామర్ధ్యం తో వృద్ధి ఎఫ్‌వై 20  ప్రీ-పాండమిక్ స్థాయిని ఇప్పుడు దాటింది.

 

అంతేగాక, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద ప్రభుత్వం అమలు చేసిన పథకం  "వ్యక్తిగత భూమిపై పనుల" విషయంలో ఇతర ఏ కేటగిరీల కంటే వేగంగా ఎక్కువ ఆస్తులను సృష్టిస్తోంది. అదనంగా, పీ ఎం- కిసాన్ వంటి పథకాలు,  జనాభా లో సగం ఉన్న  గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయి, పీ ఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలు దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడ్డాయి.

 

జూలై 2022  యూ ఎన్ డీ పీ నివేదిక భారతదేశంలో ఇటీవలి పెరిగిన ద్రవ్యోల్బణం తగ్గించే లక్ష్యం గా ఇచ్చే మద్దతు కారణంగా  పేదల పై తక్కువ ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. అదనంగా, భారతదేశంలోని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ఎఫ్‌వై 16 నుండి ఎఫ్‌వై 20 వరకు లింగం, సంతానోత్పత్తి రేటు, గృహ సౌకర్యాలు మరియు మహిళా సాధికారత వంటి సూచికలలో మెరుగైన గ్రామీణ సంక్షేమ సూచికలను చూపుతుంది.

 

రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా ఏర్పడిన బాహ్య అసమతుల్యతలను తగ్గించే సవాలును ఎదుర్కొన్నందున, ఈ ప్రక్రియలో వృద్ధి వేగాన్ని కోల్పోకుండా భారతదేశం తన ఆర్థిక స్థితిస్థాపకతపై దేశం యొక్క నమ్మకాన్ని ఇప్పటివరకు బలోపేతం చేసింది. సీ వై 22లో భారతదేశ స్టాక్ మార్కెట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఉపసంహరణల వల్ల అవాక్కయినా సానుకూల రాబడిని పొందాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాలు మరియు ప్రాంతాలతో పోల్చితే భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం రేటు దాని సహనశక్తి కంటే చాలా ఎక్కువగా లేదు.

 

భారతదేశం పీ పీ పీ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు మార్కెట్ మారకపు ధరలలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.  దేశం ఊహించినట్లుగా, ఎఫ్ వై 23లో భారత ఆర్థిక వ్యవస్థ కోల్పోయిన వాటిని దాదాపుగా "తిరిగి" పొందింది, ఆగిన వాటిని "పునరుద్ధరించింది"  మహమ్మారి సమయంలో మరియు ఐరోపాలో సంఘర్షణ నుండి మందగించిన వాటిని "పునరుద్ధరణ" చేసింది.

 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లతో పోరాడుతోంది

 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆరు సవాళ్ల గురించి ఈ సర్వే వివరించింది. ఆర్థిక వ్యవస్థలలో కొవిడ్-19 సంబంధిత అంతరాయాలు, రష్యన్-ఉక్రెయిన్ వివాదం మరియు దాని ప్రతికూల ప్రభావం ప్రధానంగా ఆహారం, ఇంధనం మరియు ఎరువుల సరఫరా గొలుసులో అంతరాయం వంటి మూడు సవాళ్లు  మరియు ఫెడరల్ రిజర్వ్ నేతృత్వంలోని ఆర్థిక వ్యవస్థల్లోని సెంట్రల్ బ్యాంక్‌లు సమకాలీకరించబడిన పాలసీ రేటు పెంపుతో ప్రతిస్పందిస్తున్నాయి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి చేసిన ఈ పని వల్ల  యూ ఎస్ డాలర్ విలువ పెరగడానికి, నికర దిగుమతి ఆర్థిక వ్యవస్థలలో కరెంట్ ఖాతా లోటుల (CAD) విస్తరణకు దారితీసింది. నాల్గవ సవాలు గ్లోబల్ స్టాగ్‌ఫ్లేషన్ పరిణామాలు వల్ల  ఉద్భవించింది, దేశాలు, తమ సంబంధిత ఆర్థిక వాణిజ్య స్థలాన్ని కాపాడుకోవలసి వస్తుంది, తద్వారా సరిహద్దు వాణిజ్యం మందగించడం మొత్తం వృద్ధిని ప్రభావితం చేస్తుంది. చైనా తన విధానాల వల్ల గణనీయమైన మందగమనాన్ని ఎదుర్కొన్నందున ఐదవ సవాలు తీవ్రంగా ఉంది.  వచ్చిన మహమ్మారి వల్ల విద్య మరియు ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కోల్పోవడం వృద్ది కి వచ్చిన ఆరవ మధ్యకాలిక సవాలు.

 

ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే, భారతదేశం కూడా ఈ అసాధారణ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, చాలా ఆర్థిక వ్యవస్థల కంటే వాటిని బాగా ఎదుర్కొందని సర్వే పేర్కొంది.

 

గత పదకొండు నెలల్లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రెండేళ్లలో మహమ్మారి కారణంగా వచ్చినన్ని  అంతరాయాలకు దాదాపు సమానమైన అంతరాయాలను ఎదుర్కొంది. రష్యన్-ఉక్రెయిన్ వివాదం ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, గోధుమలు వంటి కీలకమైన వస్తువుల ధరలు పెరగడానికి కారణమయ్యాయి. 2020లో అవుట్‌పుట్ సంకోచాన్ని పరిమితం చేయడానికి చేపట్టిన భారీ ఆర్థిక ఉద్దీపనలు మరియు అల్ట్రా-అకమోడేటివ్ మానిటరీ పాలసీల మద్దతుతో ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రేరేపించిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఇది బలపరిచింది. ప్రపంచ ఆర్థిక విస్తరణకు చాలా వరకు కారణమైన అభివృద్ధి చెందిన దేశాల (AEలు) ద్రవ్యోల్బణం మరియు ద్రవ్య సడలింపు, చారిత్రక గరిష్టాలను ఉల్లంఘించింది. పెరుగుతున్న కమోడిటీ ధరలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల (EMEలు)లో అధిక ద్రవ్యోల్బణానికి దారితీశాయి. అవి 2020లో అవుట్‌పుట్ సంకోచాన్ని పరిష్కరించడానికి వారి ప్రభుత్వాలు క్రమాంకనం చేసిన ఆర్థిక ఉద్దీపనను చేపట్టడం వల్ల తక్కువ ద్రవ్యోల్బణం పరిది లో ఉన్నాయి.

 

ద్రవ్యోల్బణం మరియు ద్రవ్య బిగింపు ఆర్థిక వ్యవస్థల్లో బాండ్ దిగుబడులు గట్టిపడటానికి దారితీసిందని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఆర్థిక వ్యవస్థల నుండి సాంప్రదాయకంగా సురక్షితమైన యూ ఎస్ మార్కెట్‌లోకి ఈక్విటీ మూలధనం ప్రవహించిందని సర్వే నొక్కి చెప్పింది. పెట్టుబడులు ఎగిరిపోవటం తదనంతరం ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా యూ ఎస్ డాలర్ బలపడటానికి దారితీసింది  జనవరి మరియు సెప్టెంబర్ 2022 మధ్య యూ ఎస్ డాలర్ ఇండెక్స్ 16.1 శాతం బలపడింది. ఫలితంగా ఇతర కరెన్సీల తరుగుదల వల్ల సీ ఏ డి ని పెంచింది అలాగే నికర దిగుమతిలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచుతోంది.

***



(Release ID: 1895218) Visitor Counter : 7459